Tips for wallet :వాస్తులో జీవితానికి సంబందించిన అన్ని నిమాలు రూపొందించారు. పర్సు గురించి కూడా వాస్తులో కొన్ని విషయాలను గురించి చర్చించారు.  పర్సు ఎంత బరువుగా ఉందంటే వాళ్ల దగ్గర డబ్బు చాలా ఉందని అర్థం. పర్సులో కేవలం డబ్బు మాత్రమే కాదు, రకరకాల వస్తువులు దాచుకుంటూ ఉంటారు. తెలిసీ తెలియక ఏది పడితే అది పర్సులో పెట్టుకోవడం వల్ల ఆర్థికంగా నష్టాల పాలు కావల్సి వస్తుందని పండితులు చెబుతున్నారు. ముందుగా పర్సులో ఏవస్తువులు పెట్టుకోవచ్చు ఏవి పెట్టుకోకూడదు తెలుసుకుందాం.


Also Read: ఇంట్లో బుద్ధ విగ్రహం పెడుతున్నారా , ఈ జాగ్రత్తలు తప్పకుండా పాటించాలి



  • చాలా మంది ఏదైనా కొన్ని తర్వాత బిల్లును పర్సులో పెట్టుకునే అలవాటు చాలామందికి ఉంటుంది. అలా పెట్టుకుని మరచిపోతుంటారు కూడా. ఫలితంగా పర్సులో జంక్ జమ అవుతుంది. అందుకే ఎప్పుడూ బిల్లులు పర్సులో పెట్టుకోకూడదు. అలా వేస్ట్ పేపర్ పెట్టుకోవడం వల్ల లక్ష్మీ దేవికి కోపం వస్తుంది. పర్సులో డబ్బు నిలవదు అనవసరమైన బిల్లులు, కాగితాలు పర్సులో పెట్టకోకూడదు. ఇది ఆర్థిక నష్టానికి కారణం కావచ్చు.

  • పర్సులో పొరపాటున కూడా జీవించి ఉన్న లేదా చనిపోయిన వ్యక్తి చిత్రాన్ని పెట్టుకోవద్దు. పర్సులో ఎవరి బొమ్మను పెట్టుకోవద్దు. అంతేకాదు పర్సులో ఏ దేవత చిత్రపటాన్ని కూడా పెట్టుకోవద్దు. ఇలా చిత్రాలు పర్సులో పెట్టుకుంటే దోషాలు కలిగి అప్పులు పెరిగిపోతాయి. పర్సులో లక్ష్మీ దేవి స్థిర నివాసం ఉంటుందని నమ్మి పర్సు జేబులో పెట్టుకోవాలి.

  • పర్సులో డబ్బును అడ్డదిడ్డంగా మడిచి పెట్టుకోకూడదు. పర్సు తెరచి డబ్బులు అన్ని వరుస క్రమంలో పెట్టుకోవడం మంచిది. ఇలా మడిచి పెట్టుకోవడం వల్ల దోషం ఏర్పడుతుంది. ఆర్థిక సంక్షోభాల బారిన పడతారు. అంతేకాదు నాణేలు, నోట్లు కూడా కలిపి పెట్టవద్దు. కాయిన్స్, నోట్లు విడివిడిగా పెట్టుకోవాలి.

  • పర్సులో ఎలాంటి కీస్ పెట్టుకోకూడదు. తాళం చెవులు పర్సలో పెట్టుకుంటే అది ఆర్థిక నష్టానికి కారణం అవుతుంది. పొరపాటున కూడా కీ పర్సులో పెట్టుకోవద్దు . ఇది నెగెటివ్ ఎనర్జీని కూడా ఆకర్శిస్తుంది.

  • చిరిగిన నోట్లను ఎప్పుడూ పర్సులో పెట్టుకోవద్దు. పర్సులో అలాంటి నోటు ఉంటే వెంటనే మార్చుకోవాలి లేదా తీసి పక్కన పెట్టడం మంచిది. జీర్ణమైన పర్సు కూడా వాడకూడదు. పాతదైపోయి చిరిగి పోయిన పర్సును వాడకూడదు. ఇలాంటి పర్సులో లక్ష్మి నిలవదు. కనుక పర్సు చిరిగి పోయిపుడు కొత్త పర్సుకు మారడం మంచిది. కలిసి వచ్చిందనే పేరుతో పాత పర్సులను అలాగే వాడుతారు. అది ఎంత మాత్రం మంచిది కాదు.

  • వాస్తు ప్రకారం, అప్పుగా తీసుకున్న డబ్బు ఎప్పుడూ కూడా పర్సులో పెట్టుకోకూడదు. ఇలా అప్పు చేసి డబ్బులు పర్సులో పెట్టుకోవడం వల్ల అప్పులు పెరిగి ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంటారు. కనుక అప్పుగా తీసుకున్న డబ్బు పర్సులో పెట్టుకోవద్దు


Also Read: మీ నక్షత్రం ప్రకారం మీ ఇల్లు ఏ ఫేసింగ్ ఉండాలి, అలా లేకపోతే ఏమవుతుంది!


Note: వాస్తునిపుణులు చెప్పినవి , పుస్తకాల ఆధారంగా తెలుసుకుని రాసిన విషయాలివి. వీటిని ఎంతవరకూ విశ్వసించవచ్చు అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.  ఇందులో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ బాధ్యత వహించదని గమనించగలరు.