Michael Neser Catch: బిగ్ బాష్ లీగ్ లో భాగంగా నిన్న బ్రిస్బేన్ హీట్, సిడ్నీ సిక్సర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్ లో బ్రిస్బేన్ ఆటగాడు మైఖెల్ నీసర్ పట్టిన క్యాచ్ చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో దానిపై చర్చ జరుగుతోంది. ఆ క్యాచ్ లీగల్ కాదని కొందరు, చట్టబద్ధమేనని మరికొందరు వాదించుకుంటున్నారు. అసలు ఆ క్యాచ్ కథేంటో మనమూ చూద్దామా..
నిన్న జరిగిన బిగ్ బాష్ లీగ్ మ్యాచ్ లో సిడ్నీ సిక్సర్ ఆటగాడ్ ఓ భారీ షాట్ ఆడాడు. దాన్ని బ్రిస్బేన్ హీట్ ఫీల్డర్ నీసర్ అనూహ్య రీతిలో అందుకున్నాడు. క్యాచ్ పట్టాక అదుపు తప్పి బౌండరీ లైన్ దాటేశాడు. అయితే గాల్లో ఉండగానే బంతిని పైకి విసిరాడు. అయితే ఆ విసిరిన బంతి బౌండరీ ఆవలే పైకి లేచింది. అది కిందపడేలోపు నీసర్ అటువైపు ఉండే మళ్లీ గాల్లోకి ఎగిరి దానిని అందుకుని బౌండరీ లైన్ ఇవతలకు విసిరేశాడు. మళ్లీ ఇటువైపుకు మైదానంలోకి వచ్చి దాన్ని అందుకున్నాడు.
ఇది ఔటా, కాదా అని థర్డ్ అంపైర్ చాలాసార్లు రీప్లేలు పరిశీలించాడు. నీసర్ ఎక్కడా బౌండరీ అవతల అడుగు పెట్టి బంతిని అందుకున్నట్లు లేకపోవడంతో మూడో అంపైర్ ఔటిచ్చాడు. అయితే ఎంత గాల్లోనే బంతిని అందుకున్నప్పటికీ.. బౌండరీకి కొన్ని అడుగుల అవతల నీసర్ ఈ విన్యాసాలన్నీ చేయటంతో ఇదెలా ఔట్ అవుతుందనే చర్చ నడుస్తోంది. ఇలాంటి క్యాచ్‌ల విషయంలో నిబంధనలు మార్చాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకీ క్యాచ్ ల విషయంలో క్రికెట్ రూల్స్ ఏం చెప్తున్నాయో చూద్దాం.
రూల్స్ ఏం చెప్తున్నాయి
ఎంసీసీ (MCC) క్రికెట్ చట్టంలోని రూల్ 19.4.2 ఇలా చెబుతోంది, బౌలర్ బంతి వేశాక, ఆ బంతిని చివరిసారిగా అతడు పట్టుకోవడానికి ముందు బౌండరీ దాటితే బంతి నేలకు తాకినట్టే లెక్క.
అయినప్పటికీ ఎంసీసీ నెసర్ క్యాచ్ ను ఆమోదించడానికి సోషల్ మీడియా చర్చకు వెళ్లింది. అలాగే చట్టాలను స్పష్టం చేస్తూ ఒక పోస్ట్ చేసింది.
ఆ రూల్స్ ఇవి
ఫీల్డర్ మొదటి అప్పియరెన్స్ తప్పనిసరిగా బౌండరీ లోపల ఉండాలి.
బంతిని, బౌండరీ అవతల ఉన్న మైదానాన్ని ఫీల్డర్ ఒకేసారి తాకకూడదు.
కాబట్టి నెసర్ పట్టిన క్యాచ్ ను థర్డ్ అంపైర్ ఔట్ గా పరిగణించాడు.