ICC టెస్ట్ ర్యాంకింగ్‌లో టీమిండియా పేసర్ మహమ్మద్ సిరాజ్ 12 స్థానాలు ఎగబాకాడు. భారత ఓపెనర్ యశస్వి జైస్వాల్ టాప్ 5లోకి వచ్చాడు. భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన 5వ టెస్ట్ తర్వాత  ICC బుధవారం (ఆగస్టు 6న) ర్యాంకింగ్‌లను విడుదల చేసింది. సిరాజ్ ఇంతకుముందు టెస్ట్ బౌలింగ్ ర్యాంకింగ్స్2లో 27వ స్థానంలో ఉన్నాడు. తాజాగా 15వ స్థానానికి చేరుకున్నాడు. టెస్ట్ బ్యాటింగ్ ర్యాంకింగ్‌లో జైస్వాల్ 5వ స్థానానికి చేరుకున్నాడు. బౌలింగ్ ర్యాంకింగ్‌లో రవీంద్ర జడేజా 3 స్థానాలు కోల్పోయి 14 నుంచి 17వ స్థానానికి పడిపోయాడు.

Continues below advertisement


మహమ్మద్ సిరాజ్ టెస్ట్ బౌలింగ్‌ ర్యాంకింగ్


 ఇంగ్లాండ్‌తో జరిగిన 5వ టెస్ట్‌లో సిరాజ్ మొత్తం 9 వికెట్లు తీశాడు. అతను తొలి ఇన్నింగ్స్ లో 4 వికెట్లు, రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీశాడు. సిరాజ్ అద్భుత బౌలింగ్ ప్రదర్శనతో ఉత్కంఠపోరులో భారత్ 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. సిరాజ్‌ను బెస్ట్ ప్లేయర్ గా ఎంపిక చేశారు. సిరీస్ లో బెస్ట్ బౌలింగ్ తో 23 వికెట్లు తీసి లీడింగ్ వికెట్ టేకర్ గా నిలిచిన సిరాజ్ ICC ర్యాంకింగ్‌లో ఏకంగా 12 స్థానాలు ఎగబాకాడు.  మహమ్మద్ సిరాజ్ 674 రేటింగ్‌తో ICC టెస్ట్ బౌలింగ్ ర్యాంకింగ్‌లో 15వ స్థానంలో ఉన్నాడు. ఇంతకు ముందు 27వ స్థానంలో ఉన్నాడు.


టెస్ట్ ర్యాంకింగ్‌లో టాప్ 5 బౌలర్ల జాబితా, వారి రేటింగ్


ఐసీసీ టెస్ట్ బౌలర్ల జాబితాలో భారత పేసర్ జస్ప్రిత్ బుమ్రా నెంబర్ వన్ ‌గా కొనసాగుతున్నాడు. రెండో స్థానంలో ఉన్న రబాడ కంటే బుమ్రా ఖాతాలో 38 రేటింగ్ పాట్లు ఎక్కువగా ఉన్నాయి. పాట్ కమిన్స్ 3, మాట్ హెన్రీ 4, జోష్ హేజిల్‌వుడ్ 5వ స్థానంలో ఉన్నారు.



  • జస్ప్రీత్ బుమ్రా (భారత్)- 889 

  • కగిసో రబాడ (సౌత్ ఆఫ్రికా)- 851 

  • పాట్ కమ్మిన్స్ (ఆస్ట్రేలియా)- 838

  • మాట్ హెన్రీ (న్యూజిలాండ్)- 817

  • జాష్ హేజిల్‌వుడ్ (ఆస్ట్రేలియా)- 815




యశస్వి జైస్వాల్ టాప్ 5 బ్యాట్స్‌మెన్‌లలో చేరాడు


ఐదవ టెస్ట్‌లో సెంచరీ సాధించిన ఏకైక భారతీయ బ్యాట్స్‌మన్ యశస్వి జైస్వాల్ ICC టెస్ట్ బ్యాటింగ్ ర్యాంకింగ్‌లో 3 స్థానాలు ఎగబాకాడు. అతను టాప్ 5లో చేరాడు, అతను ఇంతకు ముందు 8వ స్థానంలో ఉన్నాడు మరియు ఇప్పుడు 792 రేటింగ్‌తో ఐదవ స్థానానికి చేరుకున్నాడు. ఇంగ్లాండ్ ఆటగాడు హ్యారీ బ్రూక్ ఒక స్థానం ఎగబాకి రెండో స్థానానికి చేరుకున్నాడు. నంబర్ 1 టెస్ట్ బ్యాట్స్‌మన్ కిరీటం జో రూట్ వద్దే ఉంది, అతను 5వ టెస్ట్‌లో సెంచరీ కూడా సాధించాడు.




టెస్ట్ ర్యాంకింగ్‌లో టాప్ 5 బ్యాట్స్‌మెన్‌ల జాబితా, వారి రేటింగ్


ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ 908 రేటింగ్ పాయింట్లతో టాప్ పాజిషన్ కొనసాగిస్తున్నాడు. ఇంగ్లాండ్ కే చెందిన హ్యారీ బ్రూక్ 2, కేన్ విలియమ్సన్ 3, స్టీవ్ స్మిత్ 4, యశస్వీ జైస్వాల్ 5వ స్థానాల్లో నిలిచారు.



  • జో రూట్ (ఇంగ్లాండ్)- 908

  • హ్యారీ బ్రూక్ (ఇంగ్లాండ్)- 868

  • కేన్ విలియమ్సన్ (న్యూజిలాండ్)- 858

  • స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా)- 816

  • యశస్వి జైస్వాల్ (భారత్)- 792


టెస్ట్ ఆల్ రౌండర్ ర్యాంకింగ్‌లో మార్పులు 


టెస్ట్‌లో నంబర్ 1 ఆల్ రౌండర్‌గా రవీంద్ర జడేజా కొనసాగుతున్నాడు. ఇంతకు ముందు 7వ స్థానంలో ఉన్న జో రూట్ ఇప్పుడు 8వ స్థానానికి పడిపోయాడు. గస్ అట్కిన్సన్ ఒక స్థానం ఎగబాకి 9వ స్థానానికి చేరుకున్నాడు. టాప్ 5 లో ఎలాంటి మార్పు లేదు. 




టెస్ట్‌లో టాప్ 5 ఆల్ రౌండర్ ప్లేయర్ల జాబితా


టెస్టు ఆల్ రౌండర్లలో జడేజా ఆదిపత్యం కొనసాగుతోంది. 405 రేటింగ్ పాయింట్లతో జడేజా నెంబర్ వన్ గా కొనసాగుతున్నాడు. రెండో స్థానంలో ఉన్న మెహదీ హసన్ కంటే ఏకంగా 100 రేటింగ్ పాయింట్లు అధికంగా జడేజా ఖాతాలో ఉన్నాయి. బెన్ స్టోక్స్ 3, వియాన్ ముల్డర్ 4, పాట్ కమిన్స్ 5వ స్థానాల్లో ఉన్నారు.


రవీంద్ర జడేజా (భారత్)- 405
మెహదీ హసన్ (బంగ్లాదేశ్)- 305
బెన్ స్టోక్స్ (ఇంగ్లాండ్)- 295
వియాన్ ముల్డర్ (ఇంగ్లాండ్)- 284
పాట్ కమ్మిన్స్ (ఆస్ట్రేలియా)- 270