The Krishna Kubja Temple in Mathura: కృష్ణ కుబ్జా దేవాలయం మథురలో ఒక అద్భుతమైన దేవాలయం, దీని రహస్యం గురించి తెలుసుకుంటే మీరు కూడా ఆశ్చర్యపోతారు. మథురలో ఉన్న 'కృష్ణ కుబ్జా దేవాలయం' 500 సంవత్సరాల పురాతనమైనది. ఇక్కడికి వెళ్లడం వల్ల చర్మ సంబంధిత సమస్యలు ఏవైనా నయమవుతాయి. కృష్ణ కుబ్జాతో కొలువైన ఏకైక దేవాలయం ఇది. సాధారణంగా కృష్ణుడి ఆలయాల్లో రాధ కొలువై ఉంటుంది కానీ..ఇక్కడ కుబ్జ కనిపిస్తుంది. నిత్యం భారీగా భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు.
పురాణాల ప్రకారం, కుబ్జా మథుర రాజు కంసుడి రాజ్యంలోసేవకురాలు. ఆమె వృద్ధురాలిలా, అందవిహీనంగా ఉండటమే కాదు శారీరకంగా కూడా వికారంగా ఉండేది. అందుకే మథురలో ప్రతి ఒక్కరూ కుబ్జా రూపాన్ని ఎగతాళి చేసేవారు. ఓసారి శ్రీ కృష్ణుడు మథురకు వచ్చినప్పుడు, కుబ్జా కంసుడి కోసం చందనం పూస్తూ ఉంది. మథురవాసులకు భిన్నంగా శ్రీకృష్ణుడు ఆమెను సుందరి-సుందరి అని పిలుస్తూ ఆటపట్టించాడు. శ్రీకృష్ణుడు తనను ఎగతాళి చేస్తున్నాడని కుబ్జా భావించి కన్నీళ్లుపెట్టుకుంటుంది. ఆ క్షణం శ్రీ కృష్ణుడు తన కాలుని కుబ్జాకాలిపై ఉంచి ఆమెను గడ్డం పట్టుకుని పైకి లేపాడు. ఆ తర్వాత కుబ్జా అందమైన స్త్రీగా మారిపోయింది. శ్రీ కృష్ణుడి లీల చూసి మధురవాసులంతా ఆశ్చర్యపోయారు. అప్పటి నుంచి మధురలో కుబ్జాతో కలసి కొలువయ్యాడు శ్రీ కృష్ణుడు.. చర్మ సంబంధిత వ్యాధులు నయమయ్యే ఆలయం
శ్రీ కృష్ణుడి లీలతో కుబ్జ అందవిహీనం అయిన శరీరం అందంగా మారడంతో..ఈ ఆలయాన్ని సందర్శించినవారికి చర్మ సంబంధిత సమస్యలుంటే నయం అవుతాయని విశ్వసిస్తారు. ఆలయానికి సమీపంలో ఆశ్రమాల్లో కొన్ని రోజుల పాటు ఉండి స్వామిని దర్శించుకుంటారు. చాలామందికి చర్మసంబంధిత సమస్యలు నయం అయ్యాయని ఎందరో భక్తులు చెప్పినట్టు నివేదికలున్నాయి. ఈ ఆలయం గురించి అందరూ అడిగే ప్రశ్నలివే
కృష్ణ కుబ్జా ఆలయం దేనికి ప్రసిద్ధి చెందింది?ఇది కుబ్జాతో కృష్ణుడి ప్రత్యేకమైన విగ్రహానికి ప్రసిద్ది చెందింది. ప్రార్థన , విశ్వాసం ద్వారా చర్మ వ్యాధులను నయం చేస్తుందని నమ్ముతారు.
కృష్ణ కుబ్జా ఆలయం ఎక్కడ ఉంది? హౌస్ నెం -1698, హోలీ గేట్-ట్యాంక్ చోరాహా రోడ్, కృష్ణ పూరి కాలనీ, అంటాపారా, మధుర, ఉత్తర ప్రదేశ్
ఆలయ సందర్శన సమయాలు?ఉదయం 6 గంటలకు, సాయంత్రం 4 గంటలకు..అనువుగా ఉంటుంది
కృష్ణ కుబ్జా ఆలయం ఎన్నేళ్ల నుంచి ఉంది?ఆలయం సుమారు 500 సంవత్సరాల వయస్సులో ఉందని నమ్ముతారు
సమీపంలో హోటళ్ళు లేదా వసతులు ఏమైనా ఉన్నాయా?హోలీ గేట్ సమీపంలో 1 కిలోమీటర్ వ్యవధిలో గెస్ట్‌హౌస్‌లు, ధర్మశాలలు ఉన్నాయి.
ఆలయ పునరుద్ధరణకు విరాళం ఇవ్వవచ్చా?మధుర ఆధారిత విరాళం కేంద్రాలు లేదా స్థానిక ఆలయ సంక్షేమ నిధుల ద్వారా ఇవ్వొచ్చు
ఆలయంలో కృష్ణుడికి ఏ సమర్పిస్తారు?గంధపు పేస్ట్, తులసి ఆకులు, స్వీట్లు
సమీపంలో ఉన్న ఇతర ఆలయాలు ఏంటి?ద్వార్కాధిష్ ఆలయం, యమునా ఘాట్ , కేశవ్ దేవ్ టెంపుల్.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం నమ్మకాలు ఆధారంగా అందించినది. ఆధ్యాత్మిక పుస్తకాల్లో అందుబాటులో ఉన్న సమాచారం, ఆధ్యాత్మిక వేత్తలు అందించిన సమాచారం ఆధారంగా రాసినది. దీనిని ఎంతవరకూ విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం