Daily Horoscope Predictions in Telugu
మేష రాశి
ఈ రోజు ఈ రాశి ఉద్యోగులు పని ప్రదేశంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. శారీరక , మానసిక అలసటగా అనిపిస్తుంది. నిర్మాణ రంగంలో ఉండేవారికి కొన్ని ఆటంకాలు తప్పవు. అనవసర ప్రయాణాలు చేయాల్సి రావొచ్చు. ఆధ్యాత్మిక కార్యక్రమాలపట్ల ఆసక్తి తగ్గుతుంది. ఎవరికీ అప్పులు ఇవ్వొద్దు.
వృషభ రాశి
ఈ రోజు కార్యాలయంలో పని ఒత్తిడి ఉంటుంది కానీ అధిగమిస్తారు. వ్యాపారం బాగానే సాగుతుంది. తెలివైన వ్యక్తుల సహవాసం మీకు కలిసొస్తుంది. రుచికరమైన ఆహారాన్ని ఆస్వాదిస్తారు. కుటుంబంలో సంతోషం పెరుగుతుంది.
మిథున రాశి
ఈ రాశి ఉద్యోగులు పనివిషయంలో ప్రశంసలు అందుకుంటారు. నూతన వ్యాపారం ప్రారంభించేందుకు ఇదే మంచి సమయం. పరిస్థితులన్నీ మీకు అనుకూలంగా మారుతాయి. ఆరోగ్యం బావుంటుంది ..రోజంతా సంతోషంగా ఉంటారు.
కర్కాటక రాశి
ఉన్నతాధికారుల సలహాలు తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. రోజంతా బిజీగా ఉంటారు కానీ చేయాల్సిన పని విషయంలో మాత్రం నిర్లక్ష్యంగా ఉంటారు. మీలో ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. గత అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుని ముందుకు సాగండి. ఆరోగ్యం జాగ్రత్త.
సింహ రాశి
ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి. మీ ప్రవర్తన మీ సన్నిహితులను కలవరపెడుతుంది. ఆవేశం, కోపం తగ్గించుకోవాలి. ఈ రాశి ఉద్యోగులు కార్యాలయంలో కొత్త సవాళ్లు ఎదుర్కోవాల్సి రావొచ్చు. ముఖ్యమైన పత్రాలు జాగ్రత్త చేయండి. ఇతరులపై ఎక్కువగా ఆధారపడొద్దు.
కన్యా రాశి
ఈ రోజు మీరు వ్యాపార ప్రయోజనాల కోసం ప్రయాణం చేయాల్సి రావొచ్చు. ఉద్యోగులు, విద్యార్థులకు శుభసమయం. నిరుద్యోగుల నిరీక్షణ ఫలించే సమయం వచ్చేసింది. కుటుంబంలో సంతోషం, ఐశ్వర్యం వృద్ధి చెందుతాయి. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.
తులా రాశి
ఈ రోజు మీరు కొన్ని సమస్యలకు పరిష్కారం కనుగొంటారు. ఇంటర్యూలకు హాజరయ్యేవారు విజయం సాధిస్తారు. న్యాయపరమైన విషయాల్లో విజయం సాధిస్తారు. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగులు, వ్యాపారులకు మిశ్రమ ఫలితాలున్నాయి.
Also Read: శంబలలో కల్కి .. శ్రీలంకలో పద్మావతి..కథను మలుపుతిప్పిన చిలుక..పురాణాల్లో ఉన్న కల్కి అసలు స్టోరీ ఇదే!
వృశ్చిక రాశి
ఆర్థిక సంబంధిత సమస్యలకు ఈ రోజు పరిష్కారం వెతుక్కోగలుగుతారు. ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవేశం పొందాలనుకుంటే ఈ రోజు చాలా శుభప్రదమైనది. భవిష్యత్ కోసం ప్రణాళికలు వేసుకునేటప్పుడు స్నేహితులు, కుటుంబ సభ్యుల సలహాలు స్వీకరించడం మంచిది. పిల్లల కారణంగా సంతోషంగా ఉంటారు.
ధనస్సు రాశి
ఉద్యోగులు పని విషయంలో నిర్లక్ష్యంగా ఉండొద్దు. స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబంలో చిన్న చిన్న సమస్యలుంటాయి. వ్యాపారులు నూతన పెట్టుబడులు పెట్టాలన్న ఆలోచన వాయిదా వేయడం మంచిది. దీర్ఘకాల అనారోగ్యంతో బాధపడేవారు జాగ్రత్త.
మకర రాశి
ఈ రోజు మీకు మంచి రోజు, అయితే ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి. చాలా పాత జ్ఞాపకాలు అకస్మాత్తుగా కళ్లముందు మెదులుతాయి. పరిశోధన పనులపట్ల ఆసక్తి ప్రదర్శిస్తారు. పిల్లల ప్రవర్తనతో సంతోషంగా ఉంటారు.
కుంభ రాశి
మీ సన్నిహితుల కారణంగా ఇబ్బంది పడాల్సిన సందర్భం ఎదురవుతుంది. ఆరోగ్యం బావుంటుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. వ్యాపారులు లాభపడతారు. సహోద్యోగుల నుంచి సహకారం అందుతుంది.
మీన రాశి
ఈ రోజు మీరు ఓ పెద్ద నిర్ణయం తీసుకుంటారు. కుటుంబం విషయంలో చాలా బాధ్యతగా వ్యవహరిస్తారు. అతిథుల రాకతో ఆనందంగా ఉంటారు. కెరీర్ గురించి ఓ శుభవార్త వింటారు. వ్యాపారులు నూతన పెట్టుబడులు పెట్టేందుకు మంచి రోజు.
Also Read: కలి మళ్లీ ఎప్పుడొస్తాడు.. కలియుగం అంతమయ్యాక సత్యయుగ పాలన అయోధ్య కేంద్రగా ఉండబోతోందా!
గమనిక:ఓ రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే చెందుతాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.