Vidur Niti in telugu: మన ప్రవర్తనే మన గురించి ఇతరులకు అర్థమయ్యేలా చేస్తుంది. అందుకే ప్రవర్తన అనేది మనిషి మనసుకు దర్పణం అని అంటారు. ఒక వ్యక్తి తన బంధువులు, స్నేహితులు, సమాజంతో ఎలా ప్రవర్తించాలి అనేది చాలా ముఖ్యం. విదురుడు కూడా ఈ విషయం గురించి వివ‌రించాడు. జీవితంలో సమస్యలు ఎదురుకాకూడ‌ద‌ని అనుకుంటే ఎలాంటి ల‌క్ష‌ణాలను అలవర్చుకోవాలో తెలిపాడు. విదుర నీతి ప్రకారం వ్యక్తి ప్రవర్తన ఎలా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం.


1. ఎదుటి వారి వైఖరికి అనుగుణంగా వ్యవహరించండి


యస్మిన్ యథా వర్తతే యో మంజుస్తస్మింస్తథా వర్తితవ్యం స ధర్మః|
మాయాచారో మాయయా వర్తితవ్యః సాధ్వాచారః సాధునా ప్రత్యుపేయః||


ఈ శ్లోకం ద్వారా ఒక వ్యక్తి తనతో ఉన్న వ్యక్తి లాగే ప్రవర్తించాలని విదురుడు చెప్పాడు. ఇది అత‌ని ల‌క్ష‌ణంగా మారాల‌ని సూచించాడు. మీతో ఉన్నవారు మంచివారైతే మీరు కూడా అత‌నితో బాగుండాల‌ని.. అలాగే, మీ భాగస్వామి చెడ్డవారైతే, మీరు కూడా వారితో చెడు వైఖరిని ప్రదర్శించాలని విదురుడు స్ప‌ష్టంచేశాడు. ఇలా చేయడం ద్వారా.. ఒక వ్యక్తి తనతో పాటు తన కుటుంబాన్ని అనేక సమస్యల నుంచి రక్షించుకోగలడ‌ని తెలిపాడు. ఎందుకంటే చెడ్డ మ‌న‌స్త‌త్వం ఉన్న‌ వ్యక్తి.. మీ సంక్షేమాన్ని కోరుకోడు, మీ కుటుంబ సంక్షేమం గురించి ఆలోచించడు. అతను ఎప్పుడూ మీ ప‌త‌నం కోస‌మే ప్ర‌యత్నిస్తాడు. అదే మంచి మ‌న‌సున్న వ్య‌క్తి అయితే తనతో పాటు మీ మొత్తం కుటుంబం శ్రేయస్సును కోరుకుంటాడు.


Also Read: అక్షయ తృతీయ అంటే బంగారం కొనడం కాదు, ఈ ఆలయాలకు చాలా ప్రత్యేకం!


2. ఇతరులను విశ్వసించే ముందు జాగ్రత్తగా ఉండండి


విశ్చాసేదవిశ్చాస్తే విశ్చాస్తే నాతివిశ్చాసేట్|
విశ్చాసద్ భయముత్పన్న మూలాన్యపి నిక్రాన్తతి||


విదుర నీతిలోని ఈ శ్లోకంలో.. విశ్వాసానికి అర్హుడు కాని వ్యక్తిని ఎప్పుడూ విశ్వసించకూడదని విదురుడు చెప్పాడు. అలాంటి వారిని ఎవరూ మార్చలేరు. అయితే అత్యంత నమ్మదగిన వ్యక్తిని కూడా గుడ్డిగా విశ్వసించకూడద‌ని సూచించాడు. ఎందుకంటే అతి విశ్వాసం మనకు హాని కలిగిస్తుంది. అందుకే అందరి ముందు నీ రహస్యం చెప్పకూడదు. అలాగే, మీరు చాలా ఉదార భావాలు క‌లిగి ఉండకూడదు, తద్వారా ఎదుటి వ్యక్తి మీ స‌హాయాన్ని, మంచిత‌నాన్ని దుర్వినియోగం చేసే ప్ర‌మాదం ఉంది.


3. ఈ ల‌క్ష‌ణాలు ఉంటే నిత్య సంతోషి


సారంభేనరభతే త్రివర్గమకారితః శంసతి తత్త్వమేవ|
న మిత్రథార్రోచయతే వ్యవస్థ నపూజితః కుప్యతి చాప్యముధాః||


ధర్మం, అర్థ, కామం త‌దిత‌ర విష‌యాల్లో ఎప్పుడూ తొందరపడని వ్య‌క్తి, ఎప్పుడూ నిజమే మాట్లాడట‌మే కాకుండా, వివాదాలకు దూరంగా ఉండాలని కోరుకుంటాడు. మీరు అతనిని అగౌరవపరిస్తే అతను బాధపడడు. అలాంటి వ్యక్తి మంచి వ్యక్తుల సరసన చేరతాడు. ఎందుకంటే ఈ రెండింటికీ ఓర్పు, వివేకం అవసరం. తెలివితేటలను ఉపయోగించకుండా ఎవ‌రో ఒక‌రిని అనుసరించడం, సంపాద‌న వెంట‌ పరిగెత్తడం మూర్ఖుల పని. అలాగే విప‌త్క‌ర‌ సమయాల్లో అధైర్యపడకుండా స‌మ‌స్య‌ల‌ను దృఢ సంకల్పంతో ఎదుర్కొనేవాడు ఎప్పుడూ సంతోషంగా ఉంటాడని విదురుడు చెప్పాడు.


Also read: గంగమ్మ జాతరలో స్త్రీల రూపంలో పురుషులు, ఈ వేషధారణ వెనుక కారణం తెలిస్తే పూనకాలు లోడింగ్!


ఒక వ్యక్తి జీవితంలో పరిపూర్ణత సాధించాలంటే, అతను విదుర నీతిలో పేర్కొన్న ఈ లక్షణాలను అలవర్చుకోవాలి. అప్పుడు తన జీవితంలోని ప్రతి విషయంలోనూ అలాంటి వ్య‌క్తి విజయం సాధిస్తాడ‌ని విదురుడు చెప్పాడు.