NTR Hrithik Roshan War 2 Energetic Song Salam Anali Teaser Out: ప్రపంచవ్యాప్తంగా మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న మూవీ 'వార్ 2'. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ లీడ్ రోల్స్‌లో నటించిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ ఆగస్ట్ 14న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన లవ్ సాంగ్, ట్రైలర్ భారీ హైప్ క్రియేట్ చేయగా... ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తోన్న మరో ఎనర్జిటిక్ సాంగ్ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. 'రేయి పగలు ఏదైనా కానీ మనం ఉంటే కాదా దివాళీ. దునియా సలామే సలాం అనాలి.' అంటూ ఫుల్ జోష్‌తో పాట అదిరిపోయింది. ఎన్టీఆర్, హృతిక్ ఇద్దరూ హుషారుగా గ్రేస్ స్టెప్పులతో అదరగొట్టారు. పూర్తి పాటను మాత్రం థియేటర్లలోనే ఎంజాయ్ చేయాలంటూ మూవీ టీం కోరింది.

Also Read: విడాకులు తీసుకుంటున్న మరో హీరోయిన్? ఉన్నట్టుండి వస్తున్న లీక్స్ వెనుక కారణం ఏమిటి?

డిఫరెంట్‌గా ప్రమోషన్స్

ఈ మూవీ ప్రమోషన్స్ డిఫరెంట్‌గా ప్లాన్ చేశారు మేకర్స్. అటు సోషల్ మీడియాలోనూ ట్రెండింగ్ వార్ నడుస్తోంది. #NTRvshrithik #HrithikvsNTR హ్యాష్ ట్యాగ్స్ కోసం ఎన్టీఆర్, హృతిక్ మధ్య ఫన్నీ వార్ జరగ్గా... కాంప్లికేట్ చెయ్యొద్దంటూ హృతిక్ చెప్పగా... నేను చెప్పేది బాగుంది అన్నారంటే నేను గెలిచినట్లే అంటూ ఎన్టీఆర్ రిప్లై ఇచ్చారు. తాజాగా ఎన్టీఆర్... హృతిక్ ఇంటికి ఓ బిల్ బోర్డు పంపిస్తూ... 'మీకు కాళ్లు అలుపు వచ్చేలా డ్యాన్స్ చేసినా మాతో యుద్ధం గెలవలేరు.' అంటూ ఫన్నీగా రాసుకొచ్చారు. దీనికి రియాక్ట్ అయిన హృతిక్... ఎన్టీఆర్‌‌కు కూడా రిటర్న్ గిఫ్ట్ పంపించారు. 'నాటు నాటు... నీకు ఎంత కావాలంటే అంత కానీ యుద్ధంలో నేను గెలుస్తున్నా.' అంటూ ఓ బిల్ బోర్డ్ పంపించారు.

దీనికి స్పందించిన ఎన్టీఆర్... 'మీరు పంపిన రిటర్న్ గిఫ్ట్ చాలా బాగుంది హృతిక్ సర్. అయితే ఇది ముగింపు కాదు. అసలైన యుద్ధం ఆగస్ట్ 14న స్టార్ట్ అవుతుంది. అప్పుడు కలుద్దాం.' అంటూ రిప్లై ఇచ్చారు.

హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్

ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ నెల 10న ఈవెంట్ చేయనున్నట్లు తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూషన్ రైట్స్ తీసుకున్న ప్రొడ్యూసర్ నాగవంశీ తెలిపారు. పోలీస్ అనుమతి వచ్చిన తర్వాత వెన్యూ డీటెయిల్స్ పూర్తి వివరాలు వెల్లడించనున్నట్లు చెప్పారు. 

ఎన్టీఆర్‌కు ఇది ఫస్ట్ బాలీవుడ్ మూవీ కాగా భారీ హైప్ క్రియేట్ అవుతోంది. ఇద్దరు స్టార్స్ సిల్వర్ స్క్రీన్‌పై చేసే వార్ కోసం మాస్ ఫ్యాన్స్‌తో పాటు మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్, ట్రైలర్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ ఫ్రాంచైజీలో భాగంగా ఆరో మూవీగా రాబోతోంది. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తుండగా... కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ నెల 14న హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ కానుంది.