వాస్తు శాస్త్రంలో దిశలతో పాటు రంగులకు కూడా చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఇంటి నిర్మాణం వాస్తు ప్రకారం చేసుకున్నపుడు చాలా రకాల అనవసరపు కష్టాల బారిన పడకుండా నివారించవచ్చు. అదీ కాక వాస్తు సరిగ్గా లేని ఇంట్లో నివసించే వారి మీద చాలా రకాల దుష్ప్రభావాలు ఉండే ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది. అనారోగ్యాలు, మానసిక, ఆర్థిక సమస్యలతో పాటు కుటుంబం సభ్యుల మధ్య స్పర్థలు కూడా ఏర్పవచ్చు. పచ్చని పసుపు రంగు చాలా శుభప్రదమైందిగా భావిస్తారు. ఇది ఇంట్లోకి సానుకూల శక్తిని ఆకర్శిస్తుందని అంటారు. దీని వల్ల ఇంట్లో శాంతి, సంతోషాలు నిలిచి ఉంటాయి.
వాస్తు ప్రకారం పని చేసుకునే చోట పసుపు రంగు వేసుకోవడం వల్ల జీవితంలో మంచి పురోగతి ఉంటుందని భావిస్తారు. ఈ రంగు అభివృద్దికి మార్గం సుగమం చేస్తుంది. పసుపు రంగు సానుకూల శక్తి కేంద్రంగా చెప్పవచ్చు.
పచ్చని పువ్వులతో ఇంట్లో అలంకారం చేసుకోవడం చాలా శుభప్రదంగా భావిస్తారు. ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ ప్రసారం జరుగుతుందని శాస్త్రం చెబుతోంది. ఇంట్లో శాంతి, సంతోషాలు వెల్లివిరుస్తాయి. అయితే ఇంటిలోని అన్ని ప్రదేశాల్లో పసుపు రంగు వెయ్యకూడదు. ఇంట్లోని ఏ భాగంలో పసుపు రంగు వెయ్యడం ద్వారా మంచి ఫలితాలు సాధించవచ్చో తెలుసుకుందాం.
- వాస్తు ప్రకారం పడకగదిలో గోడలకు పసుపు రంగు వెస్తే దంపతుల మధ్య అనుబంధం మరింత మధురంగా మారుతుంది. ఇది వైవాహిక జీవితంలో సంతోషాన్ని కలిగిస్తుంది.
- ఆగ్నేయ దిక్కున పసుపు రంగు వెయ్యడం వల్ల ఈ రంగు సంబంధించిన దిక్కుల తత్వాలకు హాని జరగవచ్చు.
- ఆగ్నేయ దిశల్లో పసుపు రంగు వేయడం వల్ల తల్లికి హాని కలుగుతుందని శాస్త్రం చెబుతుంది.
- ఈశాన్యానికి కూడా ఈ రంగు పనికి రాదు.
- అంతే కాదు పసుపు రంగును ఎప్పుడూ ఉపయోగించకూడదు. పసుపుతో పాటు ఎరుపు రంగు వాడకపోవడమే మంచిది.
ప్రతి దిశకు నిర్దిష్ట రంగు వేసుకోవాలని వాస్తు వివరిస్తోంది. అయితే అలాంటి నియమాలు అందరికీ సరిపడకపోవచ్చు. వాస్తు ప్రకారం రంగులకు సాధారణ మార్గదర్శకాలకు కట్టుబడడం మంచిది.
- ఈశాన్యం – లేత నీలం
- తూర్పు – తెలుపు లేదా నీలం
- ఆగ్నేయం – ఈదిక్కు శక్తి కేంద్రం కనుక ఆరెంజ్, గులాబి లేదా వెండి రంగులు మంచిది
- ఉత్తరం – ఆకుపచ్చ, పిస్తారంగు
- వాయవ్యం – ఇది గాలికి సంబంధించింది. కనుక తెలుపు, బూడిద, క్రీమ్ కలర్స్ మంచిది
- పడమర – ఇది నీటికి సంబంధించింది. నీలం, తెలుపు మంచిది.
- నైరుతి – పీచ్, మట్టి రంగు, లేదా బిస్కట్ రంగు లేదా లేత గోధుమ రంగు
- దక్షిణం – ఎరుపు లేదా పసుపు రంగులు వేసుకోవడం మంచిది.
ఎప్పుడైనా ఇంటికి లేత రంగులు వేసుకోవడం మంచిది. ఎరుపు, గోధుమ, బూడిద, నలుపు వంటి రంగులు అందరికీ సరిపడకపోవచ్చు. ఈ ముదురు రంగులు మండుతున్న రాహు, శని, మార్స్, సూర్యుడికి ప్రతీకలు కనుక వీటి వల్ల అంత మంచి ఫలితాలు రాకపోవచ్చు. ముదురు ఎరుపు, పసుపు రంగులు ఇంట్లోని శక్తి ప్రవాహానికి భంగం కలిగించవచ్చు. కనుక వీటిలో లేత షేడ్స్ ఎంచుకోవడం మంచిదని వాస్తు పండితులు సూచిస్తున్నారు.
Also Read: ఈ చిన్న చిన్న పొరపాట్లే దురదృష్టానికి, దారిద్య్రానికి కారణం..!
గమనిక: వివిధ శాస్త్రాలు, గ్రంథాలు, పండితులు పేర్కొన్న కొన్ని ఆధ్యాత్మిక అంశాలు, పరిష్కారాలను ఇక్కడ యథావిధిగా అందించాం. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ బాధ్యత వహించదని గమనించగలరు.