7 immortals in Kalki 2898 AD: 'హనుమాన్' లో విభీషణుడు , 'కల్కి' లో అశ్వత్థామ.. సప్త చిరంజీవులపై ఫోకస్ చేస్తున్న మేకర్స్.. కల్కి ఎంట్రీ తర్వాత వీళ్ల పాత్రేంటి!

రామాయణం, మహాభారతం బ్యాక్ డ్రాప్ లో ఎన్నో సినిమాలు వచ్చాయి. అయితే ఎవ్వరూ పెద్దగా ఫోకస్ చేయని విషయం సప్త చిరంజీవులు.. వాళ్లెవరో చెప్పేందుకు మేకర్స్ ఇప్పుడు ప్రయత్నాలు చేస్తున్నారు...

Continues below advertisement
The 7 Immortals in Kalki movie: సత్యయుగం నుంచి ఇప్పటివరకూ భూమ్మీద ఇప్పటికీ జీవించి ఉన్న ఏడుగురిని సప్త చిరంజీవులు అంటారు.
 
అశ్వత్థామా బలిర్వ్యాసో హనుమాంశ్చ విభీషణః 
కృపః పరశురామశ్చ సప్త ఏతైః చిరంజీవినః ॥
సప్తైతాన్ సంస్మరేన్నిత్యం మార్కండేయమథాష్టమం ।
జీవేద్వర్షశ్శతమ్ సొపి సర్వవ్యాధి వివర్జిత ॥

అశ్వత్థాముడు, బలి చక్రవర్తి, హనుమంతుడు, విభీషణుడు, కృపా చార్యుడు, పరశురాముడు, వ్యాసుడు...ఈ ఏడుగురిని సప్త చిరంజీవులు అంటారు. యుగాలు గడిచినా వీళ్లిప్పటికీ భూమిపై సంచరిస్తున్నారని చెబుతారు. వీళ్లంతా కారణజన్ములు.  హనుమాన్ సినిమాలో హనుమంతుడు, విభీషణుడిని చూపించాడు దర్శకుడు ప్రశాంత వర్మ.. ఇప్పుడు కల్కి 2898 AD లో ధర్మసంస్థాపనలో అశ్వత్థామని చూపించబోతున్నాడు నాగ్ అశ్విన్.  వాళ్లంతా ఎందుకు సప్త చిరంజీవులుగా ఎందుకు ఉన్నారు....భవిష్యత్ లో వారి పాత్ర ఏంటన్నది సినిమాల ద్వారా చూపించేందుకు ప్రయత్నిస్తున్నారు మేకర్స్.  

Continues below advertisement

Also Read: భూమ్మీద మొదటి నగరం కాశీ..చివరి నగరం కూడా ఇదే - మనిషిని విశ్వంలో ఐక్యం చేసే వారణాసి సృష్టి ఎలా జరిగిందో తెలుసా!

హనుమాన్ లో విభీషణుడు

హనుమాన్ సినిమా స్టారింగ్ నుంచి క్లైమాక్స్ వరకూ విభీషణుడు కనిపిస్తాడు..కథను ముందుండి నడిపిస్తాడు. ఆఖర్లో ఇక తన చేతిలో ఏమీలేదనుకున్నప్పుడు ఆంజనేయా నువ్వు రావాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పి మరో చిరంజీవి అయిన హనుమంతుడి బాధ్యతను గుర్తుచేస్తాడు. ఈ సినిమా చూసేవరకూ చాలామందికి విభీషణుడు ఇప్పటికీ జీవించి ఉన్నాడని , సప్త చిరంజీవుల్లో ఈయనొకరు అని తెలియదు. 

కల్కిలో అశ్వత్థాముడు

ఇప్పుడు కల్కి 2898 AD లో అశ్వత్థాముడిని చూపించాడు..  ఓ శివ లింగానికి పూజలు చేస్తున్నట్టు చూపించారు కదా..అసిర్గత్  అనే ప్రాంతంలో ఉన్న శివాలయానికి రోజూ అశ్వత్థాముడు వచ్చి పూజలు చేస్తాడట. అందుకే సాయంత్రం సమయంలో ఆలయాన్ని మూసివేస్తారు..కేవలం దివ్యశక్తులు ఉన్న అశ్వత్థామ మాత్రమే కోటలోపలకు వెళ్లగలడు అంటారు. ప్రచారంలో ఉన్న ఈ కథనాన్ని ఆధారంగా చేసుకునే కల్కిలో అశ్వత్థామ స్టోరీని నాగ్ అశ్విన్ రాసుకుని ఉండొచ్చంటున్నారు.  

