నూతన దంపతులు కొత్త జీవితం ప్రారంభిస్తున్నపుడు వారి ఆనందకర జీవితం కోసం అందరూ శుభాకాంక్షలు చెబుతారు. వారి దాంపత్యం కలకాలం ఆనందంగా సాగాలంటే వారు కాపురం చెయ్యబోయే ఇంట్లోని వాస్తు కూడా అందుకు అనుకూలంగా ఉండాలి. కొత్త దంపతుల బెడ్ రూమ్ కోసం కొన్ని వాస్తు నియమాలు తెలుసుకుందాం.
చాలా కుటుంబాలు వాస్తు నియమాలను అనుసరించి వారి ఇంటికి తగిన ఏర్పాట్లు, మార్పులు చేసుకుంటూ ఉంటారు. ఇంట్లోకి కొత్త కోడలు వస్తున్నపుడు తనకు స్వాగతం పలుకుతూ కొత్త దంపతుల కోసం గది ఏర్పాటు చెయ్యడం పరిపాటి.
- కొత్త దంపతుల కోసం ఏర్పాటు చేసే గది వాస్తును అనుసరించి నైరుతిలో ఉండాలి. ఈ దిశలో దంపతుల మధ్య ప్రేమానురాగాలు పెరిగేందుకు, వారి మధ్య సఖ్యతకు అనుకూలంగా ఉంటుంది. ఈశాన్యంలో నవదంపతుల పడక గది ఏర్పాటు చెయ్యకూడదు.
- కొత్తగా పెళ్లయిన వారు తమ పెళ్లి సమయంలో తీసుకున్న ఫోటోలను గదిలో అలంకరించుకోవడానికి ఆసక్తి చూపుతారు. ఇలాంటి ఫోటోలను గదిలోని తూర్పు దిక్కు గోడ మీద అలంకరించుకోవచ్చు. ఇది వారి మధ్య సామరస్యానికి కారణం అవుతుంది.
- వాస్తును అనుసరించి మంచాన్ని ఏర్పాటు చేసుకోవాలి. పడుకున్నపుడు దక్షిణం వైపు తల ఉండేలా ఏర్పాటు చేసుకోవాలి. నలుపు , బ్రౌన్, గ్రే క్రీమ్ కలర్స్ లో వాల్ పేపర్లు పెట్టుకోవద్దు.
- బెడ్ షీట్లు, దుప్పట్లు, పిల్లో కవర్లు కూడా ఈ రంగులవి ఉపయోగించకపోవడమే మంచిది. పసుపు, లేత నీలం, పసుపు, గులాబి రంగు, ఆరెంజ్ రంగుల్లో వాల్ పేపర్స్ నుంచి బేడ్ షీట్లు, దుప్పట్లు ఉపయోగించాలి. మంచం ప్రతిబింబం కనిపించే విధంగా అద్దం ఏర్పాటు చేసుకోవద్దు. అద్దం ఇలా ఉంటే ఆరోగ్యానికి హాని చేస్తుంది.
- బెడ్ రూమ్ ఎప్పుడూ శుభ్రంగా చెత్త పేరుకోకుండా ఉండాలి. పనికి రాని వస్తువులు ఎప్పుడూ బెడ్ రూమ్ లో ఉంచకూడదు. వాస్తును అనుసరించి పని చేసుకునే వస్తువులు కూడా బెడ్ రూమ్ లో ఉండకూడదు. అంటే లాప్ టాప్, కంప్యూటర్, చార్జర్లు ఇతర గాడ్జెట్ సామాగ్రి బెడ్ రూమ్ లో ఏర్పాటు చేసుకోవద్దు. ఇవి కొత్తగా పెళ్లయిన వారి మధ్య దూరానికి కారణం అవుతాయి. కనుక వీలైనంత వరకు పనిచేసుకునే సాధనాలు, పని విషయాలను బెడ్ రూమ్ లోకి తీసుకురాకూడదని వాస్తు సూచిస్తోంది.
- బెడ్ రూమ్ లో ఏర్పాటు చేసుకునే ఫర్నీచర్ ఎప్పుడూ చెక్కతో చేసినవైతే మంచిది. వీటి నుంచి వచ్చే ఎనర్జీ వెచ్చగా సౌకర్యంగా ఉంటుంది. మెటల్ తో చేసిన ఫర్నిచర్ నుంచి వచ్చే ఎనర్జీ చల్లగా ఉండడం వల్ల అంత మంచిది కాదు. మంచం మీద ఉఫయోగించే మ్యాట్రెస్ ఎప్పుడూ సింగిల్ అయితే ఇద్దరి మధ్య సఖ్యతకు దోహదం చేస్తుంది.
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. వివిధ శాస్త్రాలు, గ్రంథాలు, పండితులు పేర్కొన్న కొన్ని ఆధ్యాత్మిక అంశాలు, పరిష్కారాలను ఇక్కడ యథావిధిగా అందించాం. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు.. ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.
Also Read : పీరియడ్స్ సమయంలో ప్రెగ్నెంట్ అవ్వొచ్చా? ఆ రోజుల్లో ట్రై చేస్తే గర్భం దాల్చే అవకాశాలు పెరుగుతాయా?