వార ఫలాలు (Weekly Horoscope Predictions June 13th to 19th)


తుల (చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాలు)
తులా రాశివారికి ఈ వారం మిశ్రమ ఫలితాలున్నాయి. తలపెట్టిన పనిలో సాధ్యాసాధ్యాలు చూసుకున్నాకే ముందడుగు వేయడం మంచిది. ముఖ్యమైన పనులు పూర్తిచేయాలంటే మనోధైర్యంతో ముందుకు సాగండి. వాహన వ్యాపారులకు లాభాలొస్తాయి. స్థిరాస్థి కొనుగోలు చేయాలనుకునేవారు ధైర్యంగా అడుగేయవచ్చు. కుటుంబంలో చిన్నపాటి అభిప్రాయ బేధాలొస్తాయి. 


వృశ్చికం (విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట)
వృశ్చిక రాశివారికి ఈ వార ధనలాభం ఉంటుంది. ఓ విషయంలో కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగులు ఏ విషయాన్ని పట్టించుకోకుండా తమపని తాము చేసుకుంటే పోతే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ప్రయాణాల్లో కొన్ని ఇబ్బందులుంటాయి. వ్యాపారంలో స్వల్ప లాభాలు అందుతాయి. 


Also Read:  జూన్ 15 నుంచి రాశిమారనున్న సూర్యుడు, ఈ రాశులవారికి అన్నీ అనుకూల ఫలితాలే


ధనస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం)
ధనస్సు రాశివారికి ఈ వారం ఎక్కువగా అనుకూల ఫలితాలే ఉన్నాయి. తలపెట్టిన పనులు పూర్తిచేయగలుగుతారు. అవరానికి డబ్బు చేతికందుతుంది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసేవారికి నిరాశ తప్పదు. ఓ వ్యవహారంలో మీ ముందుచూపు ప్రశంసలు అందుకుంటుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు కొంత ఇబ్బంది పెడతాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగులకు సహోద్యోగులతో మాటపట్టింపులుంటాయి. 


మకరం (ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాలు)
ఈ వారం మకర రాశివారికి ఆర్థికంగా కలిసొచ్చే కాలం. తలపెట్టిన పనులు సునాయాసంగా పూర్తిచేస్తారు. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన మార్పులు చోటుచేసుకుంటాయి. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. ఆకస్మిక ధనలాభ సూచనలున్నాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు వద్దు. శుభకార్యాలకు హాజరవుతారు.మీరంటే పడని వారికి దూరంగా ఉండండి. ఎట్టి పరిస్థితుల్లోనూ మనోధైర్యం కోల్పోవద్దు.


Also Read: శని తిరోగమనం ఈ రాశులవారికి సంపద, సంతోషాన్నిస్తుంది


కుంభం (ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు)
ఈ వారం కుంభరాశివారికి అనుకూల ఫలితాలే గోచరిస్తున్నాయి. ఆర్థిక వ్యవహారాలు సజావుగా సాగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగం దొరుకుతుంది. స్నేహితుల నుంచి శుభవార్త వింటారు. భూ వివాదాలు పరిష్కారమవుతాయి. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగుల ప్రతిభకు తగిన గుర్తింపు పొందుతారు. విద్యార్థులు కష్టానికి తగిన ఫలితం పొందుతారు. స్నేహితుల సలహాలు మీకు మంచిచేస్తాయి...కొన్ని విషయాల్లో నిర్లక్ష్యాన్ని వీడండి. 


మీనం (పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి)
తలపెట్టిన గురించి ఒకటికి రెండు సార్లు ఆలోచించి ముందుకు సాగితే మంచి ఫలితాలు అందుకుంటారు. ఇబ్బందులను అధిగమిస్తారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. భవిష్యత్తుకు సంబంధించిన కీలక నిర్ణయం ఈ వారంలో తీసుకునే అవకాశం ఉంది. ఓ శుభవార్త మీకు ఆనందాన్నిస్తుంది. వివాదాలకు దూరంగా ఉండండి. వృధా ఖర్చులు పెరుగుతాయి. అనారోగ్యం మరింత ఇబ్బంది పెడుతుంది. కుటుంబ సభ్యుల మాటను పరిగణలోకి తీసుకుంటే అంతా మంచే జరుగుతుంది. 


Also Read:  శని తిరోగమనం, ఈ రాశులవారు చాలా జాగ్రత్తగా ఉండాలి