2022 జూన్ 13 సోమవారం రాశిఫలాలు


మేషం
ఈ రోజు మీకు అంతగా బాగాలేదు. అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడతారు. వ్యాపారులు లావాదేవీలు నిర్వహించేటప్పుడు జాగ్రత్త. విద్యార్థులపై ఒత్తిడి పెరుగుతుంది. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ప్రేమికులు ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది.


వృషభం
ఈ రోజు మీకు చాలా మంచి రోజు అవుతుంది. ఆర్థిక స్థితి బలంగా ఉంటుంది. కొత్త వ్యాపారం ప్రారంభించేందుకు ఈరోజు అనుకూలమైన రోజు. ఈ రాశి విద్యార్థులు ఈరోజు కొత్త విషయాలను నేర్చుకుంటారు. ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు పూర్తిచేస్తారు. 


మిథునం
మతపరమైన కార్యక్రమాల పట్ల ఆసక్తి ఉంటుంది. వ్యాపారంలో పెట్టిన పెట్టుబడులు లాభిస్తాయి. బంధువును కలుస్తారు. ప్రేమికులకు ఈ రోజు ప్రత్యేకమైన రోజు. అప్పిచ్చిన మొత్తాన్ని తిరిగి చెల్లిస్తారు. తప్పుడు పనులు చేసేవారికి సహాయం చేయకండి. 


కర్కాటకం
ఈ రోజు స్నేహితుడిని కలుస్తారు. కొన్ని శుభవార్తలతో రోజు ప్రారంభమవుతుంది. ఏదైనా పని ప్రారంభించే ముందు కుటుంబ సభ్యులను సంప్రదించాలి. వ్యాపారంలో లాభం ఉంటుంది. విద్యార్థులకు చదువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ప్రయాణాలు కలిసొస్తాయి. జీవిత భాగస్వామి మద్దతు మీకు లభిస్తుంది. ఒత్తిడి తీసుకోవద్దు.


Also Read: జూన్ 15 నుంచి రాశిమారనున్న సూర్యుడు, ఈ రాశులవారికి అన్నీ అనుకూల ఫలితాలే


సింహం
ఈ రోజు సాధారణంగా ఉంటుంది. పాత మిత్రులను కలుస్తారు. గత వివాదాలు పరిష్కారమవుతాయి. ఆకస్మిక ధనలాభం సాధ్యమవుతుంది. వ్యాపారంలో ఆలోచనకు తగ్గట్టుగా లాభం ఉంటుంది. మీ కోపాన్ని అదుపులో ఉంచుకోండి. వైవాహిక సంబంధాలలో సాన్నిహిత్యం ఉంటుంది.


కన్య
సామాజిక సేవలో పాల్గొంటారు. ఇంట్లో సంతోషం ఉంటుంది. విద్యాపరమైన పనులపై ఆసక్తి చూపుతారు. పాత స్నేహితుడిని కలుస్తారు. వ్యాపారంలో ఆశించిన లాభం ఉంటుంది. ఉద్యోగంలో పురోగతి సాధ్యమవుతుంది. కార్యాలయంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. 


తులా
ఆఫీసు పనుల్లో అదనపు బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారంలో లాభం ఉంటుంది. విద్యార్థులకు ఈరోజు మామూలుగా ఉంటుంది. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. టెన్షన్ తగ్గుతుంది.అనుకున్న పనిని సకాలంలో పూర్తిచేయగలుగుతారు.


వృశ్చికం
చేతికి అందాల్సిన మొత్తం అందుతుంది. పోటీపరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు మంచి రోజు. ఈ రోజు మీరు శుభవార్త వింటారు. ఇల్లు లేదా భూమి కొనుగోలు చేసే అవకాశం ఉంది. కుటుంబ సమేతంగా మతపరమైన ప్రదేశాలకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. ధనలాభం ఉంటుంది. 


Also Read: శని తిరోగమనం ఈ రాశులవారికి సంపద, సంతోషాన్నిస్తుంది


ధనుస్సు 
ఈ రోజు మీకు పెద్ద బాధ్యత ఉంటుంది. తెలివిగా  ఖర్చు చేయండి. స్నేహితులతో ఏదో విషయంలో వాగ్వాదం జరగొచ్చు. మీ కోపాన్ని అదుపులో ఉంచుకోండి, లేకుంటే వివాదం పెరుగుతుంది. విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టాలి. ప్రేమికుల మధ్య సంబంధాలలో చీలికలు ఏర్పడవచ్చు. ప్రయాణ ప్రణాళికలను వాయిదా వేయండి.


మకరం
ఈరోజు సాధారణంగా ఉంటుంది. పిల్లలతో సంతషంగా గడుపుతారు. మీకు ఆసక్తి ఉన్న పని చేసే అవకాశం ఉంటుంది. కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. పూజల పట్ల ఆసక్తి ఉంటుంది.కొత్త పెట్టుబడులు పెట్టడం మానుకోండి, వ్యాపారంలో సాధారణ లాభాలు ఉంటాయి. ప్రేమ సంబంధాలు బలపడతాయి.


కుంభం
ఈ రోజు కొన్ని శుభవార్తలతో ప్రారంభమవుతుంది. అపరిచితుల పట్ల జాగ్రత్త వహించండి. మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. టెన్షన్ పోతుంది. పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. విద్యార్థులకు ఈరోజు అనుకూలమైన రోజు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.


మీనం
యువత కెరీర్ పరంగా విజయం సాధిస్తారు. కుటుంబంలో ఉత్సాహ వాతావరణం ఉంటుంది. వ్యాపారంలో పెట్టుబడి పెట్టే ముందు నిపుణులను సంప్రదించండి. విద్యా విషయాలతో సంబంధం ఉన్న వ్యక్తులకు ఈ రోజు అనుకూలమైన రోజు. విహారయాత్రకు వెళ్లేందుకు ప్రణాళికలు వేసుకోవచ్చు.


Also Read:  శని తిరోగమనం, ఈ రాశులవారు చాలా జాగ్రత్తగా ఉండాలి