ENG vs AUS 3rd Test: రెండు రోజుల ఆట బ్యాలెన్స్ ఉంది. ఇంగ్లాండ్ గెలవాలంటే రెండు రోజుల్లో 224 పరుగులు చేయాలి. ఆస్ట్రేలియా విజయానికి పది వికెట్లు కావాలి.  హెడింగ్లీ (లీడ్స్) పిచ్ బౌలర్లకు అనుకూలంగా మారుతుండటంతో  మరో బ్లాక్ బస్టర్ థ్రిల్లర్ లోడ్ అవుతోందని చెప్పడంలో సందేహమే లేదు. తొలి రెండు టెస్టుల మాదిరిగానే యాషెస్  మూడో టెస్టు కూడా రసవత్తరంగా మారింది. రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్  224 పరుగులకు కుప్పకూలడంతో ఇంగ్లాండ్  ఎదుట 251 పరుగుల లక్ష్యం  ఛేదించాల్సి వచ్చింది. 


సగం కంటే ఎక్కువ వరుణుడే.. 


లీడ్స్‌లో రెండు రోజులూ ఆధిక్యంలో ఉన్న  ఆసీస్ మూడో రోజు  తడబడింది. మూడో రోజు ఉదయం నుంచి దాదాపు మూడో సెషన్  సగం వరకూ   వరుణుడు దంచికొట్టాడు. చివర్లో  25 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. వర్షం కురవడం ఇంగ్లాండ్‌కే లాభించింది. రెండో రోజు ఓవర్ నైట్ స్కోరు 116-4 వద్ద  మూడో రోజు ఆట ఆరంభించిన  ఆసీస్.. మరో 20 ఓవర్లు మాత్రమే ఆడింది. 67.1 ఓవర్లలో ఆ  జట్టు 224 పరుగులకు ఆలౌట్ అయింది.  ట్రావిస్ హెడ్ (112 బంతుల్లో 77, 7 ఫోర్లు, 3 సిక్సర్లు)  మరోసారి ఆసీస్‌ను ఆదుకోగా  తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో మిచెల్ మార్ష్ (28) విఫలమయ్యాడు.  ఆసీస్  లోయరార్డర్ కూడా గత ఇన్నింగ్స్‌లో మాదిరిగానే అలా వచ్చి ఇలా వెళ్లింది. ఇంగ్లాండ్ బౌలర్లలో  బ్రాడ్, వోక్స్ తలా మూడు వికెట్లు తీయగా వుడ్, మోయిన్ అలీ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.


 






ఇంగ్లాండ్ దూకుడు.. 


ఆసీస్‌ను 244  పరుగులకే కట్టడి చేయడంతో ఇంగ్లాండ్ 251 పరుగుల లక్ష్యం  ఛేదించాల్సి వచ్చింది.  మూడో రోజు  ఆఖర్లో ఇంగ్లాండ్  5 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసి తనదైన  దూకుడుతో ఆడింది.  బెన్ డకెట్.. 19 బంతులు ఆడి మూడు బౌండరీలతో 18 పరుగులు చేసి నాటౌట్‌గా క్రీజులో నిలిచాడు. మరో ఓపెనర్ జాక్ క్రాలే (9) వికెట్ కాపాడుకున్నాడు.   ఐదు ఓవర్లలో ఇంగ్లాండ్.. వికెట్ నష్టపోకుండా  27 పరుగులు చేసింది. 


లీడ్స్ పిచ్ బౌలర్లకు సహకరిస్తుండటంతో  ఈ మ్యాచ్‌లో  కూడా ఆసక్తికర ముగింపు తప్పదని క్రికెట్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. తొలి రెండు టెస్టుల మాదిరిగానే లీడ్స్ కూడా థ్రిల్లింగ్ ఫీల్‌ను అందించనుంది.  ప్రస్తుతానికి  సాధించాల్సిన లక్ష్యం పెద్దగా లేకపోవడం, చేతిలో పది వికెట్లు ఉండటం.. రెండు రోజుల ఆట మిగిలుండటంతో  ఇంగ్లాండ్ వైపు మొగ్గు కనిపిస్తున్నా..  లీడ్స్ పిచ్  పేసర్లకు అనుకూలిస్తుండటంతో కమిన్స్, స్టార్క్, బొలాండ్ త్రయం .. బెన్ స్టోక్స్ సేనను ఏ మేరకు నిలువరించగలుగుతారనేదానిపై ఆసీస్ విజయం ఆధారపడి ఉంది. 


 




















Join Us on Telegram: https://t.me/abpdesamofficial