ODI World Cup 2023: అక్టోబర్ నుంచి భారత్ వేదికగా జరుగబోయే ఐసీసీ వన్డే  ప్రపంచకప్‌కు  ఆస్ట్రేలియా జట్టును ప్రకటించింది.  15 మంది సభ్యులతో కూడిన  జట్టును  క్రికెట్ ఆస్ట్రేలియా ఫైనల్ చేసింది.  వన్డే ప్రపంచకప్‌ను రికార్డు స్థాయిలో ఏకంగా ఐదు సార్లు నెగ్గిన  ఆస్ట్రేలియాను ఈసారి పాట్ కమిన్స్ నడిపించబోతున్నాడు.  ఆల్ రౌండర్లు,  స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్, ఎఫెక్టివ్ బౌలర్స్‌తో బరిలోకి దిగుతున్న  ఆసీస్  జట్టు ప్రత్యర్థులను కంగారెత్తించేందుకు సిద్ధమవుతోంది.  


నెల రోజుల  క్రితమే ఆస్ట్రేలియా వన్డే వరల్డ్ కప్ కోసం  18 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఇందులో ముగ్గుర్ని తప్పించింది.  ఇక టీమ్ విషయానికొస్తే .. ఆసీస్ సెలక్టర్లు  టోర్నీ ప్రాధాన్యాన్ని దృష్టిలో పెట్టుకుని అనుభవజ్ఞులతో కూడిన  స్ట్రాంగ్ టీమ్‌ను ఎంపిక చేశారు. వారిలో ఎక్కువమంది ఆల్ రౌండర్లే ఉండటం గమనార్హం. ఈ ప్రపంచకప్‌లో ఆసీస్..  ఏకంగా  ముగ్గురు పేస్ ఆల్ రౌండర్లు, ఇద్దరు స్పిన్నర్లు,  ఒక స్పిన్ ఆల్ రౌండర్ , నలుగురు పేసర్లు, ఐదుగురు స్టార్ బ్యాటర్లతో బరిలోకి దిగుతోంది. కానీ  టెస్టులలో వరల్డ్ నెంబర్ వన్ బ్యాటర్‌గా ఉన్న మార్నస్ లబూషేన్ మాత్రం ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. 


 






స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్, అలెక్స్  కేరీ, జోష్ ఇంగ్లిస్‌లు  బ్యాటర్లు (కేరీ, ఇంగ్లిస్‌లు వికెట్ కీపర్ బ్యాటర్లు) గా ఉన్నారు.  మిచెల్ మార్ష్, కామెరూన్ గ్రీన్, మార్కస్ స్టోయినిస్, గ్లెన్ మ్యాక్స్‌వెల్‌లు బంతితో పాటు బ్యాట్‌తోనూ మెరిసే ఆల్ రౌండర్లు.  ఆస్టన్ అగర్, ఆడమ్ జంపాలు   స్పిన్ బాధ్యతలు మోస్తారు.  ఇక పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్,   జోష్ హెజిల్‌వుడ్‌తో పాటు సీన్ అబాట్   పేస్ బౌలర్లుగా ఉన్నారు. నెల రోజుల క్రితం ఎంపిక చేసిన 18 మంది సభ్యులలో ఆల్ రౌండర్ ఆరోన్ హార్డీ, ఫాస్ట్ బౌలర్ నాథన్ ఎల్లిస్, యువ స్పిన్నర్ తన్వీర్ సంఘాలకు మాత్రం వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కలేదు. 


వన్డే వరల్డ్ కప్‌కు ఆసీస్ జట్టు : పాట్ కమిన్స్ (కెప్టెన్), సీన్ అబాట్, ఆస్టన్ అగర్, అలెక్స్ కేరీ, కామెరూన్ గ్రీన్, జోష్ హెజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, గ్లెన్ మ్యాక్స్‌వెల్,  స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోయినిస్, డేవడ్ వార్నర్, ఆడమ్ జంపా 


 































ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి   
Join Us on Telegram: https://t.me/abpdesamofficial