వాస్తు అంటే అతి పురాతన ఆర్కిటెక్చర్. ఈ శాస్త్రం ప్రకారం కట్టిన కట్టడాల్లో శక్తి ప్రవాహం ధారాళంగా ఉంటుంది. వాస్తు నియమాలు మన జీవిత విధానంలో, అలవాట్లలో భాగం చేసుకున్నపుడు జీవితంలో ఆర్థిక పరిస్థితులు చాలా అనుకూలిస్తాయి. అలాంటి కొన్ని నియమాల గురించి తెలసుకుందాం.


ఆగ్నేయం ఇందుకు ఉపయోగించండి


వాస్తును అనుసరించి ఆగ్నేయం సంపద, విజయానికి సంబంధించిన దిశ. ఇంట్లో డబ్బు ఖర్చుచేసే అవసరం వచ్చినపుడు ఈ ధిశలో చేస్తే ఇంట్లోకి రాబడి పెరుగుతుంది. ఆగ్నేయంలో ఇంటి ఆర్థికపరమైన ప్రణాళికలు చెయ్యడం కూడా మంచి ఫలితాలను ఇస్తుంది. ఇది ఆర్థిక విషయాల్లో బాధ్యతను, ఇంట్లోకి సంపదను తెస్తుంది.


ఆర్థిక సంతులన


వాస్తు జీవితంలోని అన్ని కోణాలను సంతులన పరచి ఆదయానికి సంబంధించిన వివిధ మార్గాలను సుగమం చేస్తుంది. వాస్తు పంచభూతాలను సంతులన పరచడం గురించి వివరిస్తుంది. అలాగే జీవితంలో రకరకాల పద్ధతుల్లో ఆదాయం సమకూరేలా ప్రణాళిక రచించుకోవాలి. పొదుపు చెయ్యడం, మదుపు చెయ్యడం ద్వారా మరింత సంపదను ఆకర్షించే అవకాశం ఏర్పడుతుంది.


కృతజ్ఞత కలిగి ఉండాలి


కృతజ్ఞతా భావం వాస్తులో ఒక పాజిటివ్ ఎనర్జీకి సూచన. మీరు సంపాదించిన ధనం విషయంలో మీకు కృతజ్ఞతా భావం ఉండాలి. ఇంటి వాయవ్య దిక్కున మీ సంపదకు కృతజ్ఞతగా సంపదను సూచించే పచ్చని చెట్టును పెంచుకోవడం మంచిది. మీ ఆర్థిక పరిపుష్టికి సర్వదా కృతజ్ఞత కలిగి ఉండాలి. ఈ భావం మీ జీవితంలోకి మరింత సంపదను ఆకర్షిస్తుంది. వాస్తు సూచించే ఇలాంటి అలవాట్లు మీ ఆర్థిక ప్రయాణాన్ని సుగమం చేస్తాయి.


నేర్చుకోవడం ఆపొద్దు


జ్ఞానసముపార్జనను కూడా వదలకూడదు. ఎప్పుడూ కొత్త విషయాలు నేర్చుకుంటూ నేర్చుకున్న విషయాలను జీవితంలో వాటిని అనుసరిస్తూ ఉండటం ఆర్థికంగా ముందుకు నడిపిస్తుంది. ఇంట్లోని ఈశాన్య దిశ జ్ఞానానికి, అర్థం చేసుకునే సామర్థ్యానికి ప్రతీక. కనుక ఈ దిక్కును నేర్చుకునేందుకు ఉపయోగిస్తే చాలా మంచి జరుగుతుంది. ఇక్కడ సముపార్జించిన జ్ఞానం తప్పకుండా జీవితంలో ఆర్థిక పురోగతికి దోహదం చేస్తుంది.


లక్ష్యాలు నిర్దేశించుకోవాలి


వాస్తు నిర్థుష్టమైన లక్ష్యాలు కలిగి ఉండాలని చెబుతుంది. ఇలా నిర్ణయించుకున్న లక్ష్యాలు విశ్వాన్ని సంతులన పరుస్తుంది. అప్పులు తీర్చడం మీ లక్ష్యమా లేక సంపద సృష్టించడమా ఇలా చాలా స్పస్టమైన లక్ష్యాలను నిర్ణయించుకోవడం వాటి సాధనకు శ్రమంచడం జీవితంలోకి పాజిటివ్ ఎనర్జిని తెస్తుంది. మీ లక్ష్యాలను పేపర్ మీద రాసుకోవడం లేదా ఒక చార్ట్ తయారు చేసి ఈశాన్యం లేదా ఆగ్నేయంలో పెట్టుకోవడం వల్ల వీటిని పూర్తి చెయ్యడం సులభం అవుతుంది.


Also Read : ఈ తేదీలో పుట్టారా? ఈ మెటల్ ధరిస్తే అదృష్టం లభిస్తుందట!












Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. వివిధ శాస్త్రాలు, గ్రంథాలు, పండితులు పేర్కొన్న కొన్ని ఆధ్యాత్మిక అంశాలు, పరిష్కారాలను ఇక్కడ యథావిధిగా అందించాం. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు.. ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.