తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కార్మికుల సమ్మె కొనసాగుతోంది. తమ వేతనాలు 30% పెంచాలని కోరుతూ చిత్రీకరణలు ఆపేశారు. ఈ సమస్యను గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ దృష్టికి నిర్మాతలు తీసుకువెళ్లారు. ఆయనకు పూర్తి వివరాలను తెలిపారు. నిర్మాతలకు బాలయ్య భరోసా ఇచ్చారు.
అవసరం మేరకే కార్మికులను తీసుకోవాలి!బాలకృష్ణతో సమావేశమైన తర్వాత నిర్మాత ఛాంబర్ వ్యవహారాలలో క్రియాశీలకంగా వ్యవహరించే టి ప్రసన్న కుమార్ మీడియాకు వివరాలు వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ... ''బాలకృష్ణ గారు ప్రతి సందర్భంలోనూ నిర్మాత బావుండాలని చెబుతూ ఉంటారు ఇప్పుడు మరొకసారి అదే విషయాన్ని గుర్తు చేశారు షూటింగ్ డేస్ ఎంత తక్కువ అయితే అంత మంచిదని ఆయన తెలిపారు. చిత్రీకరణ సమయంలో అవసరం మేరకు కార్మికులను తీసుకోవాలని సూచించారు. నిర్మాతలతో పాటు కార్మికుల సైతం బాగుండలా తాను చూసుకుంటానని హామీ ఇచ్చారు. థియేటర్ల సమస్యలను దృష్టిలో పెట్టుకుని ప్రతి సంవత్సరం నాలుగు సినిమాలలో నటిస్తానని బాలకృష్ణ గారు తెలిపారు. ప్రస్తుత సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానన్నారు'' అని వివరించారు.
Also Read: విజయవాడలో కాదు... హైదరాబాద్‌లో 'వార్ 2' ప్రీ రిలీజ్ ఈవెంట్ - ట్విస్ట్ ఏమిటంటే?
బాలకృష్ణ కంటే ముందు మెగాస్టార్ చిరంజీవిని నిర్మాతలు కలిసిన సంగతి తెలిసిందే. తెలుగు ఫిలిం ఛాంబర్ - ఫిలిం ఫెడరేషన్ కలిసి సామరస్యంగా సమస్యను పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు. అప్పటికి సమస్య పరిష్కారం కాకపోతే తాను జోక్యం చేసుకుంటానని చిరంజీవి తెలిపినట్లు సి కళ్యాణ్ వివరించిన సంగతి తెలిసిందే.