Team India:

  టీ20 ప్రపంచకప్ ముగిసిన తర్వాత టీమిండియా న్యూజిలాండ్, బంగ్లాదేశ్ లతో సిరీస్ లు ఆడనుంది. వీటికోసం బీసీసీఐ సెలెక్టర్లు జట్టులను ప్రకటించారు. న్యూజిలాండ్ తో మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. అలాగే బంగ్లాదేశ్ తో వన్డే, టెస్ట్ సిరీస్ లు ఆడతారు. బీసీసీఐ ఒకేసారి నాలుగు జట్లను ప్రకటించడం ఇదే తొలిసారి. 


సీనియర్లకు విశ్రాంతి


న్యూజిలాండ్ సిరీస్ నుంచి రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, దినేశ్ కార్తీక్, రవిచంద్రన్ అశ్విన్ లకు విశ్రాంతి కల్పించారు. టీ20 సిరీస్ కు హార్దిక్ పాండ్య, వన్డే సిరీస్ కు శిఖర్ ధావన్ నాయకత్వం వహించనున్నారు. టీ20 ప్రపంచకప్ ముగిసిన తర్వాత నవంబర్ 18 నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది. టీ20 జట్టులో శుభ్ మన్ గిల్ అరంగేట్రం చేయనున్నాడు. అలాగే వన్డే సిరీస్ కు ముగ్గురు ఆటగాళ్లు అరంగేట్రం చేయనున్నారు. అర్హ్ దీప్ సింగ్, కుల్దీప్ సేన్, ఉమ్రాన్ మాలిక్ లకు జట్టులో చోటు దక్కింది. ఈ ముగ్గురూ పేసర్లే. 


టీ20 సిరీస్ షెడ్యూల్


నవంబర్ 18న మొదటి టీ20, వెల్లింగ్టన్


నవంబర్ 20న రెండో టీ20, మౌంట్ మౌంగానుయి


నవంబర్ 22న మూడో టీ20, నేపియర్


వన్డే సిరీస్ షెడ్యూల్


నవంబర్ 25న తొలి వన్డే, ఆక్లాండ్


నవంబర్ 28న రెండో వన్డే, హోమిల్టన్


నవంబర్ 30న మూడో వన్డే, క్రైస్ట్ చర్చ్



న్యూజిలాండ్ తో టీ20 సిరీస్ కు భారత జట్టు


హార్దిక్ పాండ్య (కెప్టెన్), రిషభ్ పంత్ (వైస్ కెప్టెన్), శుభ్ మన్ గిల్, ఇషాన్ కిషన్, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్, శ్రేయస్ అయ్యర్, శార్దూల్ ఠాకూర్, భువనేశ్వర్ కుమార్, యుజువేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, కుల్దీప్ సేన్, అర్హ్ దీప్ సింగ్, దీపక్ చాహర్, ఉమ్రాన్ మాలిక్. 


న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ కు భారత జట్టు


శిఖర్ ధావన్ (కెప్టెన్), రిషభ్ పంత్ (వైస్ కెప్టెన్), శుభ్ మన్ గిల్, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్, శ్రేయస్ అయ్యర్, వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, శార్దూల్ ఠాకూర్, యుజువేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, కుల్దీప్ సేన్, అర్హ్ దీప్ సింగ్, దీపక్ చాహర్, ఉమ్రాన్ మాలిక్.


కివీస్ తో సిరీస్ అనంతరం టీమిండియా బంగ్లాదేశ్ తో మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడనుంది. బంగ్లాతో సిరీస్ కు రోహిత్ కెప్టెన్. అలాగే కోహ్లీ, అశ్విన్ లు ఆడనున్నారు. 


బంగ్లాదేశ్ తో వన్డేలకు భారత జట్టు


రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్( వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, రజత్ పటీదార్, శ్రేయస్ అయ్యర్, రాహుల్ త్రిపాఠి, రిషభ్ పంత్, ఇషాన్ కిషన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్,  శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, దీపక్ చాహర్, యష్ దయాల్.


బంగ్లాదేశ్ తో టెస్ట్ సిరీస్ కు భారత జట్టు 


రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), శుభ్ మన్ గిల్, ఛతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, కేఎస్ భరత్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్.