Gambhir makes massive Ashwin vs Harbhajan statement: రోహిత్ శర్మ టెస్టు సారథిగా తొలి మ్యాచ్‌లోనే ఘన విజయాన్ని అందించాడు. ఇటీవల మొహాలీ వేదికగా భారత్-శ్రీలంక మధ్య జరిగిన తొలి టెస్టులో భారత జట్టు ఇన్నింగ్స్ 222 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. బ్యాటింగ్‌లో 175 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన జడేజా బౌలింగ్‌లోనూ రాణించి 9 వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో అశ్విన్ అరుదైన రికార్డు నమోదు చేశాడు. టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన రెండో భారత బౌలర్‌గా నిలిచాడు.

కపిల్ దేవ్ రికార్డ్ బద్ధలు.. 
కపిల్ దేవ్ 434 టెస్టు వికెట్ల మైలురాయిని అశ్విన్ అధిగమించాడు. ప్రస్తుతం అశ్విన్ 85 మ్యాచ్‌ల్లో 436  వికెట్లు తీశాడు. కపిల్ దేవ్ పేస్ ఆల్ రౌండర్ కాగా, అశ్విన్ స్పిన్నర్. అందుకు టెస్టుల్లోనే 400 వికెట్లు తీసిన ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్, అశ్విన్‌ల బౌలింగ్ పై టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ స్పందించాడు. అశ్విన్, భజ్జీలలో ఎవరి బౌలింగ్ లో ప్లస్ పాయింట్లు చెబుతూ తాను, ఎవరి బౌలింగ్‌ను ఇష్టపడడో వెల్లడించాడు. 

అతడి బౌలింగ్ ఆడేందుకు ఇష్టపడను.. 
బ్యాట్స్‌మెన్‌గా అశ్విన్ బౌలింగ్ ఎదుర్కోవడాన్ని ఇష్టపడను. కానీ హర్భజన్ బంతులను ఎదుర్కోవడం చాలా ఇష్టం. ముఖ్యంగా ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్‌గా అశ్విన్ నన్ను ఔట్ చేసే అవకాశం ఎక్కువ. అదే హర్భజన్ విషయానికొస్తే అతడి శైలి నాకు నచ్చుతుంది. అతడి బౌలింగ్‌ను ఈజీగా ఎదుర్కోవచ్చు. అతడి వేసే దూస్రా బంతులను ఆడేందుకు ఇష్టపడతానని గౌతమ్ గంభీర్ చెప్పాడు. అశ్విన్ బౌలింగ్ ఆక్యురసీ, స్పీడ్ పర్ఫెక్ట్‌గా ఉంటుందని అభిప్రాయపడ్డాడు. గంభీర్ ఉద్దేశం ప్రకారం.. అశ్విన్ బౌలింగ్‌ను ఎదుర్కోవడం తనకు కష్టమని, అదే సమయంలో భజ్జీ బంతులను తేలికగా ఆడగలుగుతానని స్పష్టం చేశాడు.

ఆటగాళ్లు టెస్టు మ్యాచ్‌లు వికెట్లు
అనిల్ కుంబ్లే 132 619
అశ్విన్ 85 436
కపిల్ దేవ్ 131 434
హర్భజన్  103 417

స్పిన్‌ అంటే అతడే..
గత కొన్నేళ్లుగా టీమిండియాకు స్పిన్ అంటే అశ్విన్ గుర్తొస్తాడు. హర్భజన్ సింగ్ జాతీయ జట్టులో చోటు కోల్పోయిన తరువాత ఎంతో మంది స్పిన్నర్లు జట్టులోకి వచ్చి వెళ్తున్నా రవిచంద్రన్ అశ్విన్ 10 ఏళ్లుగా భారత జట్టులో నంబర్ వన్ స్పిన్నర్‌గా కొనసాగుతున్నాడు. గత ఏడాది అశ్విన్ రాణించడంతో భారత్ ఎన్నో కీలక సిరీస్‌లు కైవసం చేసుకుంది. 2021లో 63 వికెట్లతో అశ్విన్ అగ్రస్థానంలో ఉన్నాడు. 

Also Read: Rawalpindi Test: 24 సంవత్సరాల తర్వాత పాక్‌లో తొలి టెస్టు - డ్రాగా ముగించిన ఆస్ట్రేలియా!

Also Read: AB de Villiers RCB: ఐపీఎల్‌ ఆడనన్న ఏబీడీ, మళ్లీ RCBలో జాయిన్‌ అవుతున్నాడు!