'బాహుబలి'లో అనుష్క శెట్టి యుద్ధం చేశారు. బాణాలు వేశారు. ఆవిడ యాక్షన్ చేయడం కొత్త కాదు. అయితే... 'ఘాటి' గ్లింప్స్‌ మాత్రం ఆవిడను కొత్త కోణంలో చూపించింది. ఓ బస్సులో మనిషి పీక కోయడం చూసి ఆడియన్స్ అంతా ఆశ్చర్యపోయారు. ఇవాళ విడుదల చేసిన 'ఘాటి' ట్రైలర్ అందుకు పదింతలు అన్నట్టుంది. అనుష్క యాక్షన్ విశ్వరూపం చూపించారు. 

పెళ్లి ఎప్పుడు? వెయిటింగ్ ఇక్కడ?గంజాయి నేపథ్యంలో 'ఘాటి' తెరకెక్కించినట్టు ట్రైలర్ ద్వారా స్పష్టం చేశారు. 'ఈ ఘాట్లలో ఘాటీలు ఉంటారు సార్! బ్రిటిష్ కాలంలో కొండలు బద్దలుకొట్టి రక్తంతో రోడ్లు వేసినోళ్లు! ఇప్పుడు గంజాయి మోసే కంచర గాడిదలు. వీళ్ళు కదిలే కొండలు సార్' వాయిస్ ఓవర్ వినిపిస్తుంటే... హీరో హీరోయిన్లు విక్రమ్ ప్రభు, అనుష్క శెట్టి సహా వాళ్ళ నేపథ్యాన్ని పరిచయం చేశారు. అనుష్కను బస్ కండక్టర్ అన్నట్టు చూపించారు. అదే సమయంలో ఆవిడ గంజాయి స్మగ్లింగ్ చేసినట్టూ స్పష్టం చేశారు. 

'మీరు కూడా త్వరగా పెళ్లి చేసుకోండిరా. ఎవరి పెళ్లి అయినా మీ పెళ్లిలా ఫీల్ అవుతుంది' అని విక్రమ్ ప్రభుతో రాజా చెప్పే డైలాగ్ బావుంది. అయితే అనుష్క శెట్టిని 'పెళ్లి ఎప్పుడు డార్లింగ్?' అని రాజు సుందరం అడగటం... 'వెయిటింగ్ ఇక్కడ' అని సమాధానం ఇవ్వడాన్ని ఆమె వ్యక్తిగత జీవిటంతో కొందరు ముడి పెడుతున్నారు. అప్పటి వరకు ఓ సాధారణ కథగా ఉన్న 'ఘాటి' విలన్ ఎంట్రీతో ఇంటెన్స్ యాక్షన్ డ్రామాగా మారింది. చైతన్య రావు, రవీంద్ర విజయ్ క్యారెక్టర్లు - వాళ్ళ నటన కథ స్వరూపాన్ని మార్చేసింది. 'ఘాటీలకు పెంచడం, దాటించడం తెలిస్తే చాలు! బిజినెస్ మీ బతుకులకు సెట్ కాదు' అంటూ డైలాగ్ డెలివరీలోనూ, నటనలోనూ చైతన్య రావు చూపించిన విలనిజం బావుంది.

Also Read: 'మయసభ' వెబ్ సిరీస్ రివ్యూ: చంద్రబాబుకు ప్లస్సా? లేదా వైయస్సార్ & వైసీపీకి ప్లస్సా? ఓటీటీలో దేవాకట్టా రాజకీయ మాయాజాలం ఎలా ఉందంటే?

'ఘాటి' ట్రైలర్ మొత్తంలో హైలైట్ అంటే అనుష్క శెట్టి యాక్షన్ విశ్వరూపం. ఇక చివరలో 'సీతమ్మోరు లంకా దహనం చేసినట్టే' అంటూ ఆ 'హై'ను పీక్స్ కు తీసుకు వెళ్లారు దర్శకుడు క్రిష్ జాగర్లమూడి. ఆయన నుంచి ఇటువంటి యాక్షన్ ఫిల్మ్ రావడం ప్రేక్షకులకు సర్‌ప్రైజ్.

సెప్టెంబర్ 5న సినిమా విడుదల!అనుష్కా శెట్టి, విక్రమ్ ప్రభు జంటగా నటించిన 'ఘాటి' సినిమాను యూవీ క్రియేషన్స్ సమర్పణలో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మించారు. ఈ సినిమాను సెప్టెంబర్ 5న విడుదల చేయనున్నట్లు తెలిపారు.

Also Readఎవరీ వెంకటేష్ నాయుడు? ఆయనతో తమన్నాకు సంబంధం ఏమిటి? గోల్డ్ - లిక్కర్ స్కాంలో మిల్కీ బ్యూటీ