Karthika Masam 2022 దేవుడిపై మనసు లగ్నం చేయడం భక్తి... ఇలా మాత్రమే చేయకపోతే ఏమైపోతోందో అనే ఆలోచన చాదస్తం
భక్తి మాత్రమే ప్రద్శర్శించేవారితో ఎలాంటి సమస్యా లేదు కానీ..చాదస్తానికి పోయి అనారోగ్యాన్ని కూడా పట్టించుకోకుండా భక్తిలో మునిగితేలేవారు అనారోగ్యాన్ని మరింత పెంచుకోవడంతో పాటూ కొన్నిసార్లు ప్రాణాలను కూడా ఫణంగా పెడుతున్నారు.


సాధారణంగా కార్తీకమాసం అనగానే నెలరోజుల పాటూ చన్నీటి స్నానాలు, దీపాలు, పూజలు.. ఎక్కడ చూసినా ఆధ్యాత్మిక వాతావరణమే.  పంచాక్షరి, అష్టాక్షరి మంత్రాలతో ఆలయాలు మారుమోగిపోతుంటాయి. కొందరు సోమవారాలు, ఏకాదశి, పౌర్ణమి రోజుల్లో నియమాలు పాటిస్తే మరికొందరు కార్తీకమాసం మొత్తం తెల్లవారుజామునే చన్నీళ్లతో తలకు స్నానాలు చేస్తుంటారు. కొందరైతే భక్తి పేరుతో అనారోగ్యాన్ని కూడా లెక్కచేయరు. వాస్తవానికి సూర్యోదయానికి ముందు వణికించే చలిలో తలకు చన్నీటిస్నానం చేయమనడం వెనుకున్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే 



  • అప్పటివరకూ బయటపడని అనారోగ్య సమస్యలేమైనా ఉంటే బయటపడతాయి

  • నిన్న మొన్నటి వరకూ మేం చాలా ఫిట్ అనుకున్నవారి ఆరోగ్యం పై క్లారిటీ వస్తుంది

  • సూర్యోదయానికి ముందు చన్నీటి స్నానం శరీరానికి పట్టిన బద్ధకాన్ని వదిలించడంతో పాటూ మానసిక ప్రశాంతతను ఇస్తుంది  

  • ఆరోగ్యం సహకరించక నెలరోజులూ నియమం పాటించలేనివారు కార్తీక సోమవారాలు, ఏకాదశి, పౌర్ణమి రోజు తలకు స్నానం చేసి దీపాలు వెలిగించినా సరిపోతుందంటారు పండితులు 


Also Read: నాగుల చవితి పుట్టలో పాలుపోసే ముహూర్తం వివరాలు, పుట్ట దగ్గర చేయాల్సిన ప్రార్థన!


నిత్యం తలకు స్నానం చేయాలా!
సూర్యోదయానికి ముందే స్నానం చేయకపోతే పాపం చుట్టుకుంటుందని కొందరు, ఉపవాసం ఉండకపోతే భక్తి కాదని అంటారేమో అని మరికొందరు ఆలోచిస్తారు ( ఇదంతా భక్తితోనే). కానీ అప్పటికే చిన్నచిన్న అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు నిత్యం తలస్నానాలు చేయడం, చన్నీటి స్నానాలు చేయడం వల్ల అనారోగ్యం మరింత పెరుగుతుంది. 


ఏం చేయాలి!
కార్తీకమాసంలో ఆచరించే ప్రతి నియమం మీరెంత పటిష్టంగా ఉన్నారు, ఎంత ఆరోగ్యంగా ఉన్నారని టెస్ట్ చేసుకోవడం కోసమే 
మొదటి వారం రోజులు మీరు పాటించిన నియమాల కారణంగా మీరు తేలికపడ్డారా, మరింత అనారోగ్య సమస్యల్లోకి కూరుకుపోయారా అన్నది గమనించుకోవాలి
కార్తీకమాసంలో ఈ నియమాలు పాటించకపోతే ఏదో జరుగుపోతుందనే  అపోహ నుంచి బయటకు రావాలి
ఇక ఇళ్లలో స్నానం చేసేవారి సంగతి సరేకానీ...నదుల్లో, చెరువుల్లో స్నానాలు ఆచరించేవారు జాగ్రత్తగా ఉండాలి.. ఎందుకంటే అప్పట్లో నదుల్లో, చెరువుల్లో ఇంత పొల్యూషన్ ఉండేదికాదు..నీరు స్వచ్ఛంగా ఉండేది..కానీ ఇప్పటి పరిస్థితి ఎలా ఉందో అందరూ చూస్తున్నారు. అందుకే మీరు స్నానమాచరించే ప్రదేశంలో నీరు ఎలా ఉందో చూసుకోవాలి. 
హిందూ ధర్మంలో పాటించే నియమాలన్నీ మన జీవనవిధానాన్ని సక్రమంగా మార్చుకునేందుకు, కొన్ని మంచి అలవాట్లు పెంపొందించుకునేందుకు, పరిసరాల పరిశుభ్రత కోసమే అని తెలుసుకోవాలి


Also Read: పాములను పూజించడం మూఢనమ్మకమా, పుట్టలో పాలు పోయకూడదా - ఏది నిజం!


కార్తీకపురాణం ప్రకారం కూడా చూస్తే...మనస్ఫూర్తిగా చేసే నమస్కారం, భక్తితో వెలిగించే దీపం ప్రధానం...