Also Read: శంబల నగరం ఎక్కడుంది , ఇప్పటివరకూ ఎవరెవరు వెళ్లొచ్చారు - శంబల గురించి ఆశ్చర్యపోయే విషయాలివే!

కల్కి చేయబోయే ధర్మ సంస్థాపనలో సప్త చిరంజీవుల పాత్ర ఏంటి!

సప్త చిరంజీవులంతా శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో చివరిది అయిన కల్కి కోసం ఎదురుచూస్తున్నారు. వీళ్లంతా ధర్మ సంస్థాపనలో భాగం కానున్నారు. శంబలలో కల్కి జన్మించిన తర్వాత సప్త చిరంజీవులంతా వెళ్లి నామకరణం చేయనున్నట్టు భాగవతపురాణంలో ఉంది. 

శంబల సమీపంలో వ్యాస్ నది ( బియాస్ నది) ఒడ్డున  కూర్చుని స్వయంగా వ్యాసమహర్షి...కల్కి జననం గురించి భాగవత పురాణంలో పేర్కొన్నాడు. 

శంబలలో కల్కి గా జన్మించిన తర్వాత బాల్యంలో విద్యాభ్యాసం కోసం గురుకులానికి బయలుదేరిన బాలుడికి...పరశురాముడు సకలవిద్యలు నేర్పించి తన కర్తవ్యాన్ని గుర్తుచేయనున్నాడు. 

కలిపై దండయాత్రకు బయలుదేరిన కల్కి సైన్యానికి యుద్ధ విద్యలు నేర్పించబోయేది అశ్వత్థాముడే... మహాభారత యుద్ధంతో కౌరవుల పక్షాన నిలిచి ఉప పాండవుల తలలు నరికి శాపానికి గురైన అశ్వత్థాముడు ఇప్పుడు ధర్మ సంస్థాపనలో భాగం అయి ఆ పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోనున్నాడు

 Also Read: కలి మళ్లీ ఎప్పుడొస్తాడు.. కలియుగం అంతమయ్యాక సత్యయుగ పాలన అయోధ్య కేంద్రగా ఉండబోతోందా!

ఇంకా కృపాచార్యుడు, హనుమంతుడు , బలిచక్రవర్తి కూడా ధర్మ సంస్థాపనలో తమవంతు సహాయం చేస్తారని పురాణాల్లో ఉంది.

రామాయణ, మహాభారత యుద్ధాలు మాత్రమే కాదు అందులో పేరుమాత్రమే తెలిసిన వ్యక్తుల గురించి పెద్దగా ప్రచారంలో లేని విషయాలను సినిమాల రూపంలో వివరించేందుకు ప్రయత్నిస్తున్నారు మేకర్స్. ఇప్పటివరకూ ఆంజనేయుడు బతికే ఉన్నాడని హిమాలయాల్లో చూశారని, పాదముద్రలు ఉన్నాయనే ప్రచారం జరిగింది కానీ..మిగిలిన చిరంజీవుల గురించి ఎక్కువమంది తెలుసుకున్నది సినిమాల ద్వారానే. హనుమాన్ సమయంలో విభీషణుడి గురించి జరిగిన చర్చ అయినా..ఇప్పుడు కల్కి రిలీజ్ సందర్భంగా అశ్వత్థామపై జరుగుతున్న డిస్కషన్ అయినా ఈ కోవకే చెందుతుంది...

Also Read: శంబలలో కల్కి .. శ్రీలంకలో పద్మావతి..కథను మలుపుతిప్పిన చిలుక..పురాణాల్లో ఉన్న కల్కి అసలు స్టోరీ ఇదే!

Continues below advertisement
Sponsored Links by Taboola