మేషరాశి


మేషరాశి వారికి ఈవారం మిశ్రమ ఫలితాలుంటాయి. మిత్రులతో అకారణంగా విభేదాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగస్తులకు శుభసమాచారం అందుతుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడుతాయి. సన్నిహితుల నుంచి కొత్త విషయాలను తెలుసుకుంటారు. స్థిరాస్తి వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది. వారం ప్రారంభంలో అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి. కానీ వారాంతం వరకు వాటిని అధిగమిస్తారు. వ్యాపారంలో భాగస్వామ్యుల పెట్టుబడులతో లాభాలు గడిస్తారు. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. గృహ నిర్మాణ ఆలోచనలు వెంటనే అమలు చేస్తారు. శివారాధన చేయడం మంచిది.


వృషభ రాశి


ఈరాశి వారికి ఈవారం అనుకూలంగా ఉంది. ఆర్థిక పరిస్థితి చాలా మెరుగవుతుంది. వ్యాపారాల్లో లాభాలు కలుగుతాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వృత్తి వ్యాపారాలలో మీ అంచనాలు నిజమవుతాయి. ఉద్యోగస్తులకు పదోన్నతి ఉంటుంది. వారం ప్రారంభంలో అన్నదమ్ములతో వివాదాలు ఏర్పడే అవకాశాలున్నాయి. పిల్లల వివాహ, ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంతో కలిసి పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటారు. హనుమంతుడిని ఆరాధించడం ముఖ్యంగా హనుమంత్ కవచం పారాయణం చేయడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది.


మిధున రాశి


ఈరాశి వారికి ఈ వారం చిన్ననాటి మిత్రులను కలుకుంటారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. విలువైన వస్తువులను, వాహనాలను, ఆభరణాలను కొనుగోలు చేస్తారు. సంతానానికి నూతన విద్యావకాశాలు కలిసి వస్తాయి. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. రుణ బాధలు తీరుతాయి. ఆర్థికంగా ఆశాజనకంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. వ్యాపార లావాదేవీలు బాగుంటాయి. బంధువర్గంతో విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది. గణనాయకాష్టకం పారాయణ చేయడం వలన శుభఫలితాలను  పొందవచ్చు.


కర్కాటక రాశి


వీరికి ఈ వారం ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వారం చివరన ప్రయాణాలు చేస్తారు. నిరుద్యోగుల శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. ఆస్తి వివాదాలు పరిష్కరింపబడతాయి. చిన్న తరహా పరిశ్రమలకు నూతన పెట్టుబడులను చేస్తారు. వ్యాపారాల విస్తరణకు ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సమస్యలు తెలివిగా పరిష్కరిస్తారు. వారం మధ్యలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కున్నా నేర్పుగా అధిగమిస్తారు. ఆర్థిక సమస్యలు ఉంటాయి. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. గురుచరిత్ర పారాయణం చేయడం ఈ రాశివారికి చాలా మంచిది.


సింహ రాశి


ఈ రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. వారం ప్రారంభంలో పనులు సజావుగా సాగినా, వారం చివరిలో కొన్ని అనుకున్న పనులు సకాలంలో కాకుండా చికాకులు పెరుగుతాయి. నిరుద్యోగులకు శుభసమయం. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న అవకాశాలు అందివస్తాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో సన్నిహితుల సహాయసహకారలు అందుతాయి. గృహనిర్మాణం పనులు వేగవంతం చేస్తారు. వృత్తి వ్యాపారాలలో మీ శ్రమ ఫలించి లాభాలు అందుకుంటారు. ఆశించిన విధంగా ఆదాయం ఉంటుంది. పనిచేసేచోట ఉన్న వివాదాలు సమసిపోతాయి. మిత్రులతో అకారణంగా కలహాలు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. కనకధారాస్తోత్రం, లక్ష్మీస్తోత్రాలను పఠించడం శుభఫలితాన్ని పొందవచ్చు.


కన్య రాశి


ఈరాశి వారికి వ్యాపారాలలో లాభాలు అనుకున్న విధంగా దక్కుతాయి. ఉద్యోగాలలో బాధ్యతలు పెరిగినా నిదానంగా పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. విద్యార్థులకు అనుకూలమైన కాలం. కుటుంబ వాతావరణం అనుకున్నంత బాగుండదు. కొంతగందరగోళ పరిస్థితులు సూచిస్తున్నాయి. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. కొన్ని రంగాల వారికి అనుకోకుండా అవకాశాలు కలిసి వస్తాయి. వాటిని అందిపుచ్చుకునే ప్రయత్నాలు చేస్తారు. విష్ణుసహస్ర నామ పారాయణ చేయడం మంచిది.


