కలలను కంట్రోల్ చెయ్యడం ఎవరికీ సాధ్యం కాదు. కొన్ని కలలు మంచి కలలై భవిష్యత్తు మీద ఆశలు పెంచితే.. మరి కొన్ని కలలు పీడకలలై వెంటాడుతాయి. నిద్ర పోవాలంటే భయపడేలా చేస్తాయి. అలాంటి సమస్యను తీర్చుకునేందుకు మన జ్యోతిష, వాస్తు శాస్త్రాల్లో పరిష్కారాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు.


వాస్తు ఏం చెబుతోంది?


మానసిక, శారీరక ఆరోగ్యాలకు తగినంత మంచి నిద్ర అవసరం. అలసిన శరీరానికి తిరిగి ఉత్తేజాన్ని ఇచ్చేది చక్కటి నిద్ర. కానీ కొందరికి పీడకలలు పదేపదే వెంటాడుతుంటాయి. సరిగ్గా నిద్రపోనివ్వవు. అలాంటి ఇబ్బంది పడుతున్న వారిలో మీరూ ఉంటే ఇక్కడ చెప్పే చిన్నచిన్న నియమాలు పాటించి చూడండి. ఫలితం ఉంటుంది.


వాస్తు నియమాలు


మీ పడకగదిలో ఏ దిక్కున మీ బెడ్ అరెంజ్మెంట్ ఉంది, మంచం పరిసరాల్లో ఎలాంటి వస్తువులు ఉన్నాయనేది నిద్ర మీద నేరుగా ప్రభావం చూపుతాయి.


పటిక లేదా ఉప్పు కలిపిన నీళ్లు


పటిక పాజిటివిటీకి సంకేతం. పటిక ముక్కను దిండు కింద పెట్టుకోవడం లేదా మంచి పక్కన పటిక ఉంచుకోవడం పీడకలల పీడ వదులుతుందట. ఇలా వారం పాటు చేసి వారం తర్వాత ఆ పటిక ముక్కను కాల్చెయ్యాలని సూచిస్తున్నారు. ఇల్లు తుడిచేందుకు ఉపయోగించే నీటిలో గుప్పెడు ఉప్పు కలిపితే పీడకలలు రావు.


పరదాల రంగులు


పడక గదిలో ఉపయోగించే పరదాలు, దుప్పట్ల రంగుల ప్రభావం కూడా నిద్ర మీద ఉంటుందట. పీడ కలలు వేధిస్తున్న వారు పడకగది పరదాలు, దుప్పట్లు లేత నీలం రంగువి వాడితే మంచి ఫలితం ఉంటుంది. వీటి వల్ల ఎనర్జీ బ్యాలెన్స్ అవుతుంది.


రాగి


దీర్ఘకాలంగా పీడకలలు వేధిస్తుంటే ఒక రాగి పాత్రను మంచం దగ్గరగా పెట్టుకుంటే సరి. ఆ పైన పీడకలల వేధింపులు తగ్గిపోతాయట. అంతే కాదు ఏదైనా రాగి ఆభరణం, ఉంగరం, కడియం వంటిది ధరించినా సరే పీడలల పీడ వదులుతుంది.


నిద్రించే దిశ


ఏదిక్కున తల ఉంచి నిద్రపోతున్నారు. మీ కాళ్లు ఎటువైపు ఉంటున్నాయి వంటి విషయాలు కూడా నిద్ర నాణ్యతను నిర్ణయిస్తాయి. పీడకలల నుంచి విముక్తి కోరుకునే వారు ఎప్పుడూ కూడా తలను తూర్పు లేదా ఉత్తర దిశల్లో ఉంచి నిద్రించకూడదు. ఈ దిక్కులు శరీరంలోని ఎనర్జీ బాడీ మీద నెగెటివ్ ప్రభావం చూపుతాయని వాస్తు చెబుతోంది.


నిద్రకు ఉపక్రమించే ముందు పాదాలను గోరువెచ్చని నీటితో కడుక్కుంటే కలలు వేధించవు. అంతేకాదు నుదుటి మీద కొబ్బరి నీళ్లు రాసుకున్నా కూడా కష్టపెట్టే కలలు రావట.


Also Read : ఈ రాశుల వారికి అసూయ ఎక్కువట - ఇతరుల సక్సెస్‌ను ఓర్చుకోలేరట!




Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. వివిధ శాస్త్రాలు, గ్రంథాలు, పండితులు పేర్కొన్న కొన్ని ఆధ్యాత్మిక అంశాలు, పరిష్కారాలను ఇక్కడ యథావిధిగా అందించాం. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు.. ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.