Garuda Puranam :  గరుడ పురాణం హిందూమతంలోని 18 మహాపురాణాలలో ఒకటిగా పరిగణిస్తారు. ఇది హిందూ మతానికి చెందిన‌ మహా పురాణం కాబట్టి ఇది చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు. గరుడ పురాణం నుంచి మనం జనన మరణ రహస్యాలను తెలుసుకోవచ్చు. ఇది జననం, మరణం, పునర్జన్మ, ఆత్మ, స్వర్గం, నరకం, కర్మ ప్రకారం శిక్ష మొదలైన వాటి గురించి సమాచారాన్ని తెలియ‌జేస్తుంది. మన దైనందిన జీవితానికి సంబంధించిన అనేక ఆలోచనలు గరుడ పురాణంలో పేర్కొన్నారు. ఈ ఆలోచనలు మన మొత్తం జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. ఒక వ్యక్తి అలాంటి తప్పులు చేసినప్పుడు, అతను పేదరికం, దురదృష్టాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది. మీరు కూడా ఈ తప్పులు చేస్తుంటే ఖచ్చితంగా పేదరికంలో మునిగిపోతారు. కాబట్టి వీలైనంత వరకు ఈ ఆలోచనలకు దూరంగా ఉండాలని గరుడ పురాణం చెబుతోంది.


దోపిడీ ద్వారా సంపాదించిన డబ్బు
గరుడ పురాణం ప్రకారం, ఇతరుల భూమి లేదా సంపదను బలవంతంగా లాక్కోవడం మహాపాపం. ఇలాంటి తప్పులు చేసేవారు జీవితంలో ఆనందాన్ని అనుభవించలేరు. లక్ష్మీదేవి వారిపై కోపగించుకుంటుంది. ఇది కాకుండా పేదలను లేదా నిస్సహాయులను దోపిడీ చేసి డబ్బు సంపాదించే వారి ఆస్తి చాలా త్వరగా నాశనం అవుతుంది. అలాంటివారు ఎంత ధనవంతులైనా వారిని క్రమంగా పేదరికం ఆవహిస్తుంది.


Also Read: కుజుడు-శుక్రుడు సంయోగం, ఈ రాశులవారికి అన్నీ శుభఫలితాలే!


ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి
శుభ్రత లేని వారి ఇళ్లలో లక్ష్మీదేవి నివసించదని గరుడ పురాణంలో చెప్పారు. అందుకే ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది.


వంటగది పరిశుభ్రత
ఉదయాన్నే భగవంతుడిని పూజించే ముందు స్నానం చేసి శుద్ధి చేసుకోవాలి. రాత్రి పూట భోజనం చేసి పడుకునే ముందు పాత్రలు, వంటగదిని శుభ్రంగా ఉంచుకోవాలి. తిన్న పాత్రలను తోమ‌కుండా ఉంచడం వల్ల ఇంట్లోని వ్య‌క్త‌ల‌ను దురదృష్టం వెంటాడుతుంది. లక్ష్మీదేవి కోపానికి కూడా ఇదే కారణమని గరుడ పురాణం చెబుతోంది.


Also Read: మే 6 రాశిఫలాలు, ఈ రాశివారు గందరగోళంగా ఉండే వ్యక్తులకు దూరంగా ఉండాలి!


మితిమీరిన కోపం
గరుడ పురాణం ప్రకారం, మితిమీరిన కోపం ఉన్న వ్యక్తి జీవితం ఎప్పుడూ సంతోషంగా ఉండదు. ప్రతి విషయంలోనూ అరిచే ఇలాంటివారు భార్యాపిల్లలపై ఎప్పుడూ కోపంగానే ఉంటారు. ఆ వ్యక్తి ప్రవర్తనే అతని ఇంటి పేదరికానికి ప్రధాన కారణం.


గోర్లు కొరికే అలవాటు
చాలా మందికి ఎప్పుడూ పళ్లు కొరక‌డం, గోళ్లు కొరికే చెడు అలవాటు ఉంటుంది. మీకు అలాంటి అలవాట్లు ఉంటే వెంటనే మానేయండి. ఇలాంటి అలవాటు వల్ల జీవితంలో అనేక సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది మీ పేదరికానికి కూడా దారితీయవచ్చు.


కాళ్లు ఈడుస్తూ న‌డ‌వ‌డం
కాళ్లు ఈడ్చ‌డం కూడా మంచిది కాదు. కాళ్లు ఈడుస్తూ న‌డిచే వ్యక్తులు జీవితంలో ఎప్పటికీ పురోగతి సాధించలేరు. చాలా మందిలో ఈ చెడు అలవాటు మనం చూస్తుంటాం. మీకు అలాంటి అలవాటు ఉంటే ఖచ్చితంగా ఈ రోజే మానేయడానికి ప్రయత్నించండి. అలాంటి వ్యక్తి వైవాహిక జీవితం సంతోషంగా ఉండదు, తన భాగస్వామితో ఎప్పుడూ శత్రుత్వం కలిగి ఉంటారు.


Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.