Vastu Tips: కోవిడ్ కాలం నుంచి చాలా మంది వర్క్ ఫ్రం హోం చేస్తున్నారు. ఇంట్లో పనిచేసేవాళ్లు ఉద్యోగం గురించి చాలా ఒత్తిడికి గురవుతుంటారు. అయితే ఇంట్లో నుంచి పనిచేస్తున్న వారికి వాస్తు శాస్త్రం కొన్ని నియమాలను సూచించింది. ఇంట్లో నుంచి పనిచేసే సమయంలో కొన్ని సవాళ్లు ఎదురువుతాయి. వాటిని అధిగమించడానికి ఉద్యోగులు వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని చిట్కాలు పాటించాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఇంట్లో నుంచే ఆఫీస్ ఏర్పాటు చేసుకునేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. కొన్ని దిశల్లో మాత్రమే ఆఫీస్ ఉండాలని సలహా ఇస్తున్నారు. ముఖ్యంగా ఈ ఐదు వాస్తు చిట్కాలు అనుసరించడం వల్ల పనిలో విజయం సాధించడం సులభం అవుతుందని చెబుతున్నారు. ఆ చిట్కాలేంటో చూద్దామా. 


వర్క్ ఫ్రం హోం చేసేవారు అనుసరించాల్సిన ఐదు వాస్తు చిట్కాలు ఇవే: 


1. డెస్క్ ప్లేస్ మెంట్ :


పనిచేస్తున్నప్పుడు రోజు ఒకే స్థలంలో కూర్చోవడం చాలా ముఖ్యం. ల్యాప్ టాప్ ను తీసుకుని కాసేపు మంచంపై పడుకుని పనిచేయడం.. కాసేపు కింద కూర్చొని పనిచేయడం, కుర్చీలో కూర్చొని చేయడం సరికాదు. ఇలా చేయడం వల్ల పనితీరుపై ప్రభావం పడుతుంది. బదులుగా మీ వర్క్ స్టేషన్‌ను ఒక పూజ గదిలా భావించి అక్కడే ప్రతిరోజూ పనిచేసుకోవడం చాలా మంచిది. అక్కడ నుంచి పనిచేస్తేనే ఎక్కువగా ఏకాగ్రతతో పనిచేస్తారు. ఒక స్థలం నుంచి పనిచేయడం వల్ల మీ పని గురించి తప్ప ఇతర ఆలోచనలు మీ మనస్సులోకి రావు. ఏకాగ్రత అనేది దెబ్బతినదు. 


2. దిశ:


సూర్యుడు ఉదయించే తూర్పు వైపు లేదంటే ఉత్తరం వైపు లేదా ఈశాన్యంవైపు తిరిగి పనిచేసుకుంటే మీ తెలివి బాగా మెరగవుతుంది. మీ వీపు గది ప్రవేశ ద్వారానికి ఎదురుగా ఉండకుండా జాగ్రత్తగా పడాలి. ఎందుకంటే గది ప్రవేశానికి ఎదురుగా ఉంటే మీ మనస్సు మరింత చంచలంగా ఉంటుంది. దీని వల్ల మీరు అలసిపోతారు. మీలో ఆందోళన ఎక్కువ అవుతుంది. 


3. సహజకాంతి:


మీరు పనిచేస్తున్న ప్రదేశంలో వెంటిలేషన్ బాగా ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే సహజకాంతి మీ ఉత్సాహాన్ని పెంచుతుంది. అంతేకాదు మంచి విజయాన్ని కూడా అందిస్తుంది. మీ వర్క్ స్టేషన్ లో స్వచ్చమైన గాలి వచ్చేందుకు వీలుగా కిటికీలు లేదా తగినంత వెంటిలేషన్ ఉండేలా జాగ్రత్తలు తీసుకోండి. 


4. వాస్తు :


భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం వాస్తు ప్రకారం మీ ఇంట్లో మీరు పనిచేసే ప్రదేశంలో శాంతియుతంగా ఉండాలి. మీరు వర్క్ ప్లేసులో వీటికి సంబంధించిన వస్తువులు, రంగులను ఉపయోగించాలి. వీటిని సమతుల్యంగా ఉంచడంలో మీరు ఇండోర్ మొక్కలను  లేదా చిన్న ఫౌంటెన్ లేదా ఇతర వాటర్ ఫీచర్లను ఏర్పాటు చేసుకోవచ్చు. 


5. వర్క్ ప్లేస్ చక్కగా ఉండాలి:


మీరు ఉత్సాహంగా పనిచేయాలన్నా..ఒత్తిడి తగ్గించుకోవాలన్న చక్కని వర్క్ స్టేషన్ ను కలిగి ఉండటం చాలా అవసరం. ఇంటి ఆఫీస్ ను చక్కగా,అందంగా డెకరేట్ చేసుకోవాలి. మీరు పనిచేస్తున్న స్థలంలో అవసరం లేని వస్తువులను తీసివేయండి. మీరు వర్క్ చేసే ప్రాంతాన్ని చక్కగా ఉంచుకోండి. మీరు పనిచేసే ప్రాంతంలో ఎసెన్షియల్ ఆయిల్స్ వెదజల్లే ఆయిల్ డిప్యూజర్ ఉంచాలి. 


ఇవే కాకుండా కర్పూరాన్ని ఉపయోగించినా మంచి ఫలితం ఉంటుంది. మీరు పనిని ప్రారంభించే ముందు ఉదయం ఆచారంగా కొంత కర్పూరాన్ని వెలిగించండి. ఇలా చేస్తే రోజంతా మీకు పనిచేసే సామర్థ్యాన్ని పెంచుతుంది. ప్రతికూలతను తొలగిస్తుంది. 


Also Read :  కొత్తగా పెళ్లయ్యిందా? మీ బెడ్ రూమ్‌ను ఇలా అలంకరించుకుంటే.. సుఖం, సంపద!


Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. వివిధ శాస్త్రాలు, గ్రంథాలు, పండితులు పేర్కొన్న కొన్ని ఆధ్యాత్మిక అంశాలు, పరిష్కారాలను ఇక్కడ యథావిధిగా అందించాం. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు.. ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.