PAK vs NEP: 


ఆసియాకప్‌ - 2023లో తొలి మ్యాచుకు వేళైంది. ముల్తాన్‌ వేదికగా పాకిస్థాన్‌, నేపాల్‌ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌ టాస్‌ వేశారు. టాస్‌ గెలిచిన పాక్‌ కెప్టెన్ బాబర్‌ ఆజామ్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. పిచ్ మందకొడిగా ఉందన్నాడు.


బాబర్‌ ఆజామ్‌: మేం మొదట బ్యాటింగ్‌ చేస్తాం. పిచ్‌ మందకొడిగా కనిపిస్తోంది. మెరుస్తోంది. ముందే తుది జట్టును ప్రకటించాల్సిన కారణమేమీ లేదు. మా జట్టులో ఆత్మవిశ్వాసం నింపాలని అనుకుంటున్నాం. వన్డేల్లో నంబర్‌ వన్‌ జట్టుగా ఉండటమూ ఒక రకమైన ఆనందకరమైన ప్రెజరే. ఏదేమైనా మేం ఆటను ఆస్వాదిస్తాం. అత్యుత్తమ ఆటతీరును బయటపెడతాం.


రోహిత్‌ పౌడెల్‌: మేమంతా ఆనందంగా ఉన్నాం. ఆసియాకప్‌లో ఇది మా మొదటి మ్యాచ్‌. నేపాల్‌లో ప్రతి ఒక్కరూ ఆత్రుతగా ఉన్నారు. ఇక్కడి పరిస్థితులు నేపాల్‌ తరహాలోనే ఉన్నాయి. వికెట్‌ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంది.


పిచ్‌ రిపోర్టు: ముల్తాన్‌లో పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. వికెట్‌ను చక్కగా రోలింగ్‌ చేశారు. బంతి చక్కగా బ్యాటు మీదకు వస్తుంది. బౌన్స్‌ను బట్టి స్పిన్నర్లు లెంగ్తులను సవరించుకోవాల్సి వస్తుంది. ఫ్లడ్‌లైట్ల వెలుతురు కింద బంతి స్వింగ్‌ అవ్వొచ్చు. మొత్తానికి వికెట్‌ బాగుంటుంది.


నేపాల్‌: కుశాల్ భూర్తెల్‌, ఆసిఫ్ షేక్, రోహిత్‌ పౌడె, ఆరిఫ్ షేక్‌, కుశాల్‌ మల్లా, దీపేంద్ర సింగ్‌, గుల్షన్ ఝా, సోంపాల్‌ కామి, కరణ్ కేసీ, సందీప్‌ లామిచాన్‌, లలిత్‌ రాజ్‌బన్షీ


పాకిస్థాన్‌: ఫకర్‌ జమాన్‌, ఇమామ్‌ ఉల్‌ హఖ్‌, బాబర్‌ ఆజామ్‌, మహ్మద్‌ రిజ్వాన్‌, అఘా సల్మాన్‌, ఇఫ్తికార్‌ అహ్మద్‌, షాదాబ్‌ ఖాన్‌, మహ్మద్‌ నవాజ్‌, షాహీన్ అఫ్రిది, నసీమ్‌ షా, హ్యారిస్‌ రౌఫ్‌


నేపాల్‌ షాకిస్తుందా..? 


వన్డే హోదా పొందిన తర్వాత ఒక అగ్రశ్రేణి జట్టుతో వన్డేలు ఆడటం నేపాల్‌కు ఇదే తొలిసారి. గతంలో ఐసీసీ ఫుల్ మెంబర్ స్టేటస్ ఉన్న ఐర్లాండ్, వెస్టిండీస్, జింబాబ్వే‌లతో మాత్రమే నేపాల్ వన్డేలు ఆడింది. అయితే నేపాల్‌ ఈ ఏడాది ఏప్రిల్-మేలో జరిగిన ఏసీసీ మెన్స్ ప్రీమియర్ కప్‌‌లో యూఏఈ, హాంకాంగ్‌లను (ఈ రెండూ గతంలో  ఆసియా కప్ ఆడిన  జట్లే) ఓడించి ఆసియా కప్ ఆడేందుకు అర్హత సాధించింది. అదీగాక గడిచిన 12 వన్డేలలో ఆ జట్టు ఏకంగా 11 నెగ్గడం విశేషం. అనిశ్చితికి బ్రాండ్ అంబాసిడర్ అయిన పాకిస్తాన్.. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్న షాకిచ్చేందుకు నేపాల్ సిద్ధంగా ఉంది.  ఆ జట్టులో చెప్పుకోదగ్గ ఆటగాళ్లు లేకపోయినా  పాక్‌కు గట్టిపోటీనిచ్చేందుకు  సిద్ధమైంది.  నేపాల్ టీమ్‌లో  మిడిలార్డర్ బ్యాటర్ దీపేంద్ర సింగ్‌కు  పలు  ఫ్రాంచైజీ టోర్నీల అనుభవముంది. దీపేంద్ర సింగ్.. షకిబ్ అల్ హసన్, ఆండ్రీ రసెల్ వంటి ఆటగాళ్లతో కలిసి ఆడాడు. బౌలర్లలో సందీప్ లమిచానె.. ఈ ఏడాది ఆడిన వన్డేలలో 42 వికెట్లు పడగొట్టి మంచి ఫామ్‌లో ఉన్నాడు. 


Also Read: నాకు ఆ ఫార్మాట్ అంటేనే ఇష్టం - అసలైన సత్తా తెలిసేది దాన్లోనే : కోహ్లీ


Also Read: సంచలనాలేమీ లేకుండానే మొదలైన యూఎస్ ఓపెన్ - రెండో రౌండ్‌కు చేరిన స్టార్ ప్లేయర్స్