ABP  WhatsApp

Gyanvapi Row: 'ప్రతి మసీదులో శివలింగం వెతకాల్సిన పనేంటి'- బండి సంజయ్‌కు RSS చీఫ్ కౌంటర్

ABP Desam Updated at: 03 Jun 2022 05:34 PM (IST)
Edited By: Murali Krishna

Gyanvapi Row: జ్ఞానవాపి మసీదు వివాదంపై ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు.

'ప్రతి మసీదులో శివలింగం వెతకాల్సిన పనేంటి'- బండి సంజయ్‌కు RSS చీఫ్ కౌంటర్

NEXT PREV

Gyanvapi Row: జ్ఞానవాపి మసీదు (Gyanvapi mosque) వివాదంపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) చీఫ్ మోహన్ భగవత్ తొలిసారి స్పందించారు. ప్రతి మసీదులోను శివలింగం కోసం వెతకక్కర్లేదన్నారు. నాగపుర్‌లో జరిగిన ఆర్ఎస్ఎస్ ఆఫీసర్ ట్రైనింగ్ క్యాంప్ ముగింపు సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.



జ్ఞానవాపి అంశం ప్రస్తుతం నడుస్తోంది. చరిత్రను మనం మార్చలేం. ఇవాల్టి హిందువులు కానీ ముస్లింలు కానీ దాన్ని సృష్టించ లేదు. ఆ సమయంలో జరిగిన విషయం అది. దేశంపై దండెత్తివచ్చిన వారి నుంచి, బయట నుంచి ఇస్లాం వచ్చింది. ప్రజల్లో ఉన్న స్వాతంత్ర్య కాంక్షను దెబ్బతీసేందుకు జరిపిన దాడుల్లో దేవస్థానాలను కూల్చేశారు. ఇక జ్ఞానవాపి వివాదంలో విశ్వాసాలకు సంబంధించిన కొన్ని అంశాలున్నాయి. దానిపై కోర్టు నిర్ణయం తీసుకుంటుంది.. దానికి అందరూ కట్టుబడి ఉండాలి. అయితే ప్రతి మసీదులోనూ శివలింగం కోసం కోసం ఎందుకు అన్వేషించాలి? మరో ఉద్యమం చేపట్టేందుకు ఆర్ఎస్ఎస్ సుముఖంగా లేదు. మేము రాజమజన్మభూమి ఆందోళనలో పాలుపంచుకున్నాం. అందుకు పరిస్థితులే కారణం. ప్రజాభీష్టాన్ని మేము నెరవేర్చాం. ఇంకెలాంటి ఆందోళనలకు పిలుపునివ్వాలని మేము కోరుకోవడం లేదు.                                                      - మోహన్ భగవత్, ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్


వ్యతిరేకం కాదు


ముస్లింలకు హిందువులు ఎప్పుడూ వ్యతిరేకం కాదని భగవత్ అన్నారు. ఇవాల్టి ముస్లింల పూర్వీకులు కూడా హిందువులేనని పేర్కొన్నారు. మసీదుల్లో జరుగుతున్నది కూడా ఒక తరహా ప్రార్ధనేనని, అయితే అది బయట నుంచి వచ్చిందని భగవత్ అన్నారు. ఆరాధనా విధానాలను తాము వ్యతిరేకించడం లేదని మోహన్ భగవత్ చెప్పారు.


బండికి కౌంటర్


అయితే ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ భాజపా అధ్యక్షుడు బండి సంజయ్‌ చేసిన స్టేట్‌మెంట్‌కు కౌంటర్‌గా మారాయి. జ్ఞానవాపి వివాదంపై బండి సంజయ్ ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు.


దేశంలో ఉన్న ప్రతి మసీదును తవ్వించాలని, అందులో శివలింగాలు ఉంటే తాము తీసుకుంటామని, శవాలు ఉంటే ముస్లింలు తీసుకోవాలని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.


Also Read: Self-Marriage Ceremony:సెల్ఫ్ మ్యారేజ్‌ చెల్లుతుందా..? ఈ ట్రెండ్ ఎప్పుడు మొదలైంది..?


Also Read: ED Summons to Rahul Gandhi: రాహుల్ గాంధీకి మళ్లీ ఈడీ సమన్లు- ఈనెల 13న విచారణకు!


 

Published at: 03 Jun 2022 05:32 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.