NTR's War 2 Telugu Pre Release Event: బాలీవుడ్ సినిమాల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ కల్చర్ తక్కువ. కాలేజీలకు వెళ్లి ఈవెంట్లు చేస్తారు. ముంబైలో ప్రెస్ మీట్స్ పెడతారు. కానీ, తెలుగులో అలా కాదు! సినిమాకు ముందు అభిమానుల సమక్షంలో భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్స్ నిర్వహిస్తారు. ఎన్టీఆర్ ఫస్ట్ హిందీ సినిమా 'వార్ 2'కు కూడా తెలుగులో భారీ ఈవెంట్ ప్లాన్ చేశారు. ఆ కార్యక్రమం గురించి నిర్మాత నాగవంశీ అప్డేట్ ఇచ్చారు.
విజయవాడలో కాదు... హైదరాబాద్ సిటీలోనే!విజయవాడలో 'వార్ 2' ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుందని ప్రచారం జరిగింది. అది నిజం కాదు. హైదరాబాద్ సిటీలో 'వార్ 2' ఈవెంట్ చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ స్టేట్స్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ తీసుకున్న సూర్యదేవర నాగవంశీ తెలిపారు.
War 2 Pre Release Event Place And Date: ఆదివారం... అంటే ఆగస్టు 10న హైదరాబాద్ సిటీలో 'వార్ 2' ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయనున్నట్లు నాగవంశీ స్పష్టం చేశారు. అయితే ఇంకా అనుమతులు రాలేదని తెలిపారు. పోలీసుల నుంచి అనుమతులు లభించిన తర్వాత వెన్యూ డీటెయిల్స్ అనౌన్స్ చేయనున్నారు.
ఆగస్టు 14న సినిమా విడుదల... ఆ పాటపై ఆసక్తి!War 2 Release Date: 'వార్ 2' రిలీజ్ డేట్ అందరికీ తెలిసిందే. ఆగస్టు 14న ఈ సినిమా థియేటర్లలోకి వస్తోంది. అంత కంటే ముందు హీరోలు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ మీద తెరకెక్కించిన పాట మీద అందరి ఆసక్తి నెలకొంది. గురువారం (ఆగస్టు 7న) ఆ సాంగ్ గ్లింప్స్ విడుదల చేయనున్నారు. ఫుల్ సాంగ్ థియేటర్లలో చూడాలని యష్ రాజ్ ఫిల్మ్స్ సంస్థ పేర్కొంది. తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో సినిమా విడుదల అవుతోంది.
Also Read: ఎవరీ వెంకటేష్ నాయుడు? ఆయనతో తమన్నాకు సంబంధం ఏమిటి? గోల్డ్ - లిక్కర్ స్కాంలో మిల్కీ బ్యూటీ