వాస్తు నియమాలు జీవితంలో విజయాలను నిర్దేశిస్తాయి. వంటింటికి సంబంధించిన కొన్ని వాస్తు సూచనలు సంపదను అందిస్తాయి. కష్టాలను దూరం చేస్తాయి. వంటింటికి.. ఇంట్లోని ఆర్థిక పరిపుష్టికి నేరుగా సంబంధం ఉందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. దాని వల్ల వంటగదిలో చేసే కొన్ని పనులు మీ ఆర్థిక వ్యవహారల మీద ప్రభావం చూపుతాయట. ఆర్థిక ఆటంకాలు తొలగేందుకు వంటింటిని ఏ విధంగా పెట్టుకోవాలో తెలుసుకుందాం.


ఈ జాగ్రత్తుల వంటింట్లో తప్పనిసరి


ఖాళీ డబ్బాలు


ఇంట్లో పప్పులు, ఇతర వంట సామాగ్రి నిలువ చేసుకునే డబ్బాలు, సీసాలు ఖాళీగా ఉంచకూడదు. ఇది ఇంట్లో లేమిని సూచిస్తుందని శాస్త్రం చెబుతోంది. అందుకే వంట సామాగ్రి ఎల్లప్పుడు సమృద్ధిగా ఇంట్లో ఉంచుకోవాలట.


పాడైపోయిన ఆహారం


ఎక్పైరీ డేట్స్ అయిపోయిన ఎలాంటి ఆహార ఉత్పత్తులైనా సరే ఇంట్లో ఉంచుకోవద్దు. అంతేకాదు ఇంట్లో వండిన ఆహారం అయినా సరే పాడైపోయ్యే వరకు ఇంట్లో ఉంచకూడదు. వీటి ద్వారా ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది. పనికి రాని పదార్థాలు, వస్తువుల ఇంట్లో ఉంచుకోకూడదని వాస్తు చెబుతోంది. వీటి వల్ల ఇంట్లో ఆర్థిక సంక్షోభం ఏర్పడవచ్చు.


పనికిరాని ఎలక్ట్రానిక్ వస్తువులు


పనిచెయ్యని ఎలక్ట్రానిక్ కిచెన్ సామాగ్రిని వెంటనే వంటింట్లో నుంచి తీసెయ్యాలి. వాడని కిచెన్ సామాగ్రి వల్ల ఇంట్లోకి సంపద రాదట. వంటింటిని వీలైనంత సింపుల్ గా ఉంచుకోవడం మంచిది.


పదునైన వస్తువుల వినియోగం


వంటింట్లో వాడే కత్తులు, కత్తెరలు, ఇతర పదునైన వస్తువులను తప్పకుండా వాటికై కేటాయించిన స్థలాల్లోనే భద్రపరచాలి. అవి సరైన స్థానంలో లేకపోతే ఇంట్లో ఆర్థిక అస్థిరత ఏర్పడవచ్చు. ఇలా జరగకుండా కత్తుల వంటి పదునైన వస్తువులను వాటి స్థానాల్లో భద్రపరచడం అవసరం.


పరిశుభ్రత


వంటిల్లు శుభ్రంగా, ఆర్గనైజ్డ్ గా ఉండాలి. లేకపోతే ఆర్థిక పురోభివృద్ధి నిలిచిపోతుంది. వాస్తూ, జ్యోతిషం రెండూ కూడా వంటిల్లు శుభ్రంగా, వస్తువులన్నీ సర్దిపెట్టి ఉండాలని సూచిస్తున్నాయి. ఇలా శుభ్రంగా ఉన్న వంటిల్లు లక్ష్మీదేవికి ఆహ్వానం పలుకుందట.


విరిగిన పగిలిన పాత్రలు


వంటింట్లో అత్యంత ముఖ్యమైన సామాగ్రి వంట పాత్రలు. వాస్తును అనుసరించి విరిగిపోయిన, పగిలిపోయిన, పగుళ్లు తేలిన పాత్రలను ఉపయోగించవద్దు, వాటిని వంటింట్లో ఉంచుకోవద్దు. ఈ పగిలిపోయిన వస్తువుల వల్ల నెగెటివిటి వ్యాపిస్తుంది. కనుక వెంటనే అలాంటి వస్తువుల వంటింట్లో ఉంటే తీసి బయటపడెయ్యాలి. వాటి స్థానంలో కొత్తవి తెచ్చుకోవడం ఎప్పుడూ మేలు చేస్తుంది. అందుకే చాలా మంది ప్రతి దీపావళికి కొత్త వంట సామాగ్రి కొంటుంటారు. ఈ చిన్న చిన్న జాగ్రత్తలు ఇంట్లో సమృద్దిని, ఆర్థిక పరిపుష్టిని కలిగిస్తాయి. ఆర్థికంగా ఎలాంటి ఆటంకాలు రాకుండా నివారిస్తాయి.


Also Read : వాస్తు ప్రకారం ఈ అలవాట్లు మీ జీవితాన్ని మార్చేస్తాయి.. ఆర్థిక కష్టాల నుంచి రక్షిస్తాయి













Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. వివిధ శాస్త్రాలు, గ్రంథాలు, పండితులు పేర్కొన్న కొన్ని ఆధ్యాత్మిక అంశాలు, పరిష్కారాలను ఇక్కడ యథావిధిగా అందించాం. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు.. ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.