తుల రాశి


ఈరాశి వారికి సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. ఉద్యోగాలలో కలిగే వివాదాల నుంచి తెలివిగా బయటపడతారు.  ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. సంతాన విషయంలో శుభవార్తలు అందుతాయి. కొన్ని రంగాల వారికి పరిస్థితులు చక్కబడతాయి, ఉత్సాహంగా కాలం గడుస్తుంది. వ్యాపారంలో లాభాలుంటాయి. వారం మధ్యలో ఆశ్చర్యకరమైన సంఘటనలు కలుగుతాయి. లలితా సహస్రనామ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.


వృశ్చిక రాశి


ఈరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి. బంధుమిత్రులతో కలిసి కీలక విషయాలను చర్చిస్తారు. వ్యాపారాలు ఆశించినంత ఆశాజనకంగా ఉండవు. చిన్నపాటి ఆనారోగ్య సమస్యలు కలిగే అవకాశాలున్నాయి. ఉద్యోగాలలో ఊహించకుండా ట్రాన్ఫర్లు అయ్యే అవకాశం ఉంది. చిన్న తరహా పరిశ్రమల వారు పెట్టుబడుల విషయంలో పునరాలోచన చేయడం చెప్పదగిన సూచన. ఆదాయం బాగుంటుంది. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. కుటుంబ వ్యవహారాలు కలిసిరావు. రామరక్షాస్తోత్రం పారాయణం చేయడం వల్ల ఈరాశి వారికి బాగుంటుంది.


ధనస్సు రాశి


ధనస్సురాశి వారికి ఈ వారం చాలా బాగుంది ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది. క్రమక్రమంగా మెరుగుపడుతుంది. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శన చేస్తారు. సంతాన వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఇంటా బయట సమస్యలను నేర్పుగా పరిష్కరించకుంటారు. ఆర్థిక పరిస్థితి క్రమక్రమంగా మెరుగుపడుతుంది. ఉద్యోగాలలో అధికారుల అండదండలు లభిస్తాయి. పదోన్నతలు  పెరుగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది. చేపట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. రుణదాతల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. బంధువులతో అకారణంగా వివాదాలు ఏర్పడే అవకాశాలున్నాయి. ఆదిత్య హృదయ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.


మకర రాశి


ఈరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఇంటా బయట విశేషమైన ఆదరాభిమానాలు పెరుగుతాయి. సంఘంలో పేరు ప్రతిష్టతలు కలుగుతాయి. పలుకుబడి ఉన్నవారితో నూతన పరిచయాలు ఏర్పడుతాయి. ఆర్థిక వ్యవహారాలు మందకొండిగా కొనసాగుతాయి. కొంత ప్రతికూల వాతావరణం ఉంటుంది. వారం ప్రారంభంలో మిత్రులతో కలహాలు ఏర్పడే అవకాశాలున్నాయి. ప్రముఖుల నుంచి కీలక సమాచారం అందుతుంది. దాయాదులతో ఉన్న ఆస్తి వ్యవహారాలలో ఊరట కలుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో మరింత అనుకూల వాతావరణం ఉంటుంది. వ్యాపారంలో లాభాలుంటాయి. కనకధారా స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు.


కుంభ రాశి


ఈరాశి వారికి ఈ వారం ఎప్పటి నుంచో వేధిస్తున్న సమస్యల నుంచి బయటపడతారు. సంతానం విద్యా విషయాల్లో శుభవార్తలు వింటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. విందు, వినోదాల కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగంలో మీ ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదలు వస్తాయి. వారం మధ్యలో బంధువులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి. ఉద్యోగాలలో అధికారులతో ఆచితూచి మాట్లాడండి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. చిన్న తరహా పరిశ్రమలకు ఊహించని అవకాశాలుంటాయి. నవగ్రహ కవచం పారాయణం చేయడం వల్ల శుభఫలితాలుంటాయి.


మీన రాశి


ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితా అంతంతమాత్రంగా ఉన్నప్పటికీ అవసరానికి తగిన ధనం చేతికందుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగవకాశాలు కనిపిస్తున్నాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. విందు వినోదాలలో పాల్గొంటారు. చిన్న తరహా పరిశ్రమల వారికి అనుకూలకాలం. ప్రముఖులతో చర్చలు ఫలిస్తాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు ఉంటాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండడం చెప్పదగిన సూచన. వారం మధ్యలతో సోదరులతో విభేదాలు కలుగుతాయి. ఆస్థి వ్యవహారాల్లో ఆచితూచి అడుగువేయండి. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకండి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.. లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.



Also Read: కార్తీకమాసంలో ఏ నూనెతో దీపారాధన చేయాలి? ఎలాంటి వత్తులు ఉపయోగించాలి?