సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) అభిమానులతో పాటు ఘట్టమనేని కుటుంబాన్ని అభిమానించే ప్రేక్షకులు... అందరి చిరకాల కోరిక నెరవేరుతోంది. దర్శక ధీరుడు రాజమౌళి (Rajamouli)తో మహేష్ సినిమా సెట్స్ మీదకు వెళ్ళింది. అయితే ఇప్పుడు అభిమానులంతా కోరుకునేది ఒక్కటే... ఒక్కటంటే ఒక్క అప్డేట్! మరి మహేష్ పుట్టినరోజు (Mahesh Babu Birthday) సందర్భంగా ఈ నెల (ఆగస్టు) 9వ తేదీన అయినా అది వస్తుందా? 

జక్కన్న వైపే అభిమానుల చూపు!మహేష్ బాబు, రాజమౌళి కలిసి సినిమా చేస్తున్నారని పాన్ ఇండియా ఆడియన్స్ అందరికీ తెలుసు. అయితే, ఆ సినిమాకు సంబంధించి ఒక్కటంటే ఒక్క అఫీషియల్ అప్డేట్ కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదు. 

అల్యూమినియం ఫ్యాక్టరీలో సినిమాకు పూజ జరిగిందని తెలుసు. ఒక్క ఫోటో కూడా బయటకు రానివ్వలేదు రాజమౌళి. ఆ పూజ జరిగిన తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా రాజమౌళి అటెండ్ అయ్యారు. ఆ ప్రోగ్రాంలో ఫోటో చూపించమని సుమ అడిగినా సరే మౌనం వహించారు జక్కన్న. 

హైదరాబాద్ సిటీలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ఫస్ట్ షెడ్యూల్ చేసిన తర్వాత యూనిట్ అంతా ఒరిస్సా వెళ్లారు. అక్కడ షూటింగ్ చేసినప్పుడు కొన్ని విజువల్స్ లీక్ అయ్యాయి. అంతే తప్ప రాజమౌళి మాత్రం ఒక్క మాట మాట్లాడలేదు. ఆ తర్వాత సినిమా వేడుకలకు ఆయన హాజరైనా సరే సినిమా అప్డేట్ మాత్రం ఇవ్వలేదు. దాంతో మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా అప్డేట్ ఇస్తారా? లేదా? అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.

అప్డేట్ వచ్చే అవకాశాలు తక్కువ!SSMB29 Movie Updates: తన తండ్రి, దివంగత సూపర్ స్టార్ కృష్ణ ప్రతి పుట్టినరోజుకు తన కొత్త సినిమా అప్డేట్ ఇవ్వడం మహేష్ బాబుకు అలవాటు. అయితే ఈ ఏడాది మే 31న కృష్ణ జయంతి సందర్భంగా ఎటువంటి అప్డేట్ ఇవ్వలేదు. సో, మహేష్ బాబు బర్త్ డేకి కూడా అప్డేట్ వచ్చే అవకాశాలు తక్కువ అని యూనిట్ సన్నిహిత వర్గాల వినికిడి.

Also Read'మయసభ' వెబ్ సిరీస్ రివ్యూ: చంద్రబాబుకు ప్లస్సా? లేదా వైయస్సార్ & వైసీపీకి ప్లస్సా? ఓటీటీలో దేవాకట్టా రాజకీయ మాయాజాలం ఎలా ఉందంటే?

SSMB29 పూర్తి కావడానికి టైమ్ పడుతుంది. ఇప్పటి నుంచి అప్డేట్స్ ఇస్తూ వెళితే సినిమా విడుదల సమయానికి సర్‌ప్రైజ్‌లు ఏమీ ఉండవని దర్శక ధీరుడి ఆలోచన కింద తెలుస్తోంది. గ్లోబల్ స్టార్ ప్రియాంకా చోప్రా కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్, తమిళ స్టార్ ఆర్ మాధవన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను దుర్గా ఆర్ట్స్ పతాకం మీద కేఎల్ నారాయణ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

Also Read:'మయసభ' వర్సెస్ రియల్ లైఫ్: చంద్రబాబు, వైయస్సార్ to ఇందిరా గాంధీ... ఎవరి పాత్రలో ఎవరు నటించారు? ఎవరి పేరు ఎలా మార్చారు?