Telangana Ponguleti House : తెలంగాణ మంత్రి పొంగులేటి నివాసంలో కస్టమ్స్  అధికారులు సోదాలు నిర్వహించారు.  బ్రాండెడ్ వాచీల స్మగ్లింగ్ కేసులో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కొడుకు హర్షారెడ్డి ఉన్నారు.   పొంగులేటి హర్షారెడ్డి నివాసంలోనూ కస్టమ్స్ అధికారుల తనిఖీలు నిర్వహించారు.  గతంలోనే పొంగులేటి హర్షా రెడ్డికి చెన్నై కస్టమ్స్ అధికారుల నోటీసులు ఇచ్చారు. ఏప్రిల్ 4న విచారణకు రావాల్సిందిగా సమన్లు ఇస్తే   డెంగ్యూ ఫీవర్‍తో బాధపడుతున్నట్టు రిప్లై ఇచ్చారు హర్షారెడ్డి.  ఏప్రిల్ 27 తర్వాత విచారణకు హాజరవుతానన్నారు కానీ హాజరు కాలేదు. దాంతో కస్టమ్స్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. 


చెన్నై ఎయిర్‌పోర్టులో పట్టుబడిన వాచీలు


ఫిబ్రవరి ఐదో తేదీన  చెన్నై విమానాశ్రయంలో రెండు లగ్జరీ వాచీలను కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.  మహమ్మద్‌ ఫహెర్దీన్‌ ముబీన్‌ అనే వ్యక్తి హాంకాంగ్‌ నుంచి సింగపూర్‌ మీదుగా భారత్‌లోకి తీసుకొచ్చారు.  వాచీల్లో ఒకటి పాటెక్‌ ఫిలిప్‌ 5740, రెండోది బ్రెగ్యుట్‌ 2759 ఉన్నాయి.  పాటెక్‌ ఫిలిప్‌ వాచ్‌కు మన దేశంలో ఎక్కడా డీలర్లు లేరు.  బ్రెగ్యుట్‌ కంపెనీల వాచీలు ఇండియా మార్కెట్‌లో స్టాక్‌ లేకపోవటంతో కస్టమ్స్‌ అధికారులకు అనుమానం వచ్చింది. వాచీల విలువ ఏకంగా రూ.1.70 కోట్లపైగా ఉండటం తో స్మగ్లింగ్ చేస్తున్నట్లుగా గుర్తించారు.  ముబీన్‌ను అరెస్టు చేసి, కోర్టు అనుమతితో విచారణ చేయగా మధ్యవర్తి నవీన్‌కుమార్‌ పేరును వెల్లడించారు. 


మంత్రివర్గంలో ఖాళీలు లేవు- రేవంత్ కీలక ప్రకటన- త్వరలోనే తెలంగాణ పీసీసీ చీఫ్‌ నియాకమం


పొంగులేటి కుమారుడి కోసం తెస్తున్నట్లుగా చెప్పిన మధ్యవర్తి                                    


మార్చి 12న మధ్యవర్తి అలోకం నవీన్‌కుమార్‌ను అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. ఆయన తాము పొంగులేటి కుమారుడి కోసం తీసుకు వస్తున్నానని హవాలా మార్గంలో వాచీలకు డబ్బులు చెల్లించినట్లుగా వెల్లడించారు. దీంతో రెండు వాచీలను పొంగులేటి కుమారుడు హర్షరెడ్డి కోసం కొనుగోలు చేసినట్టు అధికారులు గుర్తించినట్టు తెలిసింది. ముబీన్‌ను లగ్జరీ వాచ్‌ డీలర్‌గా, నవీన్‌కుమార్‌ మధ్యవర్తిగా, హర్షరెడ్డి కొనుగోలుదారుడిగా అనుమానిస్తున్నారు. ఇక, ఈ వాచీల కొనుగోలుకు యునైటెడ్‌ స్టేట్స్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ది ట్రెజరీ (యూఎస్‌డీటీ)కి చెందిన టెథర్‌ వంటి క్రిప్టో కరెన్సీ ఆధారంగా కొంత డబ్బు, మరికొంత హవాలా రూపంలో చెల్లించినట్టు తేలిందని కస్టమ్స్‌ వర్గాలు ధృవీకరించాయి. 


50 శాతం HRA మినహాయింపు లిస్ట్‌లోకి హైదరాబాద్ చేరుతుందా?


స్పందించని మంత్రి పొంగులేటి కుటుంబం


అయితే ఈ అంశంపై మంత్రి పొంగులేటి కుటుంబం కానీ ఆయన కుమారడు హర్షా రెడ్డి కానీ స్పందించలేదు. వాచీలు దిగుమతి చేసుకోవడం.. అదీ కూడా స్మగ్లింగ్ పద్దతుల్లో..  హవాలా ద్వారా డబ్బులు చెల్లించి కొనుగోలు చేయడం .. మనీలాండరింగ్ కిందకు వస్తుంది కాబట్టి.. సీరియస్ కేసు అయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.