గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి మారినప్పుడు ఆ ప్రభావం అన్ని రాశులవారిపైనా ఉంటుంది. కొందరికి అనుకూల ఫలితాలు ఉంటే..మరికొందరికి ప్రతికూల ఫలితాలుంటాయి. జూన్ 5 నుంచి శని రివర్స్ దిశలో కుంభరాశిలో ప్రయాణించనున్నాడు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం అతినెమ్మదిగా కదిలేగ్రహం శని. ప్రస్తుతం కుంభరాశిలో ఉన్న శనిగ్రహం జూన్ 5నుంచి నెమ్మదిగా వ్యతిరేకదిశలో కదులుతూ జూలై 12న మకరరాశికి వస్తుంది.  శని వక్రదిశలో ఉన్నప్పుడు కొన్ని రాశులవారికి ప్రతికూల ప్రభావాలుంటాయి.ఆ రాశులేంటో చూద్దాం...


కర్కాటకం
కుంభరాశిలో శని తిరోగమనం సమయంలో కర్కాటక రాశివారు జాగ్రత్తగా ఉండాలి. ఇంటా-బయటా వివాదాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. వాహన ప్రమాదాలున్నాయి..డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి. చిన్నపాటి అనారోగ్యాన్ని కూడా నిర్లక్ష్యం చేయవద్దు. మీ శత్రువులు, ప్రత్యర్థుల పట్ల జాగ్రత్తగా ఉండాలి..వారు చాలా యాక్టివ్ గా ఉంటారు. ఇప్పటికే కొన్ని సమస్యల్లో ఉన్నవారి పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. వీటన్నింటికీ పరిష్కారం శనిదేవుడి, హనుమంతుడి ఆరాధనే... 


Also Read:  భోజనం బాలేదు అంటూ తిట్టుకుంటూ తింటున్నారా!


సింహం
కుంభరాశిలో శని తిరోగమనం సింహరాశివారికి మిశ్రమ ఫలితాలనిస్తుంది. ఈ సమయంలో మీరు కుటుంబ సవాళ్లను ఎదుర్కొంటారు. మీ జీవిత భాగస్వామితో విభేదాలు  లేదా అపార్థాలు ఒత్తిడికి దారితీస్తాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఈ సమయంలో ఎంతో కష్టపడితే కానీ ఫలితం పొందలేరు. ఈ రాశి ఉద్యోగులు బాగానే ఉన్నప్పటికీ ఆదాయం పరంగా పెద్దగా లాభం ఉండదు. 


వృశ్చికం
శని వక్రంగా వెళ్లడంతో వృశ్చిక రాశివారు కొన్ని సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కోపం తగ్గించుకోవాలి. అధిక ఆవేశం వల్ల ఇంటా,బయటా సమస్యలు పెరుగుతాయి. పాత అనారోగ్యం తిరగబెడుతుంది. కార్యాలయంలో శత్రువుల పట్ల జాగ్రత్త వహించండి. ఆర్థిక ఇబ్బందులు వెంటాడతాయి..ఖర్చులు నియంత్రించకపోతే చాలా ఇబ్బంది పడతారు. ఉద్యోగం మారాలన్న ఆలోచనే ప్రస్తుత పరిస్థితుల్లో సరికాదు. 


మకరం
శని తిరోగమనం మకర రాశివారిని ఇబ్బందులకు గురిచేస్తుంది.విద్యార్థులు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య గొడవలు జరుగుతాయి. ఆలోచనాత్మకంగా వ్యవహరించి ఆవేశం తగ్గించుకుంటే పరిస్థితులు కొంతవరకూ సర్దుకుంటాయి. వ్యక్తిగత-వృత్తి జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకోగలగాలి. ఆస్తి వివాదం తలెత్తే అవకాశం ఉంది. పెట్టుబడులు పెట్టాలనే ఆలోచన అస్సలు చేయవద్దు. 


Also Read: ఈ ఫలం ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి ఉన్నట్టేనట


మీనం
శని తిరోగమనం వల్ల మీన రాశి వారు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటారు.ప్రేమికుల మధ్య కొన్ని అపార్థాలుంటాయి. వ్యాపారంలో భాగస్వామ్యంతో పనిచేసే వ్యక్తుల మధ్య కొన్ని విభేదాలు ఉండొచ్చు. కుటుంబ జీవితం గురించి మాట్లాడేటప్పుడు, కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు ఉండవచ్చు. వ్యాపారులకు నష్టాలు ఎదురవుతాయి. 


శనిగ్రహదోషాల నివారణకు హనుమాన్ చాలీసా, శని చాలీశా, శనిమంత్రాలు పఠించాలి. సూర్యోదయానికి ముందే నిద్రలేచి వాకింగ్ చేయడం, చీమలకు ఆహారం వేయడం, మూగజీవాలకు సేవ చేయడం లాంటివి చేస్తే శని ప్రభావం కొంతవరకూ తగ్గుతుందంటారు పండితులు. 


Also Read: జూన్ నెలలో ఈ ఆరు రాశులవారికి గ్రహస్థితి అంత అనుకూలంగా లేదు


Also Read: ఆరోగ్యం, ఆనందం, ఆదాయం-జూన్ నెలలో ఈ రాశులవారికి అద్భుతంగా ఉంది