ల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అని నానుడి. అంటే ఈ రెండింటిలో ఎంత చేసినా ఏదో ఒకటి మిగిలిపోతూ ఉంటుందని. ఎక్కడో ఒక చోట లోపం మిగిలి పోతూ ఉంటుంది. పెళ్లి విషయంలో జరిగిన లోపాలను జనం త్వరలోనే మరచిపోతారు కానీ ఇంటి విషయం అలా కాదు. అది కలకాలం నిలిచి ఉండే కట్టడం.  ఇల్లు కడుతున్నపుడు ఇలా ఏదైనా వాస్తు లోపం మిగిలిపోతే కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్థలు ఏర్పడి ప్రేమానురాగాలు దూరం కావచ్చు. ఇంటిలో అలాంటి అశాంతికి కారణమయ్యే వాస్తు దోషాల గురించి వాస్తు పండితులు చెప్పే విషయాలు తెలుసుకుందాం. 


స్వప్న సౌధ నిర్మాణం అంత సులభం కాదు. జీవితకాలంలో సంపాదించిందంతా వెచ్చించి ఇంటి నిర్మాణం చేస్తుంటారు. చిన్నచిన్న దోషాలు కూడా జీవితంలో ఆనందాన్ని దూరం చేస్తాయి. వాస్తు నియమాలను అనుసరించి ఇల్లు కట్టుకోవడం అన్నిటా శ్రేయోదాయకం.


Also Read: భోగి మంటలకు అన్నీ రెడీ చేసుకుంటున్నారా, ఇవి మాత్రం వేయకండి!


గోడల అలంకారం


గోడలను రంగులతో మాత్రమే కాదు చాలామంది ఇంటి గోడలను వివిధ చిత్రాలు, పెయింటింగ్స్‌ అలంకరిస్తారు. అంతేకాదు, కొందరు గోడలకు విగ్రహాలను కూడా అలంకరిస్తుంటారు. వాస్తు నియమాల ప్రకారం.. గోడలకు విగ్రహాలను వేలాడదీయకూడదు. గోడలకు దేవుడి చిత్రాలను అలంకరించవచ్చు. అలాగే, ఇంట్లో పెట్టుకునే విగ్రహాలు పెద్దవిగా ఉండకూడదు. వాస్తు ప్రకారం అవి 1 నుంచి 11 అంగుళాలను మించి పెద్దవిగా ఉండకూడదు. 


ఈ వైపు అద్దెకు ఇవ్వకూడదు


ఇంటి ఈశాన్య భాగంలో ఎప్పుడూ కూడా టాయిలెట్ నిర్మాణం చెయ్యకూడదు. దీని వల్ల తీవ్రమైన ఆర్థిక సంక్షోభాలు కలుగవచ్చు. అది కుటుంబంలో అశాంతికి కూడా కారణమవుతుంది. ఈశాన్య భాగం ఎత్తులో ఉండకూడదు. ఇంటిలోని ఈశాన్యన పూజా స్థానం ఉండాలి. ఈ భాగాన్ని ఎట్టిపరిస్థితుల్లో అద్దెకు ఇవ్వకూడదు.


లోపలికి తెరచుకోవాలి


ఇంటి తలుపులు ఎప్పుడూ లోపలికి తెరచుకోవాలి. అంతేకాదు, తలుపుల కదలికల్లో శబ్ధం రావడం కూడా అంత మంచి సంకేతం కాదు. ఇదే నియమం కిటికీలకు కూడా వర్తిస్తుంది. ఇలా లేనట్టయితే ఇంటి యజమాని జీవితాంతం దుఃఖిస్తుంటారు. భయం, మానసిక వ్యథ ఎప్పుడూ వేధిస్తుంది.


Also Read: నిత్యం తినే ఆహారంలో 5 రకాలైన దోషాలు, మీరు ఎలాంటి భోజనం చేస్తున్నారో తెలుసా!


శుద్ధి తప్పదు


ఇంట్లోకి గబ్బిలాలు ప్రవేశిస్తే దోషం పదిహేను రోజులు ఉంటుంది. ఇంటిని తప్పనిసరిగా శుద్ధి చేసుకోవాలి. కాకులు, రాబందులు ఇంట్లోకి రావడం అంత మంచిది కాదు. అంతే కాదు ఇంట్లో తేనెటీగలు తుట్టెను పెట్టకూడదు. దీని వల్ల దోషం ఆరు నెలల పాటు ఉంటుంది. ఈ అన్ని దోషాల పరిహారానికి తప్పనిసరిగా ఇంటిని శుద్ధి చేసుకోవాలి.


కొన్ని జాగ్రత్తలు తప్పవు



  • ఇంట్లోని పొయ్యి బయటి నుంచి కనిపించడం అంత మంచిది కాదు, ఇది ఇంటికి శుభ శకునం కాదు. సుఖశాంతులు దూరమవుతాయి.

  • వంట చేసే వారి ముఖం ఎప్పుడూ తూర్పుదిశగా ఉండాలి. ఇక్కడ తయారయ్యే వంట ఆరోగ్యకరంగా ఉంటుంది. ఇంట్లో ఆయురారోగ్యాలు వృద్ది అవుతాయి.

  • రాత్రి భోజనాల తర్వాత వంటింటి ప్లాట్ ఫాం శుభ్రం చేసుకోవడం మానకూడదు. ఇంట్లో ఎప్పుడూ ఎంగిలి పాత్రలను సింక్ లో ఉంచకూడదు.