భారత ప్లేయర్ దినేశ్ కార్తీక్ తన కామెంటేటరీతో అభిమానుల మనసులను దోచుకున్నాడు. తాజాగా భారత్ x ఇంగ్లాండ్ మధ్య టెస్టు సిరీస్‌లో, అక్కడే జరుగుతోన్న ద హండ్రెడ్ లీగ్‌లో దినేశ్ కార్తీక్ కామెంటేటర్ బాధ్యతలు నిర్వర్తించాడు. ఇప్పుడు IPL కోసం దినేశ్ కార్తీక్ ప్లేయర్‌గా మారి మైదానంలో ప్రాక్టీస్ మొదలుపెట్టాడు.
ఈ నేపథ్యంలో కోల్‌కతా నైట్ రైడర్స్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో దినేశ్ కార్తీక్ ప్రాక్టీస్‌కు సంబంధించిన ఫొటోలను షేర్ చేసింది. ఇంగ్లాండ్ నుంచి నేరుగా దినేశ్ కార్తీక్ UAE చేరుకున్నాడు. అనంతరం జట్టుతో కలిసి ప్రాక్టీస్ సెషన్లో కూడా పాల్గొన్నాడు. ఈ క్రమంలో బస్సు నుంచి దిగుతున్న DKని హర్భజన్ సింగ్ ఎలా ఉన్నావు? కామెంటేటర్ జాబ్ ఎలా ఉంది? అని అడిగాడు. దీనికి డీకే బాగుంది అని బదులిచ్చాడు. ‘గత ఏడాది కూడా ఇక్కడే IPL ఆడాం. ఇప్పుడు వరుసగా రెండో సంవత్సరం. గత సీజన్లో 5వ స్థానంలో నిలిచాం. ఈ ఏడాది ప్లేఆఫ్ చేరుకునేందుకు వీలైనంత కష్టడపడతాం. వరుస మ్యాచ్లు గెలిచేందుకు ప్రయత్నిస్తాం’ అని తెలిపాడు.
సెప్టెంబరు 19 నుంచి IPL - 2021 మిగతా సీజన్ ప్రారంభంకానుంది. ఇందుకోసం ఇప్పటికే పలు జట్ల ఆటగాళ్లు UAE చేరుకుని వరుస ప్రాక్టీస్ సెషన్లలో పాల్గొంటున్నారు. సెప్టెంబరు 20న కోల్‌కతా నైట్ రైడర్స్... రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. ఇప్పటి వరకు 7 మ్యాచ్‌లాడిన KKR రెండింట్లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో 7వ స్థానంలో కొనసాగుతోంది.