మునుగోడు ఉప ఎన్నికల వేళ పెద్ద ఎత్తున నోట్ల కట్టలు పట్టుబడుతూనే ఉన్నాయి. నేడు (అక్టోబరు 28) కూడా హైదరాబాద్‌లో భారీ మొత్తంలో డబ్బు బయట పడింది. శుక్రవారం ఉదయం హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో పోలీసులు తనిఖీలు చేయగా, ఓ వాహనంలో రూ.70 లక్షల నగదును అధికారులు గుర్తించారు. దానికి పత్రాలు చూపకపోవడంతో మొత్తాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నగదును తరలిస్తున్న వాహనంతోపాటు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.