Ranji Trophy 2024:  దేశవాళీ అత్యున్నత క్రికెట్‌ టోర్నీ రంజీ ట్రోఫీ(Ranji Trophy)కి రంగం సిద్ధమైంది. 2024 రంజీ ట్రోఫీ సీజన్‌ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఎలిట్‌, ప్లేట్‌ విభాగాలుగా జరిగే ఈ టోర్నీలో 38 జట్లు తలపడనున్నాయి. ఈసారి ఎలీట్‌ గ్రూపులో 32, ప్లేట్‌ డివిజన్‌లో 6 జట్లు తమ అదృష్టం పరీక్షించుకోనుండగా.. సౌరాష్ట్ర డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా బరిలో దిగుతుంది. విశాఖలో బెంగాల్‌తో ఆంధ్ర, దిమాపూర్‌లో నాగాలాండ్‌తో హైదరాబాద్‌ తమ తొలి మ్యాచ్‌ల్లో తలపడతాయి. సౌరాష్ట్ర డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా బరిలో దిగుతుంది. భారత టెస్టు జట్టులో చోటు కోల్పోయిన రహానె (ముంబయి), పుజారా (సౌరాష్ట్ర) రంజీ ట్రోఫీలో ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నారు. 35 ఏళ్ల వెటరన్లు రహానె, పుజార భారీ స్కోర్లు చేయడం ద్వారా సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాలని భావిస్తున్నారు. గత ఏడాది పేలవమైన ప్రదర్శనతో నిరాశ పరిచిన హైదరాబాద్‌ ఈసారి ప్లేట్‌ గ్రూపులో ఆడనుంది. తిలక్‌వర్మ హైదరాబాద్‌ జట్టుకు సారథ్యం వహించనున్నాడు. ఆంధ్ర ఎలైట్‌ గ్రూపు-బిలో ఉంది.

ఎలైట్‌:

 

 గ్రూపు-ఎ: హరియాణా, ఝార్ఖండ్‌, మహారాష్ట్ర, మణిపూర్‌, రాజస్థాన్‌, సౌరాష్ట్ర, సర్వీసెస్‌, విదర్భ

 

గ్రూపు-బి: ఆంధ్ర, అస్సాం, బెంగాల్‌, బిహార్‌, చత్తీస్‌గఢ్‌, కేరళ, ముంబయి, ఉత్తర్‌ప్రదేశ్‌; 

 

గ్రూపు-సి: చండీగఢ్‌, గోవా, గుజరాత్‌, కర్ణాటక, పంజాబ్‌, రైల్వేస్‌, తమిళనాడు, త్రిపుర; 

 

గ్రూపు-డి: బరోడా, దిల్లీ, హిమాచల్‌ప్రదేశ్‌, జమ్మూకాశ్మీర్‌, మధ్యప్రదేశ్‌, ఒడిషా, పాండిచ్చేరి, ఉత్తరాఖండ్‌; ప్లేట్‌ గ్రూపు: నాగాల్యాండ్‌, హైదరాబాద్‌, మేఘలయా, సిక్కిం, మిజోరాం, అరుణాచల్‌ప్రదేశ్‌

 

యువ ఆటగాళ్లకు అవకాశం

కెరీర్‌‌‌‌ చివరి దశలో ఉన్న అజింక్యా రహానె, చతేశ్వర్‌‌‌‌ పుజారా, మయాంక్‌‌‌‌ అగర్వాల్‌‌‌‌, జైదేవ్‌‌‌‌ ఉనాద్కట్‌‌‌‌లాంటి ప్లేయర్లు మరోసారి టీమిండియాలో చోటు సంపాదించాలని భావిస్తున్నారు. రుతురాజ్ గైక్వాడ్‌‌‌‌, అభిమన్యు ఈశ్వరన్‌‌‌‌, సర్ఫరాజ్‌‌‌‌ ఖాన్‌‌‌‌, విద్వత్‌‌‌‌ కావేరప్ప, ఇషాన్‌‌‌‌ పోరెల్‌‌‌‌ ఫ్యూచర్‌‌‌‌ను దృష్టిలో పెట్టుకుని రంజీల్లో సత్తా చాటాలని చూస్తున్నారు. 

 

బరిలోకి క్రీడా మంత్రి

జనవరి 5 నుండి ప్రారంభమయ్యే రంజీ ట్రోఫీ 2024 కోసం బెంగాల్ జట్టును ప్రకటించారు. 18 మంది సభ్యుల జట్టుకు పశ్చిమ బెంగాల్ క్రీడా మంత్రి/ప్లేయర్ మనోజ్ తివారీ నాయకత్వం వహించనున్నారు. తివారీకి ఇదే చివరి టోర్నీ కావడం గమనార్హం. ఈ రంజీ ట్రోఫీతో క్రికెట్‌కు వీడ్కోలు పలకాలని మనోజ్ తివారీ నిర్ణయించుకున్నాడు. విశేషమేమిటంటే.. ఈ పద్దెనిమిది మంది సభ్యుల జట్టులో మహ్మద్ షమీ సోదరుడు మహ్మద్ కైఫ్ చోటు దక్కించుకున్నాడు. 2021లో ముస్తాక్ అలీ టోర్నీ ద్వారా దేశవాళీ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన కైఫ్.. తొలిసారి రంజీ జట్టుకు ఎంపిక కావడం విశేషం. మహ్మద్ షమీలాగే మహ్మద్ కైఫ్ కూడా ఫాస్ట్ బౌలర్. లీస్ట్ ఏ క్రికెట్‌లో 7 మ్యాచ్‌లు ఆడిన అతను ఇప్పటికే 12 వికెట్లు తీశాడు. ఇప్పుడు రంజీ టోర్నీ ద్వారా అందరి దృష్టిని ఆకర్షిస్తానని కైఫ్ ధీమాతో చెబుతున్నాడు.