జ్యోతిషంలో రోజు వారీ జీవితంలో జరిగే అన్ని విషయాలను గురించి చర్చించారు. వాటిలో శుభప్రదమైనవి, అశుభకరమైనవీ కూడా ఉంటాయి. మంచీ చెడులను నిర్ణయించే అన్నీ మన కంటికి కనిపించేవే ఉండవు. కొన్ని కంటికి కనిపించని విషయాలు కూడా ఉంటాయి. నమ్మకం కుదరకపోయినా ఇది నిజమని శాస్త్రం చెబుతోంది. కొన్ని సంఘటనలు మన జీవితంలో రాబోయే శుభాశుభాలకు ప్రతీకలుగా ఉంటాయని విశ్లేషిస్తుంది జ్యోతిషం. ప్రతి రోజూ ఎన్నో సంఘటనలు జరుగుతాయి. ఏది ఎందుకు జరుగుతుందో మనం తెలుసుకోవడం కష్టం. కొన్ని సంఘటనల తర్వాత అంతా మంచే జరుగుతుంది. కొన్ని సార్లు చెడు జరుగుతుంది.


ఇలాంటి వాటిని శకునాలు అంటారు. శుభ శకునాలు, అశుభశకునాలు అని రెండు రకాలుగానూ ఉంటాయి. మంచి శకునం తలపెట్టిన కార్యాలలో ఆటంకాలు లేకుండా పూర్తవుతుందని అనడానికి ప్రతీకలైతే, అపశకునాలు మాత్రం రాబోయే చెడుకు సంకేతాలుగా నమ్ముతారు. ఇంట్లోంచి బయటకు వెళ్లేందుకు సిద్ధపడుతున్నపుడు ఏడుపులు వినిపించడం, వెనుక నుంచి ఎవరైనా పిలిచి ముందుకు వెళ్లకుండా ఆపడం వంటివి అపశకునాలుగా భావిస్తారు. ఇలాంటపుడు బయటకు వెళితే వెళ్లిన చోట పనులు పూర్తికావని ఒక నమ్మకం.  ఇలాంటి శకునాలకు సంబంధించిన సమాచారం మనకు శకున శాస్త్రంలో లభిస్తుంది. కొన్ని వస్తువులు చేజారితే అశుభం. ఇది భవిష్యత్తులో రాబోయే విపత్తులకు సూచన కావచ్చు. ఎదురయ్యే నష్టాలకు, కష్టాలకు హెచ్చరిక కూడా కావచ్చు. జ్యోతిషం, శకున శాస్త్రం శకునాల గురించి చెప్పే కొన్ని విషయాలను తెలుసుకుందాం.


పాలు ఒలికి పోవడం


పాల గిన్నే లేదా పాలు ఉన్న పాత్ర చేజారి కింద పడపోవడం అపశకునంగా పరిగణించాలి. అది అశుభం, జాతక చక్రంలో చంద్రుడి కదలికలు లేదా చంద్ర దశ సరిగా లేకపోతే ఇలాంటి అపశకునం జరుగుతుంది. అదీకాక పాలు ఒలికి పోవడం ఆర్థిక నష్టానికి సూచన. అందుకే పాలు నేల మీద ఒలికి పోకుండా జాగ్రత్త పడాలి.


ఉప్పు కింద పడిపోవడం


 ఉప్పు చేతి నుంచి జారి పడిపోవడం చాలా అశుభంగా శకున శాస్త్రం చెబుతోంది. ఇది జాతకంలో చంద్రుడు, శుక్రుడు ఏవింధంగా ఉందో తెలిపే సూచన. అంతేకాదు వైవాహిక జీవితంలో రాబోయే సమస్యలకు ప్రతీకగా కూడా భావించాలి.


ఆవ నూనె ఒలికిపోవడం


జ్యోతిషం ప్రకారం ఆవనూనె ఒలికి పోవడం అంత మంచిది కాదు. ఇలా జరిగిందంటే శని దృష్టి మీమీద సరిగ్గా లేదని అర్థం. జీవితంలో రాబోయే సమస్యలకు ఈ సంఘటన ఒక ప్రతీక. ఇలా జరిగినపుడు పరిహారంగా శని పూజ చేసుకోవాలి. ఇది ధననష్టానికి సూచనగా భావించాలి.


హారతి పళ్లెం


హారతి పళ్లెం చేతి నుంచి పడిపోవడం అశుభ సంకేతం. ఇది మీ పూజలో జరిగే లోపాన్ని సూచించేదిగా భావించాలి. దేవుడు ఎందుకో మీ మీద కోపంగా ఉన్నాడని గ్రహించాలి. ఇలాంటి వ్యక్తుల పూజ ఫలితాన్ని ఇవ్వదు. మీరు త్వరలో ఏదో దుర్వార్త వినబోతున్నారన్ని అనడానికి సంకేతంగా భావించాలి.


కుంకుమ చేజారడం


పదేపదే కుంకుమ చేజారి కిందపడిపోతుంటే అది అపశకునంగా భావించాలి. అది దాంపత్యంలో గొడవలకు, విడిపోవడానికి సూచన కావచ్చు.


గమనిక: వివిధ శాస్త్రాలు, గ్రంథాలు, పండితులు పేర్కొన్న కొన్ని ఆధ్యాత్మిక అంశాలు, పరిష్కారాలను ఇక్కడ యథావిధిగా అందించాం. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ బాధ్యత వహించదని గమనించగలరు. 



Also Read అనుపమలో ఇంత టాలెంట్ ఉందా? షార్ట్ ఫిల్మ్‌కు సినిమాటోగ్రఫీ