BCCI New Selection Committee: ఆలిండియా సీనియర్ పురుషుల సెలక్షన్ కమిటీని బీసీసీఐ ప్రకటించింది. చేతన్ శర్మను తిరిగి సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా నియమించింది. 


సెలక్షన్ కమిటీ సభ్యులను ఎంపిక చేయడానికి సులక్షణ నాయక్, అశోక్ మల్హోత్రా, జతిన్ పరాంజపే లతో కూడిన క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ) విస్తృతమైన ప్రక్రియను చేపట్టింది. నవంబర్ 18న 5 పోస్టుల కోసం ప్రకటన ఇచ్చింది. వీటికోసం 600 దరఖాస్తులు వచ్చాయి. వాటిని పరిశీలించిన సీఏసీ వ్యక్తిగత ఇంటర్వ్యూల కోసం 11 మందిని షార్ట్ లిస్ట్ చేసింది. దీనిద్వారా 5 గురిని సిఫార్సు చేసింది.



  1. చేతన్ శర్మ

  2. శివసుందర్ దాస్

  3. సుబ్రతో బెనర్జీ

  4. సలీల్ అంకోలా

  5. శ్రీధరన్ శరత్ లు సెలక్షన్ కమిటీలో ఉన్నారు. 


టీ20 ప్రపంచకప్ లో టీమిండియా ఘోర వైఫల్యం తర్వాత చేతన్ శర్మ నేతృత్వంలోనీ సెలక్షన్ కమిటీని బీసీసీఐ రద్దు చేసింది. అయితే మళ్లీ చేతన్ నే సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా నియమించడం గమనార్హం.