Allu Arha Cute Question To Manchu Lakshmi: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్యూట్ చిన్నారి అల్లు అర్హ ఫన్నీ బెస్ట్ మూమెంట్స్ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తన తండ్రితో సరదాగా గడిపిన క్షణాలు, క్యూట్ డైలాగ్స్ బన్నీ షేర్ చేయగా అందరినీ ఆకట్టుకుంటుంటాయి. తాజాగా మంచు లక్ష్మితో అల్లు అర్హ ఫన్నీ మూమెంట్ వైరల్ అవుతోంది.
మంచు లక్ష్మి 'నువ్వు నన్ను ఏదో అడగాలనుకున్నావట కదా ఏంటి?' అని అడగ్గా... మీరు తెలుగువారేనా? అంటూ క్యూట్‌గా ప్రశ్నించింది అర్హ. దీంతో లక్ష్మి షాక్ అవుతూ... 'నేను తెలుగే పాప. నీకు అంత డౌట్ ఎందుకు వచ్చింది.' అంటూ పడి పడి నవ్వగా... 'మీ యాక్సెంట్ అలా ఉంది' అంటూ అర్హ చెప్పడంతో మంచు లక్ష్మితో పాటు అల్లు అర్జున్, స్నేహ కూడా నవ్వుకున్నారు. ఈ వీడియో క్షణాల్లోనే వైరల్ కాగా... క్యూట్ హ్యాపీ మూమెంట్స్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే... గతంలోనూ సోషల్ మీడియోలో మంచు లక్ష్మి భాషపై రీల్స్, మీమ్స్ హల్చల్ చేశాయి. ఆమెలానే మాట్లాడుతూ కొందరు నెటిజన్లు రీల్స్ చేసేవారు.
Also Read: 'వార్ 2' నుంచి ఎన్టీఆర్, హృతిక్ ఎనర్జిటిక్ సాంగ్ టీజర్ - ఆ స్టెప్పులకే దునియా సలాం అనాలంతే...