ఒక ఓవర్లో ఆరు బంతుల్లో సిక్సర్లతో 36 పరుగులు రాబట్టడం మనం చూశాం. టీ20ల్లో యువరాజ్ సింగ్, పొలార్డ్, వన్డేల్లో హెర్షెలే గిబ్స్, జస్కరన్ మల్హోత్రా (యూఎస్ఏ) దాన్ని సాధించారు. పొరపాటున బౌలర్ నోబాల్స్, వైడ్స్ వేసినప్పుడు 37 పరుగుల వరకు వస్తాయి. ఐపీఎల్‌లో ఒకే ఓవర్లో 37 పరుగులను క్రిస్ గేల్, రవీంద్ర జడేజా సాధించారు.
టెస్టుల్లో కూడా భారత్‌కు చెందిన బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా 35 పరుగులు చేశాడు. టెస్టు క్రికెట్ చరిత్రలో ఇదే అత్యధికం. కానీ ఒకే ఓవర్లో 46 పరుగులు రావడం ఎప్పుడైనా చూశారా? కువైట్‌లోని ఫ్రాంచైజీ క్రికెట్ మ్యాచ్‌లో ఈ స్కోరు వచ్చింది.
కేసీసీ ఫ్రెండ్స్ మొబైల్ టీ20 ఛాంపియన్స్ ట్రోఫీలో ఎన్‌సీఎం ఇన్వెస్ట్‌మెంట్, ట్యాలీ సీసీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఒకే ఓవర్లో 46 పరుగులు వచ్చాయి. టాలీ సీసీ బౌలర్ హర్మన్ నోబాల్‌తో ఓవర్‌ను ప్రారంభించాడు. ఆ బాల్ సిక్సర్‌కు వెళ్లిపోయింది. ఈ ఓవర్లో రెండు నోబాల్స్, బైస్‌తోకూడా వేశాడు. మొత్తంగా ఆరు సిక్సర్లు, ఒక బౌండరీ నమోదయ్యాయి. నాలుగు పరుగులు బైస్‌గా, మిగిలినవి ఎక్స్‌ట్రాల రూపంలో వచ్చాయి.
ఈ సీజన్ ఐపీఎల్‌లో కోల్‌కతా బ్యాటర్ రింకూ సింగ్ వరుసగా ఐదు సిక్సర్లు కొట్టి మ్యాచ్‌ను గెలిపించాడు. విజయానికి చివరి ఐదు బంతుల్లో 29 పరుగులు కావాల్సిన దశలో రింకూ సింగ్ ఈ సాహసోపేతమైన ఫీట్‌ను సాధించాడు.
ఏకనా స్టేడియంలో జరిగిన మ్యాచులో లక్నో సూపర్ జెయింట్స్ తొలుత బ్యాటింగ్ చేసింది. మరో మూడు బంతులు మిగిలునప్పుడు వర్షం మొదలైంది. ఎంతకీ ఎడతెరపి నివ్వలేదు. దాంతో చెన్నై సూపర్ కింగ్స్ ఛేదనకు రాలేకపోయింది. సాయంత్రం 7 గంటల వరకు వేచిచూసిన నిర్వాహకులు రెండు జట్లకు చెరో పాయింటును పంచేశారు. దాంతో మెరుగైన రన్‌రేట్ 0.639 ఉన్న లక్నో రెండో పొజిషన్లో నిలిచింది. 10 మ్యాచుల్లో 5 గెలిచి 4 ఓడింది. ఇక చెన్నైదీ ఇదే పరిస్థితి. 0.329 రన్‌రేట్, 11 పాయింట్లతో మూడో ప్లేస్‌లో ఉంది. పదింట్లో ఐదు గెలిచి నాలుగు ఓడింది. ఒక ఫలితం తేలలేదు.
మొహాలిలో పంజాబ్ కింగ్స్ నిర్దేశించి 215 టార్గెట్‌ను ముంబయి ఇండియన్స్ ఊదేసింది. పది పాయింట్లు అందుకుంది. రన్‌రేట్‌నూ మెరుగుపర్చుకుంది. పాయింట్ల పట్టికలో ఆరో స్థానానికి దూసుకుపోయింది. ఇప్పటి వరకు 9 మ్యాచులాడిన హిట్‌మ్యాన్ సేన 5 గెలిచి 4 ఓడింది. మిగిలిన మ్యాచులో మంచి ప్రదర్శన చేస్తే కచ్చితంగా ప్లేఆఫ్ చేరుకోగలదు. ఇక పది మ్యాచులాడిన గబ్బర్ సేన 5 గెలిచి 5 ఓడి 10 పాయింట్లతో ఏడో స్థానంలో ఉంది. ముంబయి తన తర్వాతి మ్యాచులో చెన్నైతో తలపడనుంది.