వాస్తు దిక్కులను గురించి చర్చిస్తుంది. నిర్మాణాలకు కావల్సిన అన్ని నియమాలను గురించి వివరిస్తుంది. నిర్మాణాల్లో ఏ దిక్కుల్లో ఏ వస్తువులు ఎలా ఉండాలి వంటి అన్ని విషయాలను గురించి వాస్తులో వివరణలు లభిస్తాయి. కొన్ని వస్తువుల దిశ మారితే అవి చాలా పాజిటివ్ ఎనర్జిని ఇస్తాయి. అవే వస్తువులు తప్పు దిశలో ఉంటే నెగెటివ్ గా మారవచ్చు. ఇలా వస్తువుల ప్రభావం ఇంట్లో నివసించే వారి శారీరక మానసిక పరిస్థితుల మీద చాలా ఎక్కువగా ఉంటాయి. కొన్ని సార్లు మానసిక ఉద్రిక్తత పెరిగిపోతుంది కూడా. ఎంత ఆస్తిపాస్తులున్నా మానసిక ప్రశాంతంగా లేకపోతే అది వృథా. ఏపని చెయ్యాలని అనిపించదు. ప్రతీ ఒక్కరూ ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటారు. కానీ అందరికీ అది సాధ్యపడదు. కొంత మంది ఇళ్లలో తెలియని అశాంతి తాండవిస్తుంటుంది. ఇందుకు కారణం కొన్ని సార్లు వాస్తు కావచ్చు. ఎలాంటి వాస్తు దోషాలు ఇందుకు కారణం కావచ్చో తెలుసుకుందాం.



  • ఇంట్లో భయం గొలిపే చిత్రాలు పెట్టుకోవద్దు. ఉగ్ర రూపంలో ఉండే దేవుడి బొమ్మ లేదా విగ్రహం కూడా పెట్టుకోవడం మంచిదికాదు. హింసను సూచించే ఎలాంటి చిత్రాన్ని లేదా ఫోటోను ఇంట్లో పెట్టుకోకూడదు. వీటి వల్ల ఇంట్లో నెగెటివ్ శక్తి పెరుగుతుంది. ఫలితంగా మానసిక అశాంతి పెరిగిపోతుంది.

  • ఇంట్లో పెద్ద వారు ఎప్పుడూ నైరుతిలో పడుకోవాలి. పాదాలు పడమర దిశలో, ఉత్తరం వైపు తల ఉండకూడదని గుర్తుపెట్టుకోవాలి. తల ఆగ్నేయంలో ఉంటే మంచిది. నిద్రించేందుకు సరైన దిశను ఎంచుకోవాలి. లేదంటే మానసిక సమస్యలు రావచ్చు.

  • ఇంట్లో విరిగిపోయిన వస్తువులు పెట్టుకోవద్దు. ఇంట్లో ప్రతికూలతకు ఇవి కారణం కావచ్చు. కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్థలకు కూడా ఇది ఒక కారణం కావచ్చు. అందుకే వీలైనంత త్వరగా విరిగిన వస్తువులను ఇంట్లోనుంచి దూరంగా పారెయ్యాలి.

  • ఇంట్లో అద్దం దక్షిణం లేదా పడమర గోడకు అమర్చకూడదు. ఈ దిక్కున ఉన్న అద్దం ప్రతికూల ప్రభావాలకు కారణం అవుతుంది. ఇంట్లో పగిలిన అద్దం ఉంటే వెంటనే తీసెయ్యాలి. ఇది మానసిక అశాంతికి కారణం కావచ్చు. కనుక పగిలిన ప్రేములు, అద్దాలు తీసి పారెయ్యాలి.

  • ఆగిపోయిన గడియారం కూడా ఇంట్లో పెట్టుకోకూడదు. ఇది కూడా అభివృద్ధి నిరోధకంగా మారుతుంది. ఫలితంగా మానసిక అశాంతికి కారణం అవుతుంది.

  • ఎప్పుడూ పిల్లర్ కింద కూర్చుని పనిచెయ్యకూడదు. ఇది తలనొప్పి లేదా మానసిక అశాంతి కి కారణం అవుతుంది.

  • ఇంట్లో వాష్ రూమ్ లు మూసి పెట్టి ఉంచాలి. తెరచి ఉంటే ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ చేరి అది మానసిక అనారోగ్యానికి కారణం అవుతుంది.

  • పూజా స్థలం వాస్తుకు అనుకూలంగా ఉండాలి. పూజ స్థలం ఇంట్లో ఈశాన్యంలో ఉండాలి. ఈశాన్యం లో లేదా తూర్పు దిశలో నీటిని నిల్వ చెయాలి. లేదా నీటి తొట్టి లేదా కలశం వంటిది ఏర్పాటు చేసుకోవాలి. లేదంటే ఇది ఇంట్లోని మహిళల మానసిక స్థితి మీద చాలా ప్రభావం పడుతుంది.

  • ఇంట్లో వాడని మందులు లేదా ఎక్స్పైరీ డేట్ అయిపోయిన మందులు ఉంటే వెంటనే బయట పడెయ్యాలి. ఇది చాలా పెద్ద నెగెటివ్ ఎనర్జీగా మారుతుంది.



Also Read 'బాహుబలి' క్లైమాక్స్ గుర్తు చేసిన 'ఆదిపురుష్' ట్రైలర్ - ఆ ఒక్క డైలాగ్ లేకపోతే?