Shwetha Menon : సెక్స్ కంటెంట్ ఉన్న సినిమాలు , ప్రకటనల్లో యాక్ట్‌ చేసి అక్రమంగా డబ్బు సంపాదించారనే ఆరోపణలతో నటి శ్వేతా మీనన్పై కేసు నమోదు అయింది. మలయాళం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల ముందు జరుగుతున్న పరిణామాలు ఆసక్తిని లిగిస్తున్నాయి. ఇప్పుడు జరుగుతున్న పోటీల్లో ఆమె కూడా పోటీదారుగా ఉన్నారు. అలాంటి ఆమెపై నాన్బెయిలబుల్కేసు నమోదు కావడం సంచలనంగా మారుతోంది.

నటి శ్వేతా మీనన్ పై ఎర్నాకుళం సెంట్రల్ పోలీసులు ఐటీ చట్టంలోని సెక్షన్ 67Aతో సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. సెక్షన్ ద్వారా ఆమెకు బెయిల్ వచ్చేందుకు వీలు లేని అభియోగాలు మోపారు. సోషల్ యాక్టివిస్ట్ మార్టిన్ మేనచేరి పిటిషన్ను విచారించిన ఎర్నాకుళం చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు ఆదేశాలతో పోలీసులు చర్యలు తీసుకున్నారు. కోర్టు ఆదేశాలతోనే పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు.

'పలేరి మాణిక్యం: ఓరు పతిరకోలపాఠకథింటే కథ', 'రతినిర్వేదం' 'కలిమన్ను' వంటి చిత్రాలలో శ్వేతా మీనన్ నటించారు. కావాలని ఇలాంటి సినిమాల్లో డబ్బుల కోసం నటించారని పిటిషన్లో పేర్కొన్నారు. సినిమాలతోపాటు కండోమ్ప్రకటనలో కూడా ఆమె నటించారని వాటితోపాటు ఆన్‌లైన్‌లో అశ్లీల ప్రకటనల్లో పాల్గొని మార్టిన్ ఆరోపించారు.

శ్వేత నటించిన సినిమాల్లోని సీన్లు, ప్రకటనలు సోషల్ మీడియా, ఇంటర్నెట్లో విస్తృతంగా షేర్లు అయ్యాయని, ఇప్పటికీ కొన్ని కొన్ని సార్లు కనిపిస్తున్నాయని మార్టిన్ తెలిపారు. వీటి ద్వారా శ్వేత బాగా లాభపడ్డారని కూడా పేర్కొన్నారు. భారతీయ శిక్షాస్మృతి, ఐటీ యాక్ట్ ప్రకారం ఆమె చట్టాన్ని ఉల్లంఘించారని కోర్టుకు తెలిపారు.

వాదనలు విన్న కోర్టు నాన్బెయిలబుల్ కేసు నమోదుకు ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో ఎఫ్ఐర్నమోదు చేసిన పోలీసులు మిగతా విషయాలపై దర్యాప్తు చేస్తున్నారు. ఐటీ చట్టంతో పాటు, ఇమ్మోరల్ ట్రాఫిక్ (నియంత్ర) చట్టంలోని సెక్షన్ 3, 5 కింద అభియోగాలు మోపినట్టు పోలీసులు వెల్లడించారు.

మలయాళ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(AMMA) ఎన్నిక ఆగస్టు 15 జరగనుంది. ఎన్నికల్లో శ్వేత మీనన్అధ్యక్ష పదవికి పోటీ చేయడానికి రెడీ అవుతోంది. ఇంతలో ఆమెపై నాన్బెయిలబుల్ కేసు రిజిస్టర్ కావడం ఎన్నికల్లో కీలక మలుపుగా చెప్పవచ్చు. "అమ్మ" ఎన్నికల్లో ప్రెసిడెంట్ పదవి కోసం ఆరుగురు వ్యక్తులు నామినేషన్ దాఖలు చేశారు. ఇందులో నలుగురు వ్యక్తులు వెనక్కి తగ్గారు. ఇప్పుడు పోటీలో శ్వేత, నటుడు దేవన్ మాత్రమే ఉన్నారు.

ఈ మలయాళ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పోలింగ్‌ ఆగస్టు 15న జరగనుంది. ఈ ఎన్నికల్లో  ఒక వేళ శ్వేత ఎన్నికైతే మలయాళ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కు తొలి మహిళా ప్రెసిడెంట్అవుతారు. ఇప్పుడు కేసు ఎన్నికలు ఎలా మలుపు తిప్పనున్నాయో అన్న ఆసక్తి నెలకొంది.     

గత ఏడాది కాస్టింగ్కౌచ్ ఆరోపణలు మలయాళ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ను కుదిపేశాయి. ప్రభుత్వం దీనిపై జస్టిస్ హేమా కమిటీ వేసింది. ఆ కమిటీ నివేదికతో అప్పటి వరకు ఈ అసోసియేషన్కు ప్రెసిడెంట్గా ఉన్న నటుడు మోహన్ లాల్ రాజీనామా చేశారు. ఇన్నాళ్లకు ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి.