Indian Railways: రైల్వే ప్రయాణికులారా..! ఈ విషయం తెలిసిందా? ఇకపై మీరు ఎక్కువ లగేజ్ తీసుకువెళ్తే ఛార్జీలు చెల్లించుకోవాలి. లగేజీకి ఛార్జేంటి అనుకుంటున్నారా? కానీ ఇక ఎక్స్‌ట్రా లగేజ్‌పై చార్జీలు పడతాయి. ఎక్కువ లగేజ్ ఉంటే దానికి కూడా ముందే బుకింగ్ చేసుకోవాలి. ముందు బుక్ చేసుకోకపోతే సాధారణ రేట్ల కన్నా ఆరు రెట్లు ఎక్కువ పెనాల్టీ కట్టాల్సి వస్తుంది. అవును లగేజ్ పరిమితి నిబంధనలను ఇక కచ్చితంగా అమలు చేస్తామని రైల్వే శాఖ పేర్కొంది.

ఎంత వరకు అనుమతి

రైలులో మనం ప్రయాణించే క్లాస్ బట్టి లగేజ్‌ను అనుమతిస్తారు. అయితే అందులో కొంచెం ఎక్కువ ఉన్నా పరిమిత లగేజ్ కింద అనుమతి ఇస్తారు. లగేజ్‌కు కనిష్ఠ ఛార్జీని రూ.30గా నిర్ణయించారు. ఆయా క్లాస్, లగేజ్ అనుమతి వివారాలు ఇవే

క్లాస్ ఇంత వరకు ఫ్రీ పరిమిత అనుమతి( Marginal allowance) గరిష్ఠంగా అనుమతించే లగేజ్ 
AC ఫస్ట్ క్లాస్  70 Kgs 15 Kgs 150 Kgs
AC 2-టైర్ స్లీపర్/ ఫస్ట్ క్లాస్  50 Kgs 10 Kgs 100 Kgs
AC 3-టైర్ స్లీపర్/ AC ఛైర్ కార్  40 Kgs 10 Kgs 40 Kgs
స్లీపర్ క్లాస్ 40 Kgs 10 Kgs 80 Kgs
సెకండ్ క్లాస్ 35 Kgs 10 Kgs 70 Kgs

బుకింగ్ ఇలా

లగేజ్ తీసుకెళ్లే ప్రయాణికులు ట్రైన్ బయలు దేరడానికి 30 నిమిషాల ముందుగానే బుకింగ్ స్టేషన్‌లోని లగేజ్ ఆఫీస్‌కు వెళ్లాలి. అక్కడ బుకింగ్ చేసుకోవచ్చు. లేదంటే వేరే ఆప్షన్ ఉంది. ప్రయాణికులు ట్రైన్ టికెట్ బుక్ చేసుకునే సమయంలోనే లగేజ్ కోసం కూడా ముందుగానే బుకింగ్ చేసుకోవచ్చు. అయితే లగేజ్‌ను భద్రంగా ప్యాక్ చేసి ఉంచాలి. లేకపోతే బుకింగ్ కోసం లగేజ్‌ను తీసుకోకపోవచ్చు. కనుక ప్రయాణికులు ఎక్కువగా లగేజ్ కలిగి ఉంటే పార్సిల్ ఆఫీస్‌కు వెళ్లి లగేజ్ కోసం బుక్ చేసుకోవడం మంచిది.

పెనాల్టీలు 

ఒకవేళ ట్రైన్‌లో పరిమితికి మంచి లగేజ్‌ను తీసుకెళ్తే పెనాల్టీలు చెల్లించుకోక తప్పదు. కనుక దీని కన్నా ముందు బుక్ చేసుకోవడం ఉత్తమం. లగేజ్ బుక్ చేసుకోకుండా తీసుకెళ్తే సాధారణ ఛార్జీల కన్నా ఆరు రెట్లు వరకు ఛార్జీలు పడతాయి. అందువల్ల లగేజ్ చాలా ఎక్కువగా ఉంటే మాత్రం పార్సిల్ ఆఫీస్‌కు వెళ్లి దాన్ని బుక్ చేసుకోవడం ఉత్తమం.

ఈ నిబంధనలను రైల్వేశాఖ కచ్చితంగా అమలు చేయనుంది. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా తెలియజేసింది. అందువల్ల మీరు ఎక్కువగా లగేజ్ తీసుకెళ్లే సమయంలో ముందుగానే దాన్నిబుక్ చేసుకోవడం మంచిది.

Also Read: Gyanvapi Row: 'ప్రతి మసీదులో శివలింగం వెతకాల్సిన పనేంటి'- బండి సంజయ్‌కు RSS చీఫ్ కౌంటర్

Also Read: Self-Marriage Ceremony:సెల్ఫ్ మ్యారేజ్‌ చెల్లుతుందా..? ఈ ట్రెండ్ ఎప్పుడు మొదలైంది..?