Varalakshmi Vratham Pooja Vidhanam : వరలక్ష్మీ వ్రతం ఏటా శ్రావణమాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం జరుపుకుంటారు. 2025లో ఆగస్టు 9 శనివారం పౌర్ణమి వచ్చింది.. ఆ ముందురోజు వచ్చే ఆగష్టు 08 శుక్రవారం వ్రతాన్ని ఆచరిస్తారు
శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం - సులభమైన పూజా విధానం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
శ్రీవరలక్ష్మీ వ్రతకథ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
ఆగష్టు 08 శుక్రవారం వరలక్ష్మీ వ్రతం ఆచరించేందుకు శుభ ముహూర్త సమయాలు
సింహ లగ్నం: ఉదయం 6:42 నుంచి 8:47 వరకు
వృశ్చిక లగ్నం: మధ్యాహ్నం 1:00 నుంచి 3:13 వరకు
కుంభ లగ్నం: సాయంత్రం 7:11 నుంచి రాత్రి 8:50 వరకు
వృషభ లగ్నం: అర్ధరాత్రి 12:14 (ఆగష్టు 09 ) నుంచి తెల్లవారుజామున 2:15 వరకు
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వృషభం, సింహం, వృశ్చికం, కుంభం లగ్నంలో పూజ చేయడం శ్రేష్ఠంగా భావిస్తారు.
ఆగష్టు 08 శుక్రవారం పంచాంగం
చతుర్థశి శుక్రవారం మధ్యాహ్నం 1:45 వరకు అనంతరం పౌర్ణమి ఘడియలు ప్రారంభమవుతాయి
ఉత్తరాషాడ నక్షత్రం మధ్యాహ్నం 3:08 వరకు తదుపరి శ్రవణం నక్షత్రం
అమృత ఘడియలు ఉదయం 8:28 నుంచి 10:08 వరకు
వర్జ్యం రాత్రి 7:11 నుంచి 8:49 వరకు
దుర్ముహూర్తం ఉదయం 8:17 నుంచి 9:08 వరకు తిరిగి మధ్యాహ్నం 12:32 నుంచి 1:23 వరకు
వర్జ్యం, దుర్ముహూర్తం లేని సమయం చూసి వరలక్ష్మీ వ్రతం ప్రారంభించవచ్చు. తెలుగు పంచాంగం ప్రకారం ఉదయం 8 లోపు లేదంటే 9 నుంచి 12న్నర లోపు పూజ ప్రారంభించుకోవచ్చు.
పూజా విధానం
వరలక్ష్మీ వ్రతం ఆచరించేవారు ముందుగా పూజా సామగ్రి... దీపం కుందులు, వత్తులు, నెయ్యి, పూలు, పండ్లు, పసుపు, కుంకుమ, తమలపాకులు, వక్కలు, అగరవత్తులు, నాణేలు, నూతన వస్త్రం, కలశం, పంచామృతాలు, అమ్మవారి విగ్రహం, కలశకు కట్టే దారం, బియ్యం, నైవేద్యాలు, కర్పూరం సిద్ధం చేసి పెట్టుకోవాలి.
వేకువజామునే నిద్రలేచి... పూజా మందిరాన్ని శుభ్రం చేసి ముగ్గువేసి తూర్పుదిశగా కూర్చుని పూజ చేసుకునేలా ఏర్పాట్లు చేసుకోవాలి. అమ్మవారిని నూతన వస్త్రం, ఆభరమాలతో అలంకరించుకోవాలి.
ఎప్పటిలా మందుగా గణపతి పూజ చేసి అనంతరం వరలక్ష్మీ పూజా ఆచరించాలి , చారుమతీదేవి కథ చదువుకోవాలి... పూజ పూర్తైన తర్వాత ముత్తైదువులకు తాంబూలం ఇవ్వాలి
వరలక్ష్మీ వ్రతం ప్రాముఖ్యత
వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించడం అంటే లక్ష్మీదేవి అష్టలక్ష్మీ రూపాలను ఆరాధించడమే. తద్వారా అష్ట ఐశ్వర్యాలను పొందవచ్చని భక్తుల విశ్వాసం. ఈ వ్రతాన్ని వివాహితులు తమ భర్త ఆరోగ్యం, దీర్ఘాయుష్షు, కుటుంబ శ్రేయస్సు కోసం ఆచరిస్తారు. అవివాహితులు మంచి భర్త లభించాలని ఆచరిస్తారు. స్కాంద పురాణం ప్రకారం ఈశ్వరుడు పార్వతీదేవికి ఈ వ్రతాన్ని ఆచరించమని ఉపదేశించారు. చారుమతి అనే స్త్రీకి వరలక్ష్మీదేవి కలలో కనిపించి ఈ వ్రతాన్ని ఆచరించమని చెప్పగా ఆమె అనుగ్రహంలో సకల ఐశ్వర్యాలు పొందించి చారుమతీదేవి.
పూజ చేసే విధానం, అలంకారం, ఆర్భాటం కన్నా భక్తి ప్రధానం.
వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించేవారు ఈ రోజు కేవలం సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి...మాంసాహారం నిషిద్ధం పూజ తర్వాత సుమంగళిలకు తాంబూలం, వాయనదానం ఇవ్వాలి గమనిక: ఆధ్యాత్మికవేత్తలు సూచించిన వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల్లో పొందుపరిచిన సమాచారం ఆధారంగా అందించిన కథనం ఇది. దీనిని అనుసరించేముందు మీరు విశ్వశించే పండితుల సలహాలు స్వీకరించగలరు.