IND vs ENG 1st Test Day 5: ఇంగ్లండ్, భారత్ మధ్య లీడ్స్‌లో జరుగుతున్న మొదటి టెస్ట్ ఆసక్తిగా సాగుతోంది. 5వ రోజు వికెట్ల కోసం భారత్ బౌలర్లు చెమటొడుస్తున్నారు. ఇంగ్లిష్ బ్యాట్స్‌మెన్ మాత్రం నింపాదిగా లక్ష్యం దిశగా ఆడుకుంటున్నారు. ఆరున్నర గంటలకు ఇంగ్లండ్‌ ఎలాంటి వికెట్లు కోల్పోకుండా 123 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ జట్టుకు బెన్ డకెట్ (69*) జాక్ క్రాలే (44*) అద్భుతమైన ఆటతీరుతో జట్టును ముందుకు తీసుకెళ్తున్నారు. 

Continues below advertisement


ఆఖరి రోజులు మొదటి సెషన్‌ ఆతిథ్య జట్టుకు అద్భుతంగా ఉంది. ఆట ప్రారంభంలో భారత్ కట్టుదిట్టమైన బౌలింగ్ చేసింది. మధ్యలో కాస్త తబడినప్పటికీ లంచ్ విరామానికి ముందు మళ్లీ ఇంగ్లండ్ బ్యాటర్లను ఇబ్బంది పెట్టే బంతులు సంధించారు. అయితే వారి ప్రయత్నాలకు ఇంకా వికెట్ రాకపోవడం మ్యాచ్‌ చేజారుతున్నట్టు కనిపిస్తోంది.


ఆట ప్రారంభమైన మొదటి అవర్‌లో ఆతిథ్య జట్టు తమ సిగ్నేచర్ అటాకింగ్ స్టైల్ బాజ్‌బాల్‌కు పూర్తి విరుద్ధంగా ఆడింది. కేవలం 42 పరుగులు మాత్రమే చేసింది. భారత ఫాస్ట్ బౌలర్లు లైన్‌ అండ్‌ లెంగ్త్‌తో సరిగా వేయడంతో బ్యాటర్లు ఇబ్బంది పడ్డారు. ఎలాంటి బౌలింగ్ వేసినా వికెట్లు రాకపోవడం నిరాశ కలిగిస్తోంది. ఇంగ్లీష్ బ్యాటర్లను తికమక పెట్టే స్వింగ్‌ బౌలింగ్ చేయలేకపోయారు.  


బెన్ డకెట్ కవర్స్‌ మీదుగా అందమైన బౌండరీతో  ఐదో రోజు ఆట ప్రారంభించినప్పటికీ తర్వాత చాలా నెమ్మదిగా ఆడాలు ఇంగ్లిష్‌ ఓపెనర్లు. మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ ఇద్దరూ మంచి రిథమ్‌, క్రమశిక్షణతో బౌలింగ్ చేశారు.   క్రాలీని సిరాజ్ ఇబ్బంది పెట్టాడు. రెండుసార్లు LBW కోసం అప్పీళ్లు చేశాడు. వాటిని అంపైర్ తిరస్కరించాడు. ప్రసిద్ ఐదో స్టంప్ లైన్‌లో ఫుల్ లెంగ్త్‌ బంతులు వేస్తూ బెన్ డకెట్‌ను ఊరించినా అతను ఉచ్చులో చిక్కలేదు. ఇలా క్లిష్టమైన బంతులను ఎదుర్కొని ఇద్దరూ భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.  


మొదటి డ్రింక్స్ బ్రేక్ తర్వాత ఇంగ్లాండ్ గేర్‌ మార్చింది. వేగంగా పరుగులు తీయడం ప్రారంభించారు ఓపెనర్లు. భారత్‌ బౌలర్ల లెంగ్త్ బంతులకు ఇబ్బంది పడుతూనే  ఆ లెంగ్త్‌ తగ్గించినప్పుడల్లా బంతిని బౌండరికీ చేర్చారు. ఇలా లంచ్‌కు ముందే బెన్ డెక్ట్‌ తన 50 పరుగులు పూర్తి చేశాడు. క్రాలీ కవర్ డ్రైవ్‌తో విరుచుకుపడ్డాడు. ప్రసిద్‌ అప్పుడప్పుడు మంచి బంతులు వేసినప్పటికీ పరుగులు వరద పారింది. మధ్యలో బౌలింగ చేసిన ఠాకూర్ 3 ఓవర్ల స్వల్ప స్పెల్‌లో 17 పరుగులు సమర్పించుకున్నాడు. బౌలింగ్‌ మార్పులో కెప్టెన్‌ శుభ్‌మన్ గిల్ ఇబ్బంది పడ్డట్టు అర్థమవుతోంది. ఫీల్డింగ్‌ ప్లేసింగ్‌లో కూడా కెప్టెన్సీ లేమి స్పష్టంగా కనిపిస్తోందని సీనియర్లు అంటున్నారు.  


హెడింగ్లీలో ఓపెనర్లు నాల్గో ఇన్నింగ్స్‌లో 100 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడం 1984 తర్వాత ఇదే మొదటిసారి. 27 ఓవర్ల తర్వాత బంతిని మార్చినా భారత్‌కు ఎలాంటి ప్రయోజనం దక్కలేదు. లంచ్ సమయంలో రవీంద్ర జడేజా, జస్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో కొంత నియంత్రణ సాధించారు. క్రాలే ఇచ్చిన రిటర్న్ క్యాచ్‌ను బుమ్రా వదిలేయడంతో ఒక లైఫ్‌ లభించింది.  


లంచ్ తర్వాత కూడా భారత్‌ ఆటలో ఎలాంటి మార్పు లేదు. ఇంగ్లీష్ బ్యాటర్లు మాత్రం స్పీడ్ పెంచారు. లంచ్ తర్వాత క్రాలే 117 బంతులను ఎదుర్కొని 50 పరుగులు చేశాడు. ధాటిగా ఆడుతున్న బెన్‌ డకెట్‌ 124 బంతుల్లోనే సెంచరీ చేశాడు. లంచ్ వరకు వన్డే మ్యాచ్ బ్యాటింగ్ చేసిన బెన్ డకెట్‌ తర్వాత టీ 20 బ్యాటింగ్ చేస్తున్నాడు.