అక్షయ తృతీయకు ఆధ్యాత్మికంగా చాలా ప్రత్యేకత ఉంది. ఈ రోజు కొన్ని ఆలయాల్లో విశిష్ఠమైన పూజలు జరుగుతాయి. ఈ ఆలయాలన్నీ చాలా ముఖ్యమైనవి, జీవితకాలంలో హిందువులు ఒక్కసారైనా దర్శించుకోవాల్సినవి అని చెబుతారు పండితులు..
సింహాచలం చందనోత్సవం
సింహాచలంలోని ఉగ్రరూపుడైన నారసింహస్వామిని శాంతింపచేయడానికి అప్పట్లో ప్రహ్లాదుడు, ఆ తర్వాత పురూరవుడు చందనాన్ని లేపనం చేశారు. ఈ రోజు అక్షయ తృతీయ కావడంతో ఏటా అక్షయ తృతీయ రోజు స్వామికి చందనోత్సవం నిర్వహిస్తారు. కేవలం ఈ ఒక్కరోజు మాత్రమే మూలవిరాట్టు మీదున్న చందనాన్ని తొలగించి..స్వామివారి నిజరూప దర్శన భాగ్యం కలిగిస్తారు. వరాహ ముఖం, నరుని శరీరం, తెల్లని జూలు, రెండు చేతులు, భూమిలో దాగివున్నపాదాలు.. ఈ నిజరూప స్వామి దర్శనం అక్షయ తృతీయ రోజు మాత్రమే కొన్ని గంటలు సేపు ఉంటుంది. ఆ సమయంలో లక్షల మంది భక్తులు స్వామిని దర్శించుకుంటారు. ప్రత్యేక పూజల అనంతరం తిరిగి చందనం లేపనం చేయడంతో
Also read: గంగమ్మ జాతరలో స్త్రీల రూపంలో పురుషులు, ఈ వేషధారణ వెనుక కారణం తెలిస్తే పూనకాలు లోడింగ్!
బద్రీనాథ్
చార్ ధామ్ క్షేత్రాల్లో ఒకటైన బద్రీనాథ్ ఆలయాన్ని చలికాలంలో మూసివేస్తారు. ఈ ఆరునెలల సమయంలో బదరీనాథుడిని దేవతలు పూజిస్తారని విశ్వాసం..అందుకు సాక్ష్యంగా ఆలయం తలుపులు తెరిచేసరికి అఖండ దీపం వెలుగుతూనే ఉంటుంది, పూలు వాడిపోకుండా ఉంటాయని చెబుతారు. ఇలా మూసివేసిన ఆలయాన్ని ఎప్పుడు తెరవాలన్నది ఆలయ పూజారులు నిర్ణయిస్తారు. ఇది సామాన్యంగా అక్షయతృతీయకి సమీపంలోనే ఉంటుంది. బదరీనాథ్ సమీపంలో గంగోత్రి, యమునోత్రి ఆలయాలైతే అక్షయతృతీయనాడే తిరిగి తెరుస్తారు. యమునోత్రి, గంగోత్రి ఆలయాలను తెరవడంతో చార్ ధామ్ యాత్ర ప్రారంభమవుతుంది. 25న కేదార్‌నాథ్, 27న బద్రీనాథ్ ఆలయాలు తెరుచుకోనున్నాయి. 25వ తేదీన ఓంకారేశ్వర ఆలయంలో ఉదయం 4 గంటలకు మహాభిషేక పూజతో పాటు సంప్రదాయంగా నిర్వహించాల్సిన అన్ని కార్యక్రమాలు ముగిసిన తర్వాత 6:30 గంటలకు కేదార్‌నాథ్‌లోని ఆలయ మహాద్వారాన్ని తెరవనున్నారు. అదే రోజు ఉదయం 8:30 గంటలకు కేదార్ నాథుడికి హారతి ఇవ్వనున్నారు. అదే విధంగా ఏప్రిల్ 27న ఉదయం 7:10 గంటలకు బద్రీనాథ్ ఆలయాన్ని తెరవనున్నారు.
Also Read: సింహాద్రి అప్పన్నకు ఏడాదికోసారి చందనోత్సవం ఎందుకు చేస్తారు, ఈసారి ఎప్పుడొచ్చింది!
పూరీ
పూరీ జగన్నాథుని పేరు వినగానే రథయాత్ర గుర్తొస్తుంది. ఏటా ఆషాఢ మాసంలో జరిగే రథయాత్రని చూసేందుకు లక్షలాది భక్తులు పూరీకి చేరుకుంటారు. ఈ రథయాత్ర కోసం రథాల నిర్మాణం అక్షయ తృతీయ రోజున మొదలవుతుంది. ఆలయ పూజారుల నేతృత్వంలో ప్రత్యేకంగా ఎంపిక చేసిన దుంగలకి ఈ రోజు పూజ చేసి రథనిర్మాణాన్ని ఆరంభిస్తారు.
కుంభకోణం
తమిళనాడులోని కుంభకోణంలో ఉండే 12 వైష్ణవాలయాలలోని ఉత్సవమూర్తులు అక్షయతృతీయ రోజున గరుడవాహనం మీద బయల్దేరతారు. ఇలా ఒకే రోజున 12 ఆలయాల నుంచి ఊరేగింపుగా వచ్చే స్వామివార్లను చూసేందురు భారీగా భక్తులు పోటెత్తుతారు.
బృందావనం
శ్రీకృష్ణుని పాదస్పర్శతో పునీతమైన బృందావనంలో ‘బంకే బిహారి’ అనే ఒక ఆలయం ఉంది. బృందావనంలో ఉన్న ప్రముఖ ఆలయాలలో ఇదొకటి. ప్రముఖ సంగీతకారుడు స్వామి హరిదాస్ నిర్మించిన ఈ ఆలయంలో ప్రత్యేకత ఏంటంటే...ఇక్కడి మూలవిరాట్టుగా ఉన్న గోపాలుని పాదాలని దర్శించే అవకాశం ఒక్క అక్షయ తృతీయ రోజు మాత్రమే దక్కుతుంది.