Sitarama project Politics :  ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సీతారామ ప్రాజెక్టు మోటార్ల ట్రయల్ రన్ సక్సెస్‌ అయింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం బీజీ కొత్తూరు వ‌ద్ద‌ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అధికారులతో కలిసి మోటార్ల ట్రయల్‌ రన్‌ను పర్యవేక్షించారు. ట్రయల్‌ రన్ విజయవంతం కావడంతో మంత్రి తుమ్మల హర్షం వ్యక్తం చేశారు. 


 





 
ఈ ప్రాజెక్టుతో ఉమ్మడి ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లోని 10 లక్షల ఎకరాలకు సాగు నీరు అందనుంది. సీతారామ ప్రాజెక్టుకు 2016 ఫిబ్రవరి 16న మాజీ సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. గోదావరి నదిపై దుమ్ముగూడెం దిగువన సీతమ్మ సాగర్‌ బ్యారేజ్‌ నిర్మాణం చేసి 70 టీఎంసీల సామర్థ్యంతో కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో 10 లక్షల ఎకరాలకు సాగు నీరు అందేలా ఈ ప్రాజెక్టు రూపకల్పన చేశారు. రూ. 17 వేల కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టు పనులు చేపట్టారు. ఈ ప్రాజెక్టు పనులు కేసీఆర్‌ హయాంలోనే 70 శాతం పూర్తయ్యాయి.


సీతారామ ప్రాజెక్ట్ ద్వారా 10 లక్షల ఎకరాలకు నీరు అందనుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆనందం వ్యక్తం చేశారు. కేసీఆర్ ముందు చూపుతో ఇదంతా సాధ్యం అయిందన్నారు. 


 





 
అయితే కేటీఆర్ కు కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చింది. 2014 లోనే రూ.3000 కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టుని, మీ కమిషన్ల కోసం రీడిజైన్ పేరుతో రూ.18,500 కోట్లకు పెంచి పదేళ్లు ఆలస్యం చేశారని కాంగ్రెస్ ఆరోపించింది. జా ప్రభుత్వం వచ్చాక జనవరి 7, 2024 నాడు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రాజెక్ట్ పురోగతిపై రివ్యూ నిర్వహించి, ఆరు నెల్లలో పనులు పూర్తయ్యేలా కార్యాచరణ ప్రారంభించారని పేర్కొంది. దాని ఫలితమే ఇప్పుడు నువ్వు చూస్తున్న ఈ గోదావరి జలకళ అని పేర్కొంది.ఇప్పుడు చెప్పు.. కాంగ్రెస్ వస్తే ఏమొచ్చే! ఎగిసిపడే గోదావరమ్మ జల కళ వచ్చే! తెలంగాణ రైతన్నల జీవితాల్లో వెలుగొచ్చే!' అని కాంగ్రెస్ ట్వీట్ చేసింది.