స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో బంగ్లాదేశ్ చారిత్రాత్మక విజయం సాధించింది. రెండు టెస్టుల సిరీస్‌లో తొలి టెస్ట్‌ను బంగ్లా గెలుచుకుంది. లెఫ్టార్మ్ స్పిన్నర్ తైజుల్ ఇస్లామ్ పది వికెట్లతో మెరవడంతో 150 పరుగుల తేడాతో కివీస్‌పై బంగ్లాదేశ్ ఘన విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు తీసిన తైజుల్... రెండో ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు తీసి న్యూజిలాండ్ పతనాన్ని శాసించాడు. తైజుల్ స్పిన్ మాయాజాలంతో 332 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 181 పరుగులకే కుప్పకూలింది. ఐసీసీ ర్యాంకుల్లో మూడో స్థానంలో ఉన్న న్యూజిలాండ్‌పై తొమ్మిదో స్థానంలో ఉన్న బంగ్లాదేశ్ ఘనవిజయం సాధించడం క్రికెట్ అభిమానులను షాక్‌కు గురిచేసింది. సొంతగడ్డపై టెస్టుల్లో న్యూజిలాండ్‌పై బంగ్లాదేశ్‌కు ఇదే తొలి విజయం. ఈ విజయంతో బంగ్లా రెండు టెస్టుల సిరీస్‌లో 1-0 ఆధిక్యం సంపాదించింది. మొత్తంగా న్యూజిలాండ్‌పై బంగ్లాకు ఇది రెండో టెస్టు విజయం. నిరుడు మౌంట్ మౌంగనూలో బంగ్లా.. కివీస్‌ను ఓడించింది.
తొలి టెస్టులో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో ఓపెనర్ హసన్ జాయ్ 86 పరుగులతో రాణించడంతో 85.1 ఓవర్లలో బంగ్లాదేశ్ 310 పరుగులకు ఆలౌటైంది. అనంతరం న్యూజిలాండ్ 317 పరుగులు చేసి ఏడు పరుగుల స్వల్ప ఆధిక్యాన్ని దక్కించుకుంది. కేన్ విలియమ్సన్ సెంచరీ(104)తో రాణించాడు. గ్లెన్ ఫిలిప్స్ 42, డారిల్ మిచెల్ 41 తమ సహకారం అందించారు. కానీ రెండో ఇన్నింగ్స్‌లో నమ్మశక్యం కాని ఆటతీరుతో బంగ్లా ఆశ్చర్యపరిచింది. బంగ్లాదేశ్ బౌలర్లలో తైజుల్ ఇస్లాం 4 వికెట్లు, మోనిముల్ హక్ 3 వికెట్లు పడగొట్టారు.
రెండో ఇన్నింగ్స్‌లో కూడా బంగ్లాదేశ్ బ్యాటర్లు రాణించారు. కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్ శాంతో సెంచరీ చేశాడు. నజ్ముల్ హొస్సేన్ శాంటో కెప్టెన్‌గా అరంగేట్రంలో సెంచరీ కొట్టిన మొదటి బంగ్లాదేశ్ క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. ముష్ఫీకర్ రహీమ్ (67), మెహిదీ హసన్ మిరాజ్ (50) అర్ధ శతకాలతో రాణించడంతో బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్‌లో 338 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో కివీస్ 181 పరుగులకే కుప్పకూలింది. తైజుల్ ఇస్లాం 10 వికెట్లతో చెలరేగడంతో న్యూజిలాండ్ 181 పరుగులకే పరిమితమైంది.
రెండో ఇన్నింగ్స్‌లో డారిల్ మిచెల్ (58) తప్ప మిగతా బ్యాటర్లు చేతులెత్తేశారు. చివర్లో కెప్టెన్ టిమ్ సౌథీ (34) పోరాడినా ఫలితం లేకపోయింది. ఈ మ్యాచ్‌లో 10 వికెట్లతో రాణించిన తైజుల్ ఇస్లాంకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఓవరాల్‌గా టెస్ట్ క్రికెట్ చరిత్రలో న్యూజిలాండ్‌ను ఓడించడం బంగ్లాదేశ్‌కు ఇది రెండోసారి మాత్రమే.
332 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ మ్యాచ్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి తమ రెండో ఇన్నింగ్స్‌లో 113 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. డరైల్ మిచెల్ (44 నాటౌట్) మినహా ఇతర బ్యాటర్లంతా విఫలమయ్యారు. ఆఖరి రోజు ఆట ప్రారంభమైన కాసేటికే ఇస్లాం తన ప్రతాపం చూపించాడు. 332 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ మ్యాచ్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి తమ రెండో ఇన్నింగ్స్‌లో 113 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. డరైల్ మిచెల్ (44 నాటౌట్) మినహా ఇతర బ్యాటర్లంతా విఫలమయ్యారు. చివరి మూడు వికెట్లు ఖాతాలో వేసుకొని 10 వికెట్ల ఫీట్ సాధించాడు.