వెన్నం జ్యోతి సురేఖ (Jyothi Surekha) దాఖలు చేసిన ఫిర్యాదుపై హైకోర్టు స్పందించింది.  మేజర్‌ ధ్యాన్‌చంద్‌ ఖేల్‌రత్న అవార్డు( Major Dhyan Chand Khel Ratna award)కు తనను ఎంపిక చేయకపోవడాన్ని సవాల్‌ చేస్తూ ఆర్చర్‌ వెన్నం జ్యోతి సురేఖ  హైకోర్టులో  పిటిషన్‌ వేశారు. ఈ నేపధ్యంలో కోర్ట్ కేంద్ర ప్రభుత్వంతో పాటు ఖేల్‌రత్న అవార్డు ఎంపిక కమిటీకి సైతం నోటీసులు జారీచేసింది. సురేఖ ఇచ్చిన వినతిపత్రంపై ఈ నెల 8లోగా నిర్ణయం తీసుకోవాలని కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్‌సింగ్‌ ఠాకూర్‌ను ఆదేశించింది. జ్యోతి సురేఖ తరపున న్యాయవాది కోర్టుముందు ఉంచిన రికార్డులను పరిశీలిస్తే ఆమె ఆవేదనలో న్యాయం ఉందనిపిస్తోందని ప్రాథమికంగా అభిప్రాయపడింది. అయితే ఈ వ్యాజ్యంపై లోతైన విచారణ జరపాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఈ విషయంపై  పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న అవార్డు ఎంపిక కమిటీ చైర్మన్‌, సభ్యులకు నోటీసులు జారీచేసింది.  ఈ మేరకు శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన  హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.జయసూర్య విచారణను ఫిబ్రవరి 5వ తేదీకి వాయిదా వేసారు. 


2023 ఏడాదికిగానూ ప్రతిష్టాత్మక  ఖేల్‌రత్న అవార్డుకు తన పేరును ఎంపిక చేసేలా ఎంపిక కమిటీని ఆదేశించాలని కోరుతూ ఆర్చర్‌ జ్యోతి సురేఖ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. శుక్రవారం ఈ వ్యాజ్యం విచారణకు రాగా పిటిషనర్‌ తరఫున న్యాయవాది శ్రవణ్‌కుమార్‌ తన  వాదనలు వినిపించారు. ఖేల్‌రత్న అవార్డుకు పిటిషనర్‌ అన్నివిధాలా అర్హురాలని, ఆమె తీసుకున్న అవార్డులు, సాధించిన పాయింట్లను కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలు, ఎంపిక విధానాన్ని పరిగణలోకి తీసుకొంటే పిటిషనర్‌కు 148.74 శాతం పాయింట్లు ఉన్నాయన్నారు. పిటిషనర్‌ కన్నా తక్కువ పాయింట్లు ఉన్న ఆటగాళ్లను ఖేల్‌రత్న అవార్డుకు ఎంపిక చేశారని పేర్కొన్నారు. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొని తన పిటిషనర్ కు న్యాయం చేయాలని కోరారు. దీనిపై స్పందించిన కోర్ట్ ఈ నెల 8లోగా నిర్ణయాన్ని వెల్లడించాలని కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్‌సింగ్‌ ఠాకూర్‌ను ఆదేశించింది.


 టోక్యో ఒలింపిక్స్‌.. ఇటు పారాలింపిక్స్‌లో ఈ సారి క్రీడాకారులు పతకాల పంట పండించారు. మొదట ఒలింపియన్లు మురిపిస్తే తర్వాత పారాలింపియన్లు దుమ్మురేపారు. వారిని మించి పతకాలు సాధించి ఆకట్టుకున్నారు. అందుకు ఖేల్‌రత్నను ఈసారి ఎక్కువగా వారికే అందించి గౌరవిస్తున్నారు. 


నీరజ్ చోప్రా (అథ్లెటిక్స్‌), రవికుమార్‌ (రెజ్లింగ్‌), లవ్లీనా (బాక్సింగ్‌), శ్రీజేశ్‌ (హాకీ), పారాలింపియన్స్‌ అవనీ లేఖర (షూటింగ్‌), సుమిత్‌ అంటిల్‌ (బ్యాడ్మింటన్‌), ప్రమోద్‌ భగత్‌ (బ్యాడ్మింటన్‌), కృష్ణా నాగర్‌ (బ్యాడ్మింటన్‌), మనీశ్‌ నర్వాల్‌ (షూటింగ్‌), క్రికెటర్‌ మిథాలీ రాజ్‌, ఫుట్‌బాలర్‌ సునిల్‌ ఛెత్రీ, హాకీ ఆటగాడు మన్‌ప్రీత్‌ సింగ్‌ పురస్కారం అందుకోనున్నారు.


యువ అథ్లెట్‌ నీరజ్‌ చోప్రా భారత్‌కు తొలిసారి అథ్లెటిక్స్‌లో స్వర్ణ పతకం అందించాడు. వందేళ్ల తర్వాత అథ్లెటిక్స్‌లో పతకం అందించి చరిత్ర సృష్టించాడు. జావెలిన్‌ను అందరికన్నా ఎక్కువ దూరం విసిరి సంచలనంగా మారాడు. ఇక యువ బాక్సర్‌ లవ్లీనా బొర్గెహెయిన్‌ ఊహించని రీతిలో పతకం కొల్లగొట్టింది. కరోనా సోకినా.. విదేశాల్లో శిక్షణ తీసుకోలేకపోయినా పతకం ముద్దాడింది. కొన్నేళ్ల తర్వాత భారత హాకీ జట్టు కాంస్య పతకం సాధించింది. ఇందుకు గోల్‌కీపర్‌ శ్రీజేశ్‌ ఎంతగానో కష్టపడ్డాడు. ఎన్నో గోల్స్‌ను సేవ్‌ చేశాడు.


పారాలింపిక్స్‌లో అవనీ లేఖర రెండు స్వర్ణాలు కొల్లగొట్టింది. బ్యాడ్మింటన్లో సుమిత్‌, ప్రమోద్‌, కృష్ణ దుమ్మురేపారు. మనీశ్‌ నర్వాల్‌ షూటింగ్‌లో సంచలనం సృష్టించాడు. అమ్మాయిల క్రికెట్లో మిథాలీ రాజ్‌ నవ చరిత్ర లిఖించింది. ఆమెలా ఎవరూ పరుగులు చేయలేదు. అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో లయోనల్‌ మెస్సీతో పోటీపడుతూ ఛెత్రీ గోల్స్‌ చేస్తున్నాడు. టాప్‌ 3లో ఉంటున్నాడు.