IL T20 Updates: యూఏఈలో జరుగుతున్న ఐఎల్ టీ20 టోర్నీలో ఫన్నీ ఘటన చోటు చేసుకుంది. బ్యాటర్ ను రనౌట్ చేయడం కోసం కీపర్ పల్టీలు కొట్టడంతో కామెడీ ఆఫ్ ఎర్రర్ చోటు చేసుకుంది. తాజాగా ఐఎల్ టీ20 టోర్నీలో షార్జా వారియర్జ్, డిసర్ట్ వైపర్స్ జట్ల మధ్య ఈ సరదా సన్నివేశం జరిగింది. వారియర్జ్ బ్యాటింగ్ చేస్తుండగా ఇన్నింగ్స్ 18వ ఓవర్లో స్ట్రైకింగ్ లో ఉన్న ఆష్టన్ ఆగర్, ల్యూక్ వెల్స్ మధ్య సమన్వయలోపం ఏర్పడింది. ఆగర్ బంతిని కొట్టి ముందుకు ఉరికి రాగా, నాన్ స్ట్రైకింగ్ లో ఉన్న వెల్స్ క్రీజులో నుంచి కదల్లేదు.
అయితే ఫీల్డర్ బంతిని అందుకుని కీపర్ పాకిస్థాన్ ప్లేయర్ ఆజం ఖాన్ వైపు విసరగా.. అతను బంతి అందుకునేందుకు తంటాలు పడ్డాడు. భారీ కాయుడైన ఆజం.. బంతికోసం పల్టీ కొట్టిన అందలేదు. ఆజమ్ వెనకాల ఉన్న ప్లేయర్ కూడా చురుగ్గా స్పందించకపోవడంతో బ్యాటింగ్ చేస్తున్న వారియర్జ్ కు మరో రెండు పరుగులు అదనంగా వచ్చాయి. రనౌట్ మాట దేవుడెరుగు, ఎగస్ట్రాగా రెండు పరుగులు ఇచ్చారని వైపర్స్ జట్టును నెటిజన్లు ఎద్దేవా చేస్తున్నారు. ఆజం వికెట్ ప్రతిభను వ్యంగ్యంగా విమర్శిస్తూ పోస్టులు పెడుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియలో ఈ వీడియో వైరలైంది. క్రికెట్ ఫ్యాన్స్ ఫన్నీగా కామెంట్లు చేస్తూ లైకులు, షేర్లు చేస్తున్నారు.
వారియర్జ్ విజయం..
అయితే ఈ మ్యాచ్ లో షార్జా వారియర్జ్ జట్టు విజయం సాధించింది. జట్టులో ఇంగ్లాండ్ ప్లేయర్లు అలెక్స్ హేల్స్, శామ్ కర్రన్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడటంతో ఘనవిజయం సాధించింది. 152 పరుగుల లక్ష్యాన్ని షార్జా ఊది పడేసింది. కేవలం 14.5 ఓవర్లోలనే ఛేదించింది. ప్రత్యర్థి బౌలర్లను ఊచకోతూ కోస్తూ, మైదానానికి అన్ని వైపులా హేల్స్, కరన్ బౌండరీలు బాదారు. ఈక్రమంలో 36 బంతుల్లోనే హేల్స్ అర్థ సెంచరీ చేసుకోగా, కరన్ అతనికంటే మిన్నగా కేవలం 33 బంతుల్లోనే స్టన్నింగ్ ఫిఫ్టీ నమోదు చేశాడు. వీరిద్దరూ 65 బంతుల్లోనే 128 పరుగులు నమోదు చేశారు. అంతకుమందు డేవిడ్ పేన్.. వైపర్ జట్టు తరపున రెండు కీలక వికెట్లు తీశాడు. ఆ తర్వాత స్థానిక బౌలర్ ఖుజిమ తన్వీర్ నాలుగు వికెట్లతో షార్జాను దెబ్బ తీశాడు. అయితే జాసన్ రాయ్ 38 బంతుల్లోనే 55 పరుగులు చేసి సత్తా చాటడంతో సవాలు విసరగలిగే స్కోరును షార్జా.. వైపర్స్ ముందు ఉంచింది.