Vastu Tips : వేసవికాలం వచ్చిందంటే మట్టి కుండలకు గిరాకీ పెరుగుతుంది. మట్టి కుండలోని నీరు చల్లగా ఉంటుంది. మట్టి కుండ నీరు తాగే సంప్రదాయం శతాబ్దాల నుంచి వస్తోంది. అంతేకాదు కుండ నీరు తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని ఆయుర్వేదం చెబుతోంది. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో మట్టికుండ ఉండటం శుభసూచిక. ఇంట్లో నుంచి బయటకు వెళ్లేటప్పుడు నీటితో నిండిన మట్టి పాత్రను తీసుకెళ్లడం కూడా శుభసూచిక అని శాస్త్రం చెబుతోంది. అంతేకాదు నీళ్లతో నిండిన మట్టి కుండను ఇంట్లో ఉంచుకోవడం వల్ల లక్ష్మీదేవి సంతోషిస్తుందని.. పండితులు చెబుతున్నారు. అయితే దీని కోసం కొన్ని నియామాలు ఉన్నాయి. ఇంట్లో మట్టికుండను ఏ దిశలో ఉంచాలి. వాస్తు ప్రకారం ఏ దిశ సరైందో తెలుసుకుందాం.
ఇంట్లో నీళ్లతో నిండిన మట్టి కుండను పెట్టేందుకు సరైన దిశ ఇదే:
⦿ వాస్తు శాస్త్రం ప్రకారం మట్టి కుండను ఇంట్లో లేదా ఆఫీసులో పెట్టాలనుకుంటే ఉత్తర దిశ సరైనదని వాస్తు పండితులు చెబుతున్నారు.
⦿ వాస్తు ప్రకారం అగ్ని, గాలి, నీరు , భూమి, ఆకాశం అనే పంచభూతాలకు ఉత్తర దిశ నీటి మూలకానికి సంబంధించింది.
⦿ ఉత్తర దిశలో నీటికి సంబంధించిన వస్తువులు ఉంచితే శుభ ఫలితాలు వస్తాయని శాస్త్రం చెబుతోంది.
⦿ ఈ దిశలో మట్టికుండను ఉంచితే వరుణ దేవుడి ఆశీస్సులు కూడా మీపై ఉంటాయని పండితులు చెబుతున్నారు.
⦿ అంతేకాదు ఈ దిశలో నీళ్ల కుండను ఉంచినట్లయితే ఆ ఇంట్లో భయం ఉండదట.
⦿ ఉత్తర దిశలో నీటికి సంబంధించిన వస్తువులు ఉంచితే మనం ఆరోగ్యంగా ఉంటామని శాస్త్రం అంటోంది.
⦿ అంతేకాదు ఈ దిశలో నీటి కుండను ఉంచితే వినికిడి సామర్ధ్యం పెరుగుతుందట.
⦿ ఇక కుటుంబంలో ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి..కుటుంబ సభ్యులంతా ఆరోగ్యంగా ఉంటారని వాస్తు చెబుతోంది.
ఇంట్లో మట్టి కుండ ఉండే లక్ష్మీదేవి ఉన్నట్లే:
⦿ చేపట్టిన ప్రతి పనిలో విజయం సాధించాలంటే ఇంట్లో మట్టికుండను ఉంచాలి. నీళ్లతో నిండిన మట్టికుండ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని శాస్త్రాల్లో పేర్కొన్నారు.
⦿ నీరు, మట్టి ఈ రెండు కూడా సంపదతో ముడిపడి ఉంటాయి. అందుకే ఇంట్లో తాగే నీటికుండను ఖాళీగా ఉంచకూడదని పెద్దలు చెబుతుంటారు. ముఖ్యంగా రాత్రిపూట నీటి పాత్రలను ఖాళీగా ఉంచడం అశుభం.
⦿ ఇంట్లోకి కొత్తగా తీసుకువచ్చిన మట్టికుండను బాగా కడగాలి. కొంత సమయం నీటిని అందులో నింపి ఉంచాలి. మరుసటి ఆ నీటిని తీసి శుభ్రమైన నీరు పోయాలి.
⦿ కొత్త మట్టికుండలో నీరు తాగే ముందు చిన్నపిల్లలకు కానీ, ముఖ్యంగా ఆడపిల్లలకు తాగిస్తే లక్ష్మీదేవి సంతోషిస్తుందని శాస్త్రం చెబుతోంది.
⦿ మట్టితో చేసిన వస్తువులు జ్యోతిష్య పరిహారాలకు ఉపయోగిస్తారు. గ్రహాలను నియంత్రించడానికి, మట్టి వస్తువులను వాడుతారు. ఇంట్లో మట్టి కుండను ఉంచితే శాస్త్రం ప్రకారం బుధుడు, చంద్రుని స్థానాన్ని బలపరుస్తుంది.
⦿ ముఖ్యంగా వంటగదిలో మట్టి కుండను ఉంచినట్లయితే దానిని స్టవ్ కు దూరంగా పెట్టండి. ఎందుకంటే అగ్ని, నీరు పక్కపక్కనే ఉండకూడదు.
Also Read: రానున్న ఎన్నికల్లో ఈ రాశుల రాజకీయ నాయకులు ధనం నష్టపోయినా గెలుపు పక్కా!
గమనిక: కొందరు వాస్తు నిపుణుల సూచనలు ఆధారంగా రాసిన కథనం... దీనిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